అమెరికాలోని
కాలిఫోర్నియా సముద్ర తీరంలో జపాన్ ఫుకుషిమా అణు ప్రమాదానికి చెందిన
రేడియేషన్ చేరుకుందని వెల్లడయింది. ఫుకుషిమా దై-చి అణు కర్మాగారంలో ప్రమాదం
జరిగిన నెల రోజులకే రేడియేషన్ అమెరికా తీరానికి వచ్చిందని శాస్త్రవేత్తల
పరిశోధనల్లో తేలింది. దీనితో అనేక సంస్ధలు, పర్యావరణ ఉద్యమవేత్తలు,
స్వచ్ఛంద కార్యకర్తలు వ్యక్తం చేసిన అనుమానాలు నిజమేనని తేలింది.
ఫుకుషిమా ప్రమాదం
అనంతరం, కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ (సి.ఎస్.యు), లాంగ్ బీచ్ కి
చెందిన శాస్త్రవేత్తలు ఆరంజ్ కౌంటీ, శాంతా క్రాజ్ లతో పాటు ఇతర ప్రాంతాల్లో
కెల్ప్ (సముద్ర ఫంగై మొక్కలు) మొక్కల నమూనాలను సేకరించారు. వీటిలో రేడియో
యాక్టివ్ అయోడిన్ కనుగొన్నామరనీ, అది ఫుకుషిమా నుండి వచ్చినదేననీ వారు
తెలిపారు. ప్రమాదం జరగడానికి ముందు సదరు మొక్కల్లో ఉన్నదాని కంటే 250
రెట్లు అధిక రేడియేషన్ ప్రమాదం అనంతరం నమోదయిందని వారు తెలిపారు. అయితే
దానివల్ల ప్రమాదం లేదని తెలిపారు.
“మౌలికంగా, కాలిఫోర్నియా కెల్ప్ (Macrocystis pyrifera) బ్లేడ్స్
లో మేము దాన్ని చూసాము” అని సి.ఎస్.యు లో బయాలజీ ప్రొఫెసర్ అయిన స్టీవెన్
మేన్లీ చెప్పాడని ఎస్.ఎఫ్.గేట్ వెబ్ సైట్ తెలిపింది. ఇది ‘శాన్ ఫ్రాన్
సిస్కో క్రానికల్’ కి చెందిన వెబ్ సైట్. ‘అయోడిన్ 131′ కి ఎనిమిది రోజుల
హాఫ్ లైఫ్ మాత్రమే కనుక కెల్ప్ పైనా, చేపలపైనా, మనుషుల పైనా దీనివల్ల
ప్రభావం ఉండదని స్టీవెన్ తెలిపాడు.
Basically, we saw it in all the California kelp blades we sampled. [Iodine 131] has an eight-day half-life, so it’s pretty much all gone, but this shows what happens half a world away does effect what happens here. I don’t think these levels are harmful, but it’s better if we don’t have it at all.–Steven Manley, CSU Long Beach biology professor
రేడియేషన్ వెలువరించే
పదార్ధం రేడియేషన్ ని నిరంతరం వెలువరించడం వల్ల దాని పరిణామం తగ్గిపోతుంది.
అలా సగం భాగం తగ్గిపోయే కాలాన్ని ‘హాఫ్-లైఫ్’ అంటారు.
అయోడిన్ 131 కి
“ఎనిమిది రోజుల హాఫ్-లైఫ్ మాత్రమే ఉంది. కనుక దానిలో చాలా భాగం మాయమై
ఉంటుంది. కానీ సగం ప్రపంచం దూరంలో జరిగిన దాని ప్రభావం ఇక్కడ ఎలా ఉంటుందో
ఇది చూపుతోంది. ఈ లెవెల్స్ హానికరం అని నేననుకోను. కానీ అదసలు లేకపోతేనే
మంచిది కదా” అని స్టీవెన్ వ్యాఖ్యానించాడు.
కెల్ప్ ని చేపలు
తింటాయి గనక రేడియో ధార్మికత చేపలకు సోకి ఉండవచ్చని స్టీవెన్ తెలిపాడు.
చేపలు కెల్ప్ లను తింటే హానికరమా కాదా అన్నది ఇంకా తెలియదని ఆయన తెలిపాడు.
ఆయన చెప్పిన విషయాన్ని ఎస్.ఎఫ్.గేట్ వెబ్ సైట్ ఇలా తెలిపింది.
“If they were feeding on it, they definitely got dosed. We just don’t know if it was harmful. It’s probably not good for them. But no one knows,” Manley said. “In the marine environment, it was significant, but probably not harmful at the levels we detected it, except it may have affected certain fish’s thyroid systems.”
కెల్ప్ లో కనుగొన్న అయోడిన్ 131 స్దాయి వల్ల చేపలకు ఎంత హానికరమో తెలిపే పరిశోధన ఇంకా పబ్లిష్ కాలేదని మరో బయాలజీ ప్రొఫెసర్
క్రిస్టఫర్ లోవ్ తెలిపాడు. అయోడిన్ 131 పదార్ధం సహజ మూలక పదార్ధం కాదు.
ఇది న్యూక్లియర్ ఫిషన్ వల్ల జరిగే ఉత్పత్తుల్లోనే ఉంటుంది. సముద్రంలో అనేక
ఇతర రేడియో ధార్మిక పదార్ధాలు ఉన్నప్పటికీ అయోడిన్ 131 మాత్రం ఉండదు.
ఫుకుషిమా రేడియేషన్
అమెరికా వరకూ వచ్చే సమస్యే లేదని అమెరికా అధికారులు ప్రమాదం జరిగాక అనేక
సార్లు వ్యాఖ్యానించారు. అలాంటివన్నీ గాలి వార్తలని వ్యాఖ్యానించారు. అణు
రియాక్టర్ లు తయారు చేసే బడా బహుళజాతి కంపెనీలు పోషించే శాస్త్రవేత్తలు
ఇలాంటి వ్యాఖ్యలలో భాగం పంచుకున్నారు. తీరా వచ్చాక అదసలు ప్రమాదకరమే కాదని
కొట్టిపారేయడం ప్రారంభిస్తారు. రేడియేషన్ అసలు అమెరికాకే చేరలేదన్న తమ
వాదనకు సమాధానం చెప్పే బాధ్యత వదిలిపెట్టి ఎంతయితే ప్రమాదకరమో లెక్కలు
వల్లించడం వీరు మొదలెడతారు. తద్వారా తమ ప్రారంభ వాదనలే ‘అశాస్త్రీయం’,
‘ఆధార రహితం’, ‘అసత్య ప్రచారం’ అన్న వాస్తవాన్ని మరుగున పెట్టడానికి
ప్రయత్నిస్తారు. ఈ అబద్ధాల సంస్కృతిని ఎకాలజిస్టులు నెత్తిన వేసుకోవడం ఒక
దుష్పరిణామం.
స్వచ్ఛంద సంస్ధలు,
కార్యకర్తలు చేసే ప్రయోగాలనూ, డేటా సేకరణనూ ‘అశాస్త్రీయం’గా, ‘ఆధారరహితం’గా
‘దుష్ప్రచారం’గా కొట్టి పారేయడం వీరికి చాలా ఇష్టం. లాభాల కోసం అనేక
దుర్మార్గాలకు పాల్పడే అణు కంపెనీల నుండి వచ్చిపడే బ్యాంకు బ్యాలెన్సులు
కూడా వారికి ఇష్టమే.
కెల్ప్ సముద్ర మొక్కలు
కాలిఫోర్నియా తీరం అంతటా వ్యాపించి ఉంటాయని తెలుస్తోంది. ఆల్గే జాతి
మొక్కల్లో ఇదే పెద్దది. భూమిపై ఉన్న ఏ జీవ పదార్ధం కన్నా ఇది వేగంగా
పెరుగుతుందని స్టీవెన్ తెలిపాడు. దీనికి అయోడిన్ ను సేకరించే లక్షణం
ఉన్నందున రేడియేషన్ ప్రమాదం ఎంతవరకు వ్యాపించిందో తెలుసుకునేందుకు ఇది బాగా
సహాయపడుతుందని తెలిపాడు. ఈ మొక్కలకు ఉపరితలం విస్తృతంగా వ్యాపించి ఉండడం
వల్ల నిరంతరం గాలితో సంబంధం కలిగి ఉండి గాలిలో జరిగే మార్పులన్నింటినీ
ప్రతిబింబిస్తుందనీ తెలిపాడు. అంతేకాక రేడియో యాక్టివ్ అయోడిన్ ను పెద్ద
ఎత్తున సేకరిస్తుంది. ప్రతి ఒక నీటి మాలిక్యూల్ కి గానూ 10,000 అయోడిన్
మాలిక్యుల్స్ ని కెల్ప్ మొక్కల టిస్యూ లు కలిగి ఉంటాయని తెలిపాడు.
అయోడిన్ స్ధాయి ఒక
గ్రాము డ్రై వెయిట్ కి 2.5 బిక్యూరల్స్ గా నమోదయిందనీ, ఫుకుషిమా ప్రమాదం
ముందు స్ధాయి కంటే ఇది చాలా ఎక్కువనీ పరిశోధన కి సంబంధించిన నివేదిక
తెలిపింది. ఈ నివేదికను ‘ఎన్విరాన్ మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ వెబ్ సైట్ ప్రచురించింది. ఈ నివేదిక డబ్బు చెల్లించగలవారికి తప్ప అందరికీ అందుబాటులో లేదు.
ఆరంజ్ కౌంటీలో మూడు
చోట్ల కెల్ప్ ని సేకరించారు. లాస్ ఏంజలీస్ కౌంటీలోని ‘పాలోస్ వెర్డేస్
పెనింసులా’ లోనూ, శాంతా బార్బరా, పసిఫిక్ గ్రోవ్, శాంతా క్రాజ్ లలో కూడా
దీనిని సేకరించారు. అయోడిన్ 131 ను అత్యధిక పరిణామంలో న్యూపోర్ట్ బీచ్ లోని
‘కోరోనా డెల్ మార్’ తీరంలో కనుగొన్నారు. గత సంవత్సరం ఏప్రిల్ 15 న ఈ సేకరణ
జరిగింది. ఇక్కడే 2.5 బిక్యూరల్/ గ్రామ్ అయోడిన్ కనుగొన్నారు. శాంతా
క్రాజ్ లో 2 బిక్యూరల్/గ్రామ్ అయోడిన్ ని కనుగొన్నారు. శాంతా బార్బరా,
పసిఫిక్ గ్రోవ్ లలో 1 బిక్యూరల్/గ్రాక్ తక్కువ రేడియో ధార్మిక అయోడిన్ ని
కనుగున్నారు. ఒక నెల తర్వాత మే 2011 లో తీసిన శాంపిళ్లలో రేడియో ధార్మిక
పదార్ధం కనుక్కోగల స్ధాయిలో లేదని తెలుస్తోంది. అప్పటికి రేడియో ధార్మిక
పదార్ధం కనుక్కోలేని స్ధాయికి క్షీణించింది.
ఎస్.ఎఫ్.గేట్ వెబ్ సైట్ ఏప్రిల్ 8, 2012 తేదీన ఈ వార్త ప్రచురించింది.
ఇదే పరిశోధనను
ఉటంకిస్తూ లాస్ ఏంజిలిస్ టైమ్స్ పత్రిక కూడా కధనం ప్రచురించింది. 1986
చెర్నోబిల్ ప్రమాదం దరిమిలా ఉత్తర వాషింగ్టన్, బ్రిటిష్ కొలంబియా (కెనడా)
లలో కనుగొన్న రేడియేషన్ తో ఇక్కడి రేడియేషన్ పోల్చదగ్గ స్ధాయిలో ఉందని
ఎల్.ఎ.టైమ్స్ తెలిపింది. అది ఇలా పేర్కొంది.
The levels, while most likely not harmful to humans, were significantly higher than measurements prior to the explosion and comparable to those found in British Columbia, Canada, and northern Washington state following the Chernobyl disaster in 1986, according to the study published in March in the journal Environmental Science & Technology.
ఫుకుషిమా అణు
కర్మాగారంలో జరిగిన పేలుడు వలన వాతావరణంలోకి రేడియో ధార్మిక పదార్ధాలు
విడుదల అయ్యాయనీ ముఖ్యంగా అయోడిన్ 131 పదార్ధం పసిఫిక్ సముద్రాన్ని దాటాయనీ
పరిశోధన నివేదిక తెలిపినట్లు ఎల్.ఎ.టైమ్స్ తెలిపింది. అలా దాటి వచ్చిన
పదార్ధం ఇక్కడ కురిసిన వర్షం ద్వారా సముద్రంలోకి చేరి ఉండవచ్చని నివేదికలో
రాశారని తెలిపింది. ఎల్.ఎ.టైమ్స్ వార్తను ఇక్కడ చూడవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి