అమెరికాలోని కాలిఫోర్నియా విమానాశ్రయంలో మధ్యవయస్కుడైన ఓ సిక్కు వ్యక్తిపై శ్వేతజాతీయుడు దాడి చేశాడు. అయితే, ఇది విద్వేషపూరితమైన దాడి కాదని పోలీసులు అంటున్నారు. సిక్కును అతను కత్తితో పొడిచాడు. అతని పేరు చెప్పడానికి పోలీసులు నిరాకరిస్తున్నారు. కాలిఫోర్నియా నుంచి అతను ఇండియాకు వస్తుండగా ఈ సంఘటన జరిగింది. కత్తి వల్ల జరిగిన గాయానికి చికిత్స చేశారు. గాయంతోనే అతను ఇండియాకు ప్రయాణమైనట్లు సోమవారంనాటి వార్తలు తెలియజేస్తున్నాయి.
తన అనువాదకుడితో ఉండగా, ఏ విధమైన రెచ్చగొట్టే సంఘటన లేకుండానే సిక్కు వ్యక్తిపై అతను దాడి చేశాడు. దాడి చేసిన వ్యక్తికి, దాడికి గురైన వ్యక్తికి మధ్య ఏ విధమైన సంభాషణ జరగలేదు. దాడి చేసిన 26 ఏళ్ల మిచెల్ డుఫర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి