* పార్లమెంటులో ప్రభుత్వం వివరణ
అలాగే మన దేశంలోద్రవ్యోల్బణం కట్టడికి ఆర్‌బిఐ చేపట్టిన కఠిన ద్రవ్యవిధాన చర్యలు కూడా కారణమేనని ఆర్థికశాఖ సహాయమంత్రి నమో నారాయణ్ మీనా ఒక లిఖితపూర్వక సమాధానంలో రాజ్యసభలో తెలిపారు. 2011-12 లో వృద్ధి రేటు 9% ఉండగలదని ఫిబ్రవరిలో ప్రకటించిన ఆర్థిక సర్వేలో ప్రకటించినా ప్రభుత్వం ఇటీవలే పార్లమెంటుకు సమర్పించిన మధ్యంతర వార్షిక నివేదికలో అభివృద్ధి అంచనాలను 7.5 శాతానికి కుదించిన విషయాన్ని మంత్రి ఈసందర్భంగా సభ దృష్టికి తెచ్చారు. 2010-11తో పోల్చితే ఈ ఏడాది దేశ ఆర్థికప్రగతి మందగించినా జిడిపి వృద్ధి పెంచుకుంటున్న ప్రపంచ దేశాల్లో భారత్ ఒకటిగా వుందని మీనా పేర్కొన్నారు. గ్లోబల్ ఆర్థిక సంక్షోభం ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం ఆర్‌బిఐతో కలిసి పలు పాలసీ చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు.
వృద్ధిరేటు పెంచేందుకు ప్రభు త్వం ఇటీవల చేపట్టిన ప్రత్యేక చర్యల్లో వౌలికరుణ నిధి ఏర్పాటు, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యాలను ప్రోత్సహించడం, నూతన వస్తూత్పత్తి విధానం, ముసాయిదా టెలి కాం విధానం ప్రకటన, పార్లమెంటులో భూసేకరణ బిల్లు ప్రవేశపెట్టడం, బ్యాంకింగ్ సెక్టార్ అభివృద్ధికి చట్టపరమైన చర్యల వంటివి ముఖ్యమైనవిగా మంత్రి సభకు వివరించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి