20, డిసెంబర్ 2011, మంగళవారం

కాగితం పులి (లోక్‌పాల్‌) వర్సెస్ బెబ్బులి(జన్‌లోక్‌పాల్)



అవినీతికి పాల్పడేవారి పీచమణచడానికి కాగితం పులి లాంటి లోక్‌పాల్ బిల్లు పనికి రాదనీ, ఆ స్థానంలో బెబ్బులి లాంటి జన లోక్‌పాల్ తీసుక రావాల్సిందేనని అన్నా హజారే తన ప్రాణాలను సైతం అర్పించడానికి దీక్ష బూనారు. అన్నా అవినీతిపై చేస్తున్న పోరాటానికి దేశం యావత్తూ మద్దతు పలుకుతోంది.

అవినీతిని అంతమొందించే బెబ్బులి లాంటి జన్‌ లోక్‌పాల్ బిల్లు ముసాయిదాను అన్నాహజారే నేతృత్వంలోని బృందం తయారు చేస్తే పేపరు పులి లాంటి లోక్‌పాల్ బిల్లును ప్రభుత్వం ముందుకు తెచ్చింది. అయితే నిఖార్సయిన బిల్లును తీసుక రావాలని అన్నా హజారే పట్టుబడుతున్నారు. ఇంతకీ లోక్ పాల్ బిల్లుకీ జన్ లోక్‌పాల్ బిల్లుకీ మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో ఒక్కసారి పరిశీలిద్దాం...

లోక్‌పాల్ బిల్లు:
1. పదవిలో ఉన్న ప్రధానమంత్రిపై దర్యాప్తు జరిపే అధికారం లేదు.
2. దేశ పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభ ఛైర్మన్, దిగువ సభ లోక్‌సభ స్పీకర్ ఆమోదించిన ఫిర్యాదులపైనే దర్యాప్తు చేపడుతుంది.
3. లోక్‌పాల్ సలహాసంఘం పాత్ర నామమాత్రం. తన దృష్టికివచ్చిన అంశాలను సంబంధిత వ్యవస్థలకు, అధికారులకు సిఫార్సు చేస్తుంది.
4. లోక్‌పాల్, సీబీఐలోని అవినీతి నిరోధిక విభాగాలు దేనికవే స్వతంత్రంగా వ్యవహరిస్తాయి.
5. ఈ బిల్లులో ప్రతిపాదించిన ప్రకారం అవినీతి కేసులో కనీసశిక్ష ఆరు నెలల జైలు అయితే గరిష్ఠం ఏడేళ్లు.

జన్‌లోక్‌పాల్ బిల్లు:
1. ప్రధానమంత్రినైనా విచారించే అధికారం ఈ బిల్లు ద్వారా ఏర్పడుతుంది.
2. జన్‌లోక్‌పాల్ ఏ అంశంపైనైనా అవసరమనుకుంటే తనంతటతానే దర్యాప్తు మొదలు పెడుతుంది. పౌరులను నుంచి కూడా ఫిర్యాదులను స్వీకరిస్తుంది.
3. ఆరోపణలు ఎదుర్కొంటున్న సంబంధిత వ్యక్తి/ సంస్థపై న్యాయవిచారణ జరుపుతుంది.
4. ఎఫ్‌ఐఆర్ నమోదు సహా పోలీసులకు వుండే అన్ని అధికారాలు లోక్‌పాల్‌కు ఉంటాయి.
5. సీబీఐ అవినీతి నిరోధక విభాగంతోపాటు, కేంద్ర విజిలెన్స్ కమీషన్ వంటి ఇతర అవినీతి నిరోధక సంస్థలు జన్‌లోక్‌పాల్‌లో విలీనమై ఒకే వ్యవస్థగా రూపాంతరం చెందుతాయి.
6. కనీస శిక్ష పదేళ్ల జైలు. గరిష్ఠం జీవితఖైదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి