3, మే 2012, గురువారం

క్లుప్తంగా… 02.05.2012


జాతీయం

రిలయన్స్ ని అధిగమించిన టాటా కన్సల్టెన్సీ
tcsబుధవారం షేర్ మార్కెట్లు ముగిసేనాటికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ (టి.సి.ఎస్) అత్యధిక విలువ గల కంపెనీగా అవతరించింది. ‘మార్కెట్ క్యాపిటలైజేషన్’ ప్రకారం ఇప్పుడు టి.సి.ఎస్ అతి పెద్ద కంపెనీ. గత అయియిదేళ్లుగా రిలయన్స్ కంపెనీ ఈ స్ధానంలో కొనసాగుతూ వచ్చింది. బుధవారం ట్రేడ్ ముగిసేనాటికి టి.సి.ఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రు. 2,48,116 కోట్లు కాగా, రిలయన్స్ మార్కెట్ క్యాప్ రు. 2,43,413 కోట్లు. బుధవారం ఆర్.ఐ.ఎల్ షేర్లు 0.25 శాతం పడిపోగా టి.సి.ఎస్ షేర్లు 1.83 శాతం పెరిగింది. 2006 లో ఓ.ఎన్.జి.సి ని అధిగమించిన రిలయన్స్ మధ్యలో కొన్ని సార్లు తప్ప అధిక్య స్ధానంలో కొనసాగింది. కంపెనీ షేర్ విలువను మొత్తం షేర్లతో హెచ్చించగా వచ్చేదే మార్కెట్ క్యాపిటలైజేషన్.

ఈవ్ టీజింగ్ అడ్డుకున్నందుకు హత్య
alagesanబెంగుళూరులో ఈవ్ టీజింగ్ అడ్డుకోబోయిన వృద్ధుడిని గుండె  పై కొట్టడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఒక టీనేజీ యువతి తన ఇంటి వద్ద షాపుకి వెళ్ళగా ఇద్దరు యువకులు టీజ్ చేయడం మొదలు పెట్టారు. యువతి తల్లి వారిని వారించడంతో ఆమెతో తగవుకి దిగారు. ఎందుకు తగువు పడుతున్నారని యువతి బాబాయి అలగేశన్ అడ్డు వెళ్లడంతో యువకులు కోపోద్రిక్తులై ఆయనపై చేయి చేసుకున్నారు. కొద్ది సంవత్సరాల క్రితం అలాగేషన్ గుండేకు సర్జరీ చేయించుకోవడంతో యువకుడి దెబ్బలకి తట్టుకోలేక ఆసుపత్రికి వెళ్తుండగానే చనిపోయాడు. యువకులిద్దరినీ అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు డి.సి.పి తెలిపాడని ఎన్.డి.టి.వి తెలిపింది. ఈవ్ టీజింగ్ తమ హక్కుగా యువకులు భావించే స్ధితి వచ్చేసినట్లు కనిపిస్తోంది.
అంతర్జాతీయం

15 సం.ల గరిష్ట స్ధాయికి యూరోజోన్ నిరుద్యోగం
eurozone jobless17 దేశాల మానిటరీ యూనియన్ ‘యూరో జోన్’ లో నిరుద్యోగం మున్నేన్నడూ లేనంత స్ధాయికి చేరుకుంది. మార్చి నెల నాటికి యూరో జోన్ లో 1.74 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని యూరోపియన్ గణాంకాల కార్యాలయం ‘యూరో స్టాట్’ తెలిపింది. అందులో 25 సంవత్సరాల లోపు నిరుద్యోగులు 30 లక్షల మంది ఉన్నారని తెలిపింది. ఫిబ్రవరితో పోలిస్తే ఇది 1.7 లక్షలు అధికమని తెలుస్తోంది. యూరో జోన్ దేశాల్లో 24.1 నిరుద్యోగంతో స్పెయిన్ అగ్ర స్ధానంలో ఉండగా, 21.7 శాతంతో గ్రీసు రెండో స్ధానంలో ఉంది. ఋణ సంక్షోభం సాకుగా చూపి యూరప్ దేశాలన్నీ పొదుపు విధానాలు అమలు చేస్తుండడంతో నిరుద్యోగం తారాస్ధాయికి చేరింది. ఆస్ట్రియా అతి తక్కువ గా 4 శాతం నిరుద్యోగం నమోదు చేయగా హాలండ్ 5 శాతం నమోదు చేసింది. పొదుపు విధానాలపై ఏకాభిప్రాయం కుదరక హాలండులో గత వారమే ప్రభుత్వం కూలిపోయింది.
ఆఫ్ఘన్ యుద్ధంలో మరో ఇద్దరు నాటో సైనికులు మృతి
US-led-forcesఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ యుద్ధంలో మరో ఇద్దరు నాటో సైనికులు మృతి చెందినట్లు నాటో ప్రకటించింది. తూర్పు ఆఫ్ఘనిస్ధాన్ లో ఐ.ఇ.డి (ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజీవ్ డివైజ్) పేలి ఒక నాటో సైనికుడు మృతి చెందాడని నాటో తెలిపింది. అయితే అతను ఏ దేశానికి చెందిందీ నాతో చెప్పలేదు. తూర్పు ఆఫ్ఘనిస్ధాన్ లో ఉన్నది అమెరికా సైనికులేనని తెలుస్తోంది. మరణించినవారి జాతీయతను నాటో వెంటనే ప్రకటించదు. అమెరికా సైనికులైతే అసలే చెప్పదు. మరొక సైనికుడు ఎలా చనిపోయిందీ కూడా నాటో ప్రకటన చెప్పలేదు. ఐ కాజువాలిటీస్ వెబ్ సైట్ ప్రకారం 2012 లో ఇప్పటివరకూ 140 మంది విదేశీ సైనికులు చనిపోయారు. సైనికుల మరణాలు పెరుగుతుండడంతో పశ్చిమ దేశాలలో యుద్ధ వ్యతిరేకత నానాటికీ తీవ్రమవుతోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి