20, మార్చి 2012, మంగళవారం

జగన్ Vs అఖిలేష్ ...


ఒక ప్రభంజనం లా దూసుకువచ్చేవాడే పెద్ద నేత కాగలడు. ములాయం చేతికి అందివచ్చిన కొడుకు అఖిలేష్ సరైన సమయం లో కరెక్ట్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ జగన్, తన తండ్రి YSR బ్రతికి ఉన్న టైం లో ప్రజలలోకి చొచ్చుకుపోడానికి ప్రయత్నించలేదు. తన తండ్రి హయాం లో ప్రజలకు జగన్ పేరే గాని రూపు కూడా తెలియదు. కానీ తదనంతరం తన యొక్క ధనం తోనూ, సొంత మీడియా తోనూ తానో ప్రభంజనం అనే రూపు తెచ్చుకోడానికి ప్రయత్నించి, స్వయంకృతాలతో భంగపడ్డాడు.
అఖిలేష్ ఎన్నికల ప్రచారం నిమిత్తం UP అంతా చుట్టి వచ్చాడు. పార్టీ వర్గాల్లో బేధాలు తొలగించి, ఐకమత్యం కోసం పాటుపడ్డాడు. ప్రజలకు నేనున్నానే భరోసా ఇచ్చాడు. కానీ జగన్..., ఓదార్పు పేరుతో యాత్రలు చేస్తున్నాడు. జగన్ మన ఊరు వచ్చాడా..., ఆ... మన కోసం రాలేదు..., ఎవడినో ఓదార్చడానికి వచ్చాడు... అని ప్రజలు అనుకునేలా యాత్రలు చేస్తున్నాడు.
అటు UP లో మాయావతి విగ్రహ ప్రతిష్ఠాపన కూడా మాయావతి కు మైనస్ అయింది. మరి ఇక్కడ YSR విగ్రహ ప్రతిష్ఠాపన అనేది జగన్ కార్యక్రమం. దీని ఫలితామెలా ఉండబోతుందో... మరి.
తన తండ్రి తో పోలిస్తే అఖిలేష్ ముఖకవళికలు ఆకర్షణీయంగా చిరునవ్వుతో ఉంటాడు. కానీ జగన్ సంగతి అలాకాదు. YSR మొఖం లో ఉండే చరిష్మా, చిరునవ్వు జగన్ మొఖం లో కొరవడ్డాయి. జగన్ నవ్వు చూస్తే అది తెచ్చిపెట్టుకున్న చిరునవ్వు అని తెలిసిపోతుంది.
అలాగే UP ఎన్నికల ఫలితాలు అవినీతికి, అక్రమాలకి వ్యతిరేకంగా వచ్చిన తీర్పు. కేంద్రం లో అధికారం లో ఉన్న UPA ప్రభుత్వం హయాం లో కుంభకోణాల ఫలితం గా కాంగ్రెస్ ను ప్రజలు వ్యతిరేకించారు అనుకుంటే..., కల్మాడి, రాజా, కనిమొళి, దయానిధి మారన్ ల లాగే వారి బాట లోనే సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న జగన్ కూడా ఉన్నాడు. కాబట్టి జగన్ కు అనుకూలమైన అంశం కాదిది.

అలాగే..., UP ఫలితాలు ఉత్సాహం కలిగించేది ఎవరికంటే...., అది తెలుగుదేశం పార్టీ కే. జగన్ పార్టీ తిరిగి కాంగ్రెస్ లో విలీనమైనా కాకున్నా, కాంగ్రెస్ ఇమేజ్ కు జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది. గత ఎన్నికలలో PRP వల్ల చీలిన వోట్ల తో,  కొద్దిపాటి తేడాతో అధికారం కు దూరమైన TDP, ఈ సారి 2014 ఎన్నికలలో అదే కొద్ది పాటి తేడాతో అధికారం దక్కించుకుని, ఇదివరకు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు అనుభవమున్న చంద్రబాబు మరల కేంద్రం ప్రభుత్వ ఏర్పాటు లో కీలక పాత్ర వహించే అవకాశం ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి