1, డిసెంబర్ 2011, గురువారం

వీసాలపై పరిమితిని సడలించిన అమెరికా

వాషింగ్టన్: విదేశీయులకు ఉద్యోగ వీసాల సంఖ్యపై విధిస్తున్న పరిమితిని సడలించాలన్న ప్రతిపాదనతో రూపొందించిన ఓ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. విదేశీ ఉద్యోగ వీసాల సంఖ్యపై పరిమితిని సడలిస్తూ ప్రవేశపెట్టిన బిల్లు (హెచ్‌ఆర్ 3012)కు ఈ మేరకు ప్రతినిధుల సభ ఓటు ద్వారా ఆమోదం తెలిపింది. దీంతో అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారత్, చైనా తదితర దేశాల పౌరులకు ప్రయోజనం చేకూరనుంది. ఇంతవరకూ ఒక్కో దేశానికి ఏడు శాతం ఉద్యోగ వీసాలను మాత్రమే ఇస్తున్న అమెరికా ఇకపై ఆ వీసాల సంఖ్యను 15 శాతానికి పెంచనుంది.

ఏ దేశానికైనా ఏడు శాతం వీసాలు మాత్రమే ఇస్తుండటంతో ఇంతవరకూ భారత్ లాంటి పెద్ద దేశాలకు, ఇతర చిన్న దేశాలకు కూడా అంతే సంఖ్యలో అమెరికా ఉద్యోగ వీసాలు లభించేవి. మొత్తం ఉద్యోగ వీసాలు ఏటా 1,40,000 కాగా, ఏ దేశానికైనా అందులో ఏడు శాతం అంటే 9,800 వీసాలు మాత్రమే లభించేవి. ఈ వ్యత్యాసం నేపథ్యంలో అమెరికన్ కాంగ్రెస్ తాజా బిల్లును ఆమోదించింది. అలాగే గ్రీన్‌కార్డు కోరుకునేవారు 12 ఏళ్లలోనే దానిని పొందే అవకాశం కూడా కలగనుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి