7, డిసెంబర్ 2011, బుధవారం

షార్జాలో బందీలుగా భారత కార్మికులు

Sharjahసంపాదన కోసం వచ్చిన భారతీయులకు షార్జాలో నానా ఇక్కట్లు ఎదరువుతున్నాయి. ఇది ఎండమావులను తలపిస్తోంది. షార్జాలోని కరమ్ క న్‌స్ట్రక్షన్ కంపెనీ 125 మంది భారతీయులను బందీలు చేసినట్లు సమాచారం అందింది. బాధితులలో 40 మంది కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలవాసులే ఉన్నారు. కంపెనీ వారికి ఏడాదిగా జీతాలు చెల్లించడం కుండా వేధిస్తోందనే ఆరోపణలు వచ్చాయి. 

రెండున్నరేళ్లుగా వీసాలు రెన్యూవల్ చేయకపోవడంతో కార్మికులు కోర్టును ఆశ్రయించారు.అయితే కేసు ఉపసంహరించుకుంటే స్వదేశానికి పంపుతామని కంపెనీ హామీ ఇవ్వడంతో వారు వెనక్కి తగ్గారు. అయితే మాట మార్చి కంపెనీ యాజమాన్యంపైనే కేసు పెడతారా అంటూ కార్మికులను వేధింపులకు గురిచేసిందని సమాచారం కార్మికులను చీకటి గదిలో బంధించినట్లు తెలుస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి