24, మే 2012, గురువారం

మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రొఫైల్

AA


* 1964 అగస్టు 8న జన్మించిన మోపిదేవి
* స్వస్థలం- గుంటూరు జిల్లా నిజాంపట్నం
* పూర్తిపేరు మోపిదేవి వెంకట రమణారావు
* నిజాంపట్నంలో ప్రాథమిక విద్య
* విజయవాడ లయోలా కాలేజీలో డిగ్రీ
* 1987లో నిజాంపట్నం మండల అధ్యక్షునిగా ఎన్నిక
* 1989 1994లో కూచినపూడి అసెంబ్లీ స్థానంలో పోటీ
* రెండుసార్లు ఓటమి పాలైన మోపిదేవి
* 1999,2004 2009లో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్
* 1999, 2004లో కూచినపూడి నుంచి విజయం
* 2009లో రేపల్లె నుంచి విక్టరీ
* 2007లో వైఎస్ కేబినెట్లో తొలిసారిగా మంత్రి పదవి
* మౌలికవసతులు, పెట్టుబడుల మంత్రిగా మోపిదేవి
* వాన్ పిక్ భూకేటాయింపుల్లో ఆరోపణలు
* వాన్‌ పిక్ భూముల కేసులో మోపిదేవి అరెస్ట్
* ప్రస్తుతం ఎక్సైజ్ మంత్రిగా కొనసాగుతున్న మోపిదేవి
* మోపిదేవిపై మద్యం సిండికేట్ల లంచం ఆరోపణలు
* 10లక్షలు లంచం తీసుకున్నట్లు ఏసీబీ రిమాండ్ రిపోర్ట్


మంత్రి మోపిదేవి వెంకటరమణ మెడకు వాన్ పిక్ ఉచ్చు బిగుసుకుంది. నిమ్మగడ్డ ప్రసాద్ నేతృత్వంలోని వాన్ పిక్ సంస్థకు కేటాయించిన భూకేటాయింపులలో అవకతవకలు జరిగినట్లు సీబీఐ గుర్తించడంతో మోపిదేవిని అరెస్టు చేశారు. ఆర్థిక, న్యాయ శాఖలు వారించినా వివాదాస్పద జీవోలను మోపిదేవి ఇచ్చారనే ఆరోపణలతో సీబీఐ ఆయనను అదుపులోకి తీసుకుంది. మోపిదేవి ప్రొఫైల్ ను ఓ సారి చూద్దాం.

వాన్‌పిక్ భూముల వ్యహారంలో తొలి వికెట్ పడింది. అప్పటి మౌళిక సదుపాయాల మంత్రి, ఇప్పటి ఎక్సైజ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ జైలు పాలయ్యారు. అభియోగాలు ఎదుర్కొంటున్న ఆరుగురు మంత్రుల్లో మొట్టమొదటగా వెంకటరమణను అరెస్ట్ చేశారు. గత రెండు రోజులుగా విచారణ ఎదుర్కొంటున్న మోపిదేవిని సీబీఐ అరెస్ట్ చేసింది. దాంతో అభియోగాలు ఎదుర్కొంటున్న మిగతా మంత్రుల్లో గుబులు మొదలైంది. జగన్ మోహన్‌ రెడ్డిపై చర్య తీసుకొనేముందు మంత్రులపై కఠిన చర్యలుంటాయని అందరూ భావించినట్లే ప్రభుత్వం వ్యవహరించింది. ఈ జైలు బాటలో ఇంకా ఎవరెవరున్నారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.

ప్రస్తుతం ఎక్సైజ్ మంత్రిగా కొనసాగుతున్న మోపిదేవిపై మద్యం సిండికేట్ల లంచం ఆరోపణలు ఒకవైపు ఉన్నాయి. పది లక్షలు లంచం తీసుకున్నట్లు ఏసీబీ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. మరోవైపు వాన్ పిక్ భూకేటాయింపుల్లో ఆరోపణలున్నాయి. వివాదాస్పద జీవోలు 2008 జులై ఏడు నుంచి 2009 జులై 31వ తేదీ లోపున విడుదల చేసినట్లు మోపిదేవిపై ప్రధాన ఆరోపణ. జీవో నెంబర్ 19, 21 నుంచి 30 వరకు, 32, 35, 36, 42 జీవోలు విడుదలపై వివాదం చెలరేగుతోంది. దాంతో సీబీఐ సెక్షన్‌ 120బి రెడ్ విత్ 420 కింద మోపిదేవిని అరెస్ట్ చేసింది.సెక్షన్ 477, 420, 409, పీసీ యాక్ట్ 13(2) రెడ్ విత్ 13(1) డి కింద కేసులు నమోదు చేసి సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. అందులో భాగంగానే సీబీఐ మోపిన అభియోగాల మేరకు సీబీఐ కోర్ట్ మోపిదేవిని రిమాండ్‌కు పంపించింది.

మోపిదేవి వెంకటరమణారావు 1964 సంవత్సరం ఆగస్టు 8న గుంటూరు జిల్లా నిజాంపట్నంలో జన్మించారు. వీరరాఘవయ్య, నాగులమ్మ దంపతులకు రమణ మొదటి సంతానం. రమణకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రాథమిక విద్యంతా నిజాంపట్నంలోనే సాగగా..డిగ్రీ విజయవాడలోని లయోలా కాలేజీలో పూర్తి చేశారు. తర్వాత రాజకీయాలలోనూ చేరి రాణించారు. తొలిసారిగా నిజాంపట్నం మండల అధ్యక్షునిగా 1987లో గెలుపొందారు. తర్వాత 1989, 1994లో కాంగ్రెస్ పార్టీ తరపున కూచినపూడి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఐతే.. పట్టు వదలని విక్రమార్కునిలా 1999, 2004లో కూచినపూడి నుంచి .. 2009లో రేపల్లె నుంచి విక్టరీ కొట్టి హ్యాట్రిక్ సాధించారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో తొలిసారిగా 2007లో మౌలిక వసతులు, పెట్టుబడులు, ఓడరేవులు, న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత సాంకేతిక విద్యాశాఖ, ఎక్సైజ్ శాఖా మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం కిరణ్ కుమార్‌ రెడ్డి మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖామంత్రిగా మోపిదేవి కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం మోపిదేవిని గతంలో మౌళిక, పెట్టుబడుల శాఖ నిర్వహించిన సమయంలోనే వాన్‌పిక్ భూముల వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారని సీబీఐ అరెస్ట్ చేసింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి