12, డిసెంబర్ 2011, సోమవారం

ఈమార్ కథ... చంద్రబాబు కమామిషు...

ఈమార్ ప్రాపర్టీస్...

ఎక్కడిదీ సంస్థ?
ఇది దుబాయ్‌కి చెందిన బహుళ జాతి సంస్థ.

మన రాష్ట్రంలో ఎప్పుడు కాలు మోపింది?
నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో 2001లో.

ఈమార్ సంస్థకు భూముల్ని కేటాయించినది ఎవరు?
ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు. 535 ఎకరాలు కట్టబెట్టి ఆ ప్రాజెక్టును ప్రారంభిస్తున్న చంద్రబాబు (ఫైల్)ఫొటోను పైన చూడవచ్చు.

గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుకు అంటున్న ఈ భూముల్ని ఎప్పుడు కేటాయించారు?
2002లో

ఈ ఒప్పందాల్లో కీలక పాత్రధారి, సూత్రధారి ఎవరు? 
కోనేరు ప్రసాద్.

ఎవరీ కోనేరు ప్రసాద్?

నారా చంద్రబాబునాయుడుకు అత్యంత ఆప్తుడు... దుబాయ్‌కి చెందిన ఈమార్ ప్రాపర్టీస్‌నే కాకుండా, విశాఖ బాక్సైట్ తవ్వకాల కోసం మరో దుబాయ్ సంస్థ దుబాల్‌ను చంద్ర బాబునాయుడి హయాంలోనే మన రాష్ట్ర ప్రజలకు పరిచయం చేసిన పారిశ్రామిక వేత్త ఈయన. చంద్రబాబు దుబాయ్ వెళితే ఈ ప్రసాద్ ఇంట్లోనే ఆతిథ్యం స్వీకరిస్తారని తెలుగుదేశం పార్టీ వర్గాలు అనధికారికంగా చెబుతుంటాయి. అదీగాక ఈమార్ సంస్థల్లో పనిచేసిన ఒకప్పటి న్యూస్‌టుడే ఎండీ ఆ తరవాత తెలుగుదేశం మీడియా విభాగం ఇన్‌ఛార్జి అయ్యారు!

చంద్రబాబు ప్రభుత్వం ఈమార్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ఏమిటి? అందులో ఏం చెప్పింది?
మణికొండ సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఓ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయటం. మూడొందల రూములతో స్టార్ హోటల్ కట్టడం. పద్దెనిమిది రంధ్రాలతో గోల్ఫ్‌కోర్స్ నిర్మాణం. విల్లాలు, వాణిజ్య సముదాయాలతో కూడిన టౌన్‌షిప్ ఏర్పాటు కోసం బాబు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

చంద్రబాబు ప్రభుత్వం ఎంత భూమి ఇచ్చింది?

ఈ ప్రాజెక్టు పూర్తి చేయటానికి రెండు స్పెషల్ పర్పస్ వెహికల్స్(ఎస్.పి.వి.)లు ఏర్పాటు చేశారు. అందులో మొదటి ఎస్‌పీవీ పరిధిలో గోల్ఫ్‌కోర్స్, క్లబ్, విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఉంటాయి. ఈ ప్రాజెక్టులో చంద్రబాబు ఒప్పందం ప్రకారమే ఏపీఐఐసీ వాటా 26 శాతం. రెండో ఎస్‌పీవీ పరిధిలో కన్వెన్షన్ సెంటర్, స్టార్ హోటల్ ఉంటాయి. ఇందులో ఏపీఐఐసీ వాటా 49, ఎమ్మార్ వాటా 51. దీనికి కేటాయించిన స్థలం పదిహేను ఎకరాలు. 2002 ముగియక ముందే ఈ ఈమార్‌తో ఏపీఐఐసీ ద్వారా చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందాలన్నీ అమలు ప్రారంభమయ్యాయి. 

ఆ తరవాత ఏం జరిగింది?

తాను దేశదేశాలూ తిరిగిమరీ చంద్రబాబు కుదుర్చుకున్న ఒప్పందాల్లో వేల కోట్ల మేరకు అక్రమంగా వెనకేసుకున్నారని, స్విస్ బ్యాంకులకు ఈ అవినీతి సొమ్మును మళ్ళించారని, విదే శాల్లో స్టార్ హోటళ్ళు, షాపింగ్ కాంప్లెక్సులు కట్టుకున్నారని, గ్యాసే లేకుండా ప్రైవేటు విద్యుత్ ప్రాజెక్టులకు కొనులు గ్యారంటీలు ఇచ్చారని, తన సంపదలను... తన అనుయాయుల సంపదలను పెంచుకోవటానికే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టారని విపక్షాలు విశ్వసించి నమీదట కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల వాగ్ధానాల్లో భాగంగా.. తాము అధికారంలోకి వస్తే చంద్ర బాబు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలన్నింటినీ సమీక్షి స్తామని 2004లో ప్రకటించింది. తదనుగుణంగా వైఎస్ ప్రభు త్వం ఏర్పడిన తరవాత, ఆర్ధిక మంత్రి రోశయ్య నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు హయాంలో కుదిరిన వివాదాస్పద ఒప్పందాలను సమీక్షిం చింది. 

చంద్రబాబు నాయుడు ఏయే కారణాలతో ఎవరెవరికి ఎందుకు భూములను కేటాయించినా ఆ ఒప్పందాలన్నింటినీ రద్దు చేస్తే, అప్పటికే పెట్టుబడులు అంతంత మాత్రంగా ప్రవహిస్తున్న మన రాష్ట్రంలో పారిశ్రామి కాభివృద్ధికి సాంతంగా సమాధి కట్టినట్టవుతుంది. అదీగాక, ఒప్పందాల రద్దు ఫలితంగా కోర్టు కేసులు దశాబ్దాల పాటు సాగటం తప్ప ఎలాంటి ఫలితమూ ఉండకపోవచ్చు. పారిశ్రామికుల్లో ఇలాంటి అభిప్రాయం, అభద్రత కలగకూడదన్న ఉద్దేశంతోనే వైఎస్ ప్రభుత్వం చంద్రబాబు హయాంలో ఒప్పందాలను న్యాయబద్ధంగా సమీక్షించింది. మంత్రుల కమిటీ తన సమీక్షలో భాగంగా ఈమార్ ప్రాపర్టీస్ పొందిన రెండో ప్రాజెక్టులో కొన్ని మార్పుల్ని సూచించింది. ఆ ప్రాజెక్టును ప్రభుత్వం మూడుగా విభజించింది. హోటల్, కన్వెన్షన్ సెంటర్ వేర్వేరు ప్రాజెక్టులు అయ్యాయి. ఆ రెండూ ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి వాటిలో పెట్టుబడులు పెట్టినా వెంటనే ఫలితాలు రావు కాబట్టి... అంతకు మునుపు 49 శాతం అనుకున్న ఏపీఐఐసీ వాటాను 26 శాతానికి తగ్గించటానికి వైఎస్ ప్రభుత్వం మంత్రివర్గ నిర్ణయం నేపథ్యంలో నిర్ణయించుకుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి