అగ్రరాజ్యం అమెరికా నుంచి
ఆయుధాలు కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్ మూడో స్థానం దక్కింది. గత ఏడాది
ఆయుధ కొనుగోళ్లకు సంబంధించి ఇరు దేశాల మధ్య 450 కోట్ల డాలర్ల మేరకు
ఒప్పందాలు కుదిరినట్టు అమెరికా రక్షణ శాఖ కార్యాలయమైన పెంటగాన్ విడుదల
చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.
భారత వాయుసేనకు 126 యుద్ధ విమానాల విక్రయానికి సంబంధించిన 1,000 కోట్ల డాలర్ల భారీ ఒప్పందం కూడా కుదిరి ఉంటే భారత్ మొదటి స్థానంలో ఉండేదని పెంటగాన్ ఓ నివేదికలో తెలిపింది.
ఈ యేడాది సెప్టెంబర్ 30తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసిన దేశాల్లో అఫ్ఘనిస్థాన్ మొదటి స్థానంలో ఉందని ఆ తర్వాత స్థానాల్లో తైపీ, భారత్, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, ఇరాక్, ఇజ్రాయెల్ తదితర దేశాలు ఉన్నట్టు పెంటగాన్ నివేదిక పేర్కొంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి