20, డిసెంబర్ 2011, మంగళవారం

పవిత్ర గ్రంథాన్ని కోర్టుకు లాగడం సరికాదు: అలెగ్జాండర్

హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతను ఇస్కోన్ వ్యవస్థాపకుడు ఎసి భక్తివేదాంత స్వామి ప్రభుపాద రచించిన భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అనే పుస్తకం విశ్వవ్యాప్తంగా గౌరవనీయమైనదని, అందువల్ల దాన్ని నిషేధించాలనటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని రష్యన్ అంబుడ్స్‌మన్ వ్లాదిమర్ లుకిన్ అన్నారు.

పవిత్ర గ్రంథాన్ని కోర్టుకు లాగటం సరికాదని, లౌకికవాదానికి, పరమత సహనానికి ప్రసిద్ధి గాంచిన సైబీరియాలోని అందమైన నగరం టోమ్‌స్క్‌లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం విచారకరమని, ఇది ఎంతో బాధాకరమని భారత్‌లో రష్యా రాయబారి అలెగ్జాండర్ ఎం కదాకిన్ ఓ ప్రకటనలో అన్నారు.

హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతను నిషేధించాలని కోరటాన్ని భారతదేశంలోని రష్యా రాయబారి కార్యాలయం, రష్యన్ అంబుడ్స్‌మన్ ఖండించింది. ఈ నిషేదంపై రష్యన్ అంబుడ్స్‌మెన్, మాస్కోకు చెందిన నిపుణులు, సెయింట్ పీటర్స్‌బర్గ్ నుంచి అభిప్రాయాలు తీసుకొని అప్పుడు నిర్ణయం తీసుకోవాలని ఇస్కోన్ రష్యా విభాగం కోరడంతో పాటు భగవద్గీత నిషేదంపై పెనుతుఫాను చెలరేగడంతో రష్యన్ కోర్టు తీర్పును ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసును పిటిషన్‌దారులు ఎప్పుడైనా ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయని కొందరి అభిప్రాయం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి