ఉదయ్‌పూర్: డ్యూయల్ సిమ్ విభాగంలో నోకియా కంపెనీ కొత్తగా ఆశ200, ఎక్స్2-02 పేర్లతో రెండు ఫోన్లను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఆశ200 ఫోన్ ధర దాదాపు రూ.4,759కాగా, ఎక్స్2-02 ధరను ఇంకా నిర్ణయించలేదు. కొత్తగా ఆశ300 మోడల్ ఫోన్‌ను వచ్చే ఏడాది జనవరిలో విడుదలచేయాలని కంపెనీ భావిస్తోంది. డీఆర్‌ఎం ఫ్రీ, లీగల్ మ్యూజిక్ సర్వీస్‌లను సైతం ప్రారంభించినట్లు నోకియా ఇండియా ఎండీ డి.శివకుమార్ చెప్పారు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే తొలి స్మార్ట్‌ఫోన్ ‘ల్యుమియా’ను ఈ నెలలోనే భారతీయ మార్కెట్లోకి తేవాలని నోకియా కంపెనీ యోచిస్తోంది.
ఈ ఏడాది అక్టోబర్ నెలలోనే కంపెనీ ప్రపంచమార్కెట్లోకి ల్యుమియా స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ఈ నెల మధ్యలో ల్యుమియా800, ల్యుమియా 710 స్మార్ట్‌ఫోన్‌లను విడుదలచేయాలని భావిస్తున్నట్లు నోకియా ఇండియా డెరైక్టర్, హెడ్(స్మార్ట్ డివెసైస్) విపుల్ మెహోత్రా చెప్పారు. రెండు మోడళ్ల ధరలను ఇంకా నిర్ణయించలేదని ఆయన స్పష్టంచేశారు. ల్యుమియా710 ధర తక్కువగా ఉండొచ్చన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి