3, మే 2012, గురువారం

రికార్డు స్థాయికి యూరో జోన్‌ నిరుద్యోగం


  • మార్చిలో 11% పెరుగుదల
యూరో జోన్‌లోని 17 దేశాల్లో నిరుద్యోగం రికార్డు స్థాయికి చేరి ఆ దేశాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో ఆ దేశాల అభివృద్ధి నిలిచిపోయి, అక్కడి నేతలకు నిరుద్యోగం అతి పెద్ద సవాల్‌గా మారుతుంది. కేవలం 2012 మార్చిలో ఈ దేశాల్లో నిరుద్యోగం 10.9 శాతం పెరిగి 1,69,000 మంది నిరుద్యోగులుగా మారారు. 1999లో యూరోజోన్‌ ఆవిర్భవించనప్పటి నుండి తొలి సారి నిరుద్యోగుల సంఖ్య ఈ స్థాయికి చేరడం ఇదే తొలి సారి అని యూరోజోన్‌ అధికారింగా గణాంకాలను వెల్లడించింది. గతేడాది మార్చి నిరుద్యోగంతో పోల్చితే ఇది 10.8 శాతం, ఫిబ్రవరిలో 9.9 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. దీంతో ఆ దేశాల ఆర్థిక వ్యవస్థ ఆందోళనకర స్థాయికి చేరుకుంది. వాటి రుణ పరపతి తగ్గడం, ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. యూరోజోన్‌లోని స్పెయిన్‌, నెదర్లాండ్‌ దేశాల పరిస్థితి తీవ్ర సంక్షోభంలోకి వెలుతున్నాయని అధికారిక గణంకాల్లో పేర్కొంది.

గడిచిన మార్చిలో జర్మనీలో 19,000 మంది నిరుద్యోగులుగా మారారు. ఈ స్థాయిలో ఇక్కడ నిరుద్యోగం తాండవించడం గడిచిన 25 నెలల్లో ఇదే మొదటి సారి. స్పెయిన్‌ నిరుద్యోగం 24.1 శాతం పెరిగి మిగిత దేశాల కంటే ఆందోళనకర స్థాయిలో పడింది. ఆస్ట్రేలియాలో అతి తక్కువ నిరుద్యోగిత చోటు చేసుకుంది. ఇక్కడ కేవలం ఇది 4 శాతంగా ఉంది. యూరోపియన్‌ యూనియన్‌లో సభ్యత్వం లేని బ్రిటన్‌, పోలండ్‌లోనూ నిరుద్యోగం 10.2 శాతంగా నమోదు చేసుకుంది. ఫిబ్రవరిలో వీటి పెరుగుదల 9.4 శాతంగా ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి