17, మే 2012, గురువారం

ముఖ్యమైన న్యూక్లియర్ ఆయుధ పరిశోధనా ప్రదేశాలు


సహజంగా న్యూక్లియర్ ఆయుధాల పరిశోధనా ప్రదేశాలు ఎక్కడో దూరంగా ఎవరికీ తెలియని ప్రదేశాలుగా ఉంటాయి. ప్రజా సమూహానికి దూరంగా, శాంతిని కోరుకొనే సామాజిక సంఘాల కళ్ళకు కనబడని చోటును ప్రభుత్వాలు వెతుక్కుంటాయి. ఆయుధ పరిశోధన పూర్తికాగానే అంతవరకు వార్తలలో చోటుచేసుకోని ఆ ప్రదేశాలు ప్రజలకు తెలుస్తుంది. ఎప్పుడూ గుర్తుండిపోతుంది. ప్రస్తుతం 7 దేశాలు న్యూక్లియర్ ఆయుధాల క్లబ్ లో ఉన్నాయి. ఇందులో కొన్ని దేశాలలో ప్రజా సమూహానికి దూరంగా ఉన్న ప్రదేశాలను వెతుక్కోవటం కష్టం మైంది. పక్కనున్న దేశాలు నిరసన తెలిపినా పట్టించుకోకుండా ఆ దేశాలకు దగ్గరగా పరిశోధించడం జరిగింది. న్యూక్లియర్ ఆయుధ పరిశోధన పూర్తి అయినాక ఆ ప్రదేశాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలియక ప్రభుత్వాలు తలలు బాధుకుంటున్నాయి.

కోహ కాంబరన్(Koh Kambaran)...పాకిస్తాన్......న్యూక్లియర్ ఆయుధాల క్లబ్బులోకి జేరిన చివరి దేశం పాకిస్తాన్. 1983 లోనే పాకిస్తాన్ కు న్యూక్లియర్ ఆయుధం తయారుచేయగల సామర్ధ్యం ఉన్నదని ప్రపంచానికి తెలిసినా 1998 మే నెలలో పాకిస్తాన్లో న్యూక్లియర్ ఆయుధ పరిశోధన జరిపేరు. ఈ ఆలశ్యానికి కారణం ఆయుధ పరిశోధన ప్రదేశం గుర్తించడానికే. 1976 లోనే కోహ కాంబరన్ ప్రదేశాన్ని గుర్తించినా, అది కొండ ప్రదేశం కావటంతో అందులో 1 కిలోమీటర్ లోతుకు టనల్ త్రవ్వి అక్కడ చేయవలసి వచ్చింది. పాకిస్తాన్ రాజకీయ కలహాల వలన చివరికి 1978 లో ఒకేసారి 5 బాంబులతో పరిశోధన ముగించేరు. మొట్టమొదటి ఆయుధ పరిశోధనా దినమైన మే28 ని జాతీయ సెలవి దినంగా ప్రకటించేరు.

మరలింగా(ఆస్ట్రేలియా).....1940-1950 ల మధ్య బ్రిటీష్ వారికి న్యూక్లియర్ ఆయుధ పరిశోధనకు వారి దేశంలో చోటు దొరకలేదు. కానీ అప్పుడు వారి సామ్రాజ్యం ప్రపంచమంతటా వ్యాపించి ఉండటమంతో వారు చాలా దేశాలలో న్యూక్లియర్ పరిశోధనలు జరిపేరు. ఈ పరిశోధనలలోనే చర్చానీయమైనది ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని ఒప్పించి వారి దేశంలోని మరలింగా ప్రదేశంలో 1953 న పరిశోధన జరిపేరు. అక్కడున్న కొద్దిమందిని వేరే చోటుకు తరలించేరు. ఆ తరువాత 1963 వరకు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. అయితే ఆ ప్రాంతంలో న్యూక్లియర్ రేడియో ఆక్టివ్ గాలిలో బాగా ఎక్కువై పరిశోధించేవారే జబ్బులకు గురి అవడంతో పరిశోధనలు ఆపేసి ఆ ప్రదేశం మొత్తాన్నీ క్లీన్ చేసేరు. 1967 వరకు క్లీన్ చేస్తూనే ఉన్నారు. 1980 లో ఆ ప్రదేశం సురక్షితమైనదిగా ప్రకటించినా 2000 వరకు అక్కడికి ఎవరినీ పంపలేదు. ఇప్పుడుకూడా ఆ ప్రదేశంలో ఎవరూ లేరు. ఈ పరిశోధనా ప్రదేశంలో క్లీనింగ్ కూ, అక్కడ అంతకు ముందు నివసించిన ప్రజలకూ, పరిశోధనలలొ జబ్బు పడిన బ్రిటీష్ శైనికులకూ కాంపన్ సేషన్ క్రింద అత్యధికమైన డబ్బు ఖర్చు పెట్టేరు.

పోక్రాన్(ఇండియా)...1962 చైనా యుద్దం తరువాత ఇండియా న్యూక్లియర్ ఆయుధ పరిశోధన చేయలని నిర్ణయించుకుంది. పరిశోధన కోసం రాజస్తాన్ లోని పోక్రాన్ ప్రదేశాన్ని ఎంచుకుంది. ఎవరూ నివసించని ప్రదేశంగా ప్రభుత్వం తెలిపినా, అక్కడ సుమారు 15,000 మంది దాకా నివసిస్తున్నారని పత్రికలు తెలుపుతున్నాయి. 1974 మొదటి పరిశోధన(పోక్రాన్-1) జరిపేరు. ఈ పరిశోధన కు ప్రపంచదేశాలన్నీ నిరసన వ్యక్తం చేసేయి. న్యూక్లియర్ ను శాంతి కోసమే వాడతామని హామి ఇచ్చేరు. 1998 మే 11 న పోక్రాన్-2 మరియూ 13 న తర్మో న్యూక్లియర్ ఆయుధాన్ని పరిశోధించేరు. పరిశోధనా ఫలితాలు విజయవంతం కానందున ఇండియా కొత్త పరిశోధనలు చేయటం లేదని పశ్చిమ దేశాలు వెళ్ళడించేయి. పోక్రాన్ పరిశోధనా ప్రదేశాన్ని ఉపసం హరించుకున్నారని తెలిపేరు. ఇండియన్ ప్రభుత్వం దీనిని కాదనలేదు, అవుననలేదు. కానీ ఈ ప్రదేశాన్ని మాత్రం ప్రభుత్వ పరిధిలోనే ఉంచేరు. విదేశీ పర్యాటకులను గానీ, భారత పర్యాటకులనుగానీ ఆ ప్రదేశానికి అనుమతించరు.

బికిని అటాల్(Bikini Atoll)....అమెరికాలో పలుచోట్ల న్యూక్లియర్ ఆయుధాల పరిశోధనలు జరిగినా, ఈ ఐలాండ్ ప్రదేశం ముఖ్యత్వం పొందింది. దానికి రెండు కారణాలు. ఒకటి ఈ ప్రదేశం గురించి సమాచారం మరియూ ఫోటోలు ఉన్నాయి. రెండు, అటాల్ అనే ఈ ప్రదేశం నుండి అమెరికాలో ప్రసిద్ది చెందిన డ్రస్సులు తయారైనై. అందులో ముఖ్యమైనది "బికిని". 1945 లో ఈ ప్రదేశంలో పరిశోధించిన ఆటం బాంబులనే హీరిషీమా, నాగాసాకీలపై వేయబడింది. యుద్దాలలో లొంగిపోయిన, పట్టుబడ్డ యుద్ద నౌకల మీద ప్రయోగాలు జరిపేరు. ఈ ద్వీపం అంతా రేడియో ఆక్టివ్ తొ నిండి ఉంటుంది గనుక ఇక్కడికి ఎవరినీ అనుమతించరు.

కిరిటిమతి(Kiritimati).... సాదారణంగా ఎవరికీ అందుబాటులో లేని ఈ ప్రదేశాన్ని 2 దేశాలు న్యూక్లియర్ ఆయుధ పరిశోధనా ప్రదేశంగా ఎంచుకోవటంతో ఈ ప్రదేశం ప్రశిద్ది చెందింది. ఆస్ట్రేలియాకీ, నార్త్ అమెరికాకూ మధ్య ఉన్న ఈ ప్రదేశాన్ని 1957 న బ్రిటీష్ వారు పరిశోధనా కెంద్రముగా వాడుకున్నారు. వారు వదిలేసి వెళ్ళిన తరువాత 1962 లో అమెరికా వారు ఈ ప్రదేశాన్ని వాడుకున్నారు.

లాప్ నుర్…Lop Nur (చైనా)......1964 లో మొదటి సారిగా చైనావారు ఈ ప్రదేశంలో న్యూక్లియర్ ఆయుధాలను పరిశోధన చేసేరు. ఇక్కడే హైడ్రొజన్ బాంబును కూడా పరిశోదించేరు. 1996 తరువాత పరిశోధనలను ఆపేసేరు.1800 B.C.కి చెందిన పురాతణ నగరం ఇక్కడ ఉన్నది. ప్రక్యాతి గాంచిన తరీం మమ్మీస్ ఇక్కడే ఉన్నాయి. అయుతే ఆ నగరానికి ఏమైందో, అక్కడున్న ప్రజలను ఎక్కడికి తరలించేరో లోకానికి తెలియనివ్వలేదు.

మురురో…Mururoa (ఫ్రాన్స్)......ఈ ప్రదేశం చలా గొడవలకు దారి తీసింది. ఎందుకంటే పసిఫిక్ మాహా సముద్రానికి దగ్గరగా ఉండటంతో మిగిలిన దేశాలు నిరసన వ్యక్తం చేసేయి. అయినా ఫ్రాన్స్ దేశం వారి నిరసనలను పట్టించుకోకుండా ఆ ప్రదేశం లో 1966 నుండి 1996 లోపు గాలిలో 41 బాంబులనూ, భూమి క్రింద 141 బాంబులన పరిశోధన చేసింది. న్యూజీలాండ్ కు దగ్గరగా ఉండటంతో 1985 లో న్యూజీలాండు కూ, ఫ్రాన్స్ కూ గొడవలు మొదలై యుద్దం దాకా వచ్చింది. అంతర్జాతీయ ఒత్తిడుల వలన రెండు దేశాలూ వెనక్కి వెళ్ళినై. అదే అంతర్జాతీయ ఒత్తిడి వలనే ఫ్రాన్స్ పరిశోధనలను మానుకుంది.

నొవయా జెంలయా……Novaya Zemlya (రష్యా).......ఆర్కటిక్ సర్కిల్ పైన దూరం గా ఉండే ఈ ప్రదేశాన్ని రష్యా వారు ఎన్నుకున్నది ప్రపంచానికి తెలియదు. 1954 నుండి అక్కడ పరిశోధనలు మొదలుపెట్టేరు. కానీ వారు జరిపిన అతి పెద్ద 100 మెగా టన్నుల పరిశోధనతో విషయం ప్రపంచానికి తెలిసింది. ఎక్కడో అత్యంత దూరంలో ఉన్న ప్రదేశం కావటంతో ప్రత్యర్ధి దేశాలు పెద్దగా పట్టించుకోలేదు. ఈ ప్రదేశానికి రవాణా సౌకర్యాలు కష్టంగా ఉండటంతో రష్యా వారే ఈ ప్రదేశంలో పరిశోధనలు ఆపేరు.

సెమీపలటన్సిక్…Semipalatinsk (రష్యా)......రష్యా వారు పరిశోధనా ప్రదేశాన్ని నొవాయా జెంలియా నుండి ఇక్కడి మార్చుకున్నారు. సోవియట్ యూనియన్ పడిపోయిన తరువాత ఈ ప్రదేశం కజెకిస్తాన్లో కలిసిపోయింది. స్టాలిన్ సమయములో ఇక్కడా బానిస కార్మీకులు ఉండేవారు. వారెవరినీ మరో ప్రదేశానికి తరలించకుండానే అక్కడ పరిశోధనలు జరిపేరు. రష్యా వారు ఏమి చేస్తున్నారో తెలుసుకోవడానికి అమెరికా వారు U2 గూఢచారి విమానాన్ని పంపేవారు. ఇది తెలుసుకున్న రష్యా వారు వారి పరికరాలను భూమి క్రింద టనల్ మూలంగా తీసుకు వెళ్ళేవారు. సోవియట్ యూనియన్ పడిపోయిన తరువాత ఈ ప్రదేశాన్ని కజెకిస్తాన్ కు అప్పగించేరు. అయితే ఆ ప్రదేశంలో 465 సార్లు న్యూక్లియర్ పరిశోధనలు జరపటం వలన అక్కడ నివసిస్తున్న 2,20,000 మందికీ రేడియేషన్ జబ్బులు పట్టుకున్నాయి. అక్కడ ఆరోగ్య పరిస్తితి మెరుగు పడాలంటే మరికొన్ని దశాబ్ధాలు పడుతుంది.

నెవేడా పరిశోధనా ప్రదేశం….Nevada Test Site (అమెరికా)....అత్యంత న్యూక్లియర్ రేడియేషన్ కలిగిన ప్రదేశం. ఎందుకంటే ఇక్కడ 928 సార్లు పరిశోధనలు జరుపబడ్డాయి. లాస్ వేగాస్ కు 107 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం లాస్ వెగాస్ లోని జూద వ్యాపారస్తులకు పెద్ద వ్యాపార ప్రకటనగా మారింది. లాస్ వేగాస్ లో జూదానికి వచ్చిన వారికి న్యూక్లియర్ బాంబుల పరిశోధనలను చూపిస్తామని కూడా ప్రకటన చేసేరు. ఎన్నో సినిమాలు ఇక్కడ తీసేరు. నైజమైన న్యూక్లియర్ బాంబుల పరిశోధనలో వెలువడిన మట్టిన నిజంగానే సినిమాలలో చూపించేరు.ఎప్పుడైతే అక్కడికి వచ్చే ప్రజలకూ, చుట్టు పక్కల నివసిస్తున్న ప్రజలకూ ఆరొగ్య దెబ్బతింటోందని గ్రహించేరో అమెరికాలో కంగారు పెరిగింది.1982 లో ప్రభుత్వం మీద ప్రజలు కొర్టులో దావాలు వెసేరు. 500 మిల్లియన్ డాలర్లు నష్ట పరిహారం చెల్లించేరు. ఆ చుట్టు పక్కల ఆరోగ్య పరిస్తితిని మెరుగు పరచడానికి 5 బిల్లియన్ డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా. 2009 లో ఈ ప్రదేశాన్ని ప్రపంచంలోనే అత్యధిక రేడియో ఆక్టివి కలిగిన ప్రదేశంగా (చెర్నబాయిల్ కంటే ఎక్కువగా) ద్రువీకరించేరు. ఈ ప్రదేశంలో ఉన్న రేడియో ఆక్టివ్ లెవల్స్ హీరోషీమా, నాగసాకీలలో బాంబు వేసిన వెంటనే ఎంత ఉన్నదో దాని కంటే ఎక్కువగా ఉంటుందని నమ్ముతున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి