22, మార్చి 2012, గురువారం

Food-Contents are Based On Blood Group




చక్కని శరీర ఆకృతి కావాలంటే ఏమి చేయాలి ?ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండాలి. అంతేకాదు మన శరీర నిర్మాణానికి అనుగుణంగా మనకు అందుబాటులో ఉండే వ్యాయామం చేయాలి. అంతేకాదు మన శరీరానికి సరిపడే ఆహారాన్ని సమపాళ్లలో తీసుకోవాలి. మన శరీరంలో బ్లడ్ గ్రూప్ బట్టి మన ఆహారాన్ని ఎంచుకోవాలి. అదెలా ? అనేది ఇక్కడ తెలుసుకుందాం.
        నిత్యం ఆరోగ్యంగా ఉండేందుకు, అందంగా కనిపించేందుకు, రోగాలను దూరం చేసుకునేందుకు నిరంతరం ఏదో ఒక మార్గాన్ని మానవులు అన్వేషిస్తూ ఉంటారు. చూడచక్కని శరీరాకృతి మీద మక్కువ కనబరచని వారుండరంటే అతిశయోక్తి లేదు. అరుదైన, అందరూ తినే ఆహారానికి భిన్నమైన ఆహారం తీసుకోవడం ద్వారా తమ లక్ష్యం చేరుకోవాలని వారు ప్రయత్నిస్తారు. ఏ ఇద్దరి శరీరాలు ఒకే విధంగా వుండవు. ఎవరి శరీర నిర్మాణం వారిదే. ఎవరి ఆహార, మానసిక, భౌతిక అలవాట్లు వారివే. అందువల్ల అందరికి వర్తించే ఉమ్మడి సూత్రం అంటూ ఏది ఉండదు. ఏ ఆహారం తీసుకోవాలి, ఎంత పరిమాణంలో తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనే విషయమై ఒక ఖచ్చితమైన నిబంధం ఏమి లేదు. మంచి ఆహార అలవాట్లులో ఇవి ఒక భాగం కాబట్టి వీటిని మనం తప్పక పాటించాల్సిందే. “ మనకు తగ్గ ఆహారం తీసుకోవటం ” అనేది ఒక మంత్రంగా పాటించాలి. 
        మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి? వేటిని తీసుకోకూడదు? ఏ ఆహారం తీసుకోవటం మన ఆరోగ్యానికి ఉపయోగకరం? అనేవి మన బ్లడ్ గ్రూప్ పై ఆధారపడి ఉంటాయి. మన శరీరతత్వం బట్టి ఆహారం తీసుకోవాలి. శరీరంలోని రక్తం, మనం తీసుకునే ఆహారం నుండి ఉత్పత్తి అయ్యే ఆమ్లాల మధ్య రసాయనిక చర్య ఉంటుంది. ఈ అమ్లాల్లో ఎక్కువ బాగం ప్రమాదం కలిగించేవిగా ఉండవు. ఇది సహజసిద్ధంగానే మన శరీరం నుండి బయటకు వెళ్ళిపోతాయి. మనం తీసుకునే ఆహారాన్ని మూడు భాగాలుగా వర్గీకరించవచ్చు. శరీరానికి ఔషధం మాదిరిగా పని చేసేవి, శరీరంలో రక్తానికి హాని కలిగించనివి, మన శరీరానికి పనికిరానివి. ఈ మూడో రకం ఆహారం విషం లాగా పని చేస్తుంది. మన బ్లడ్ గ్రూప్ ఆధారంగా ఆహారం తీసుకోవాలనే సిద్ధాంతం కొత్తదేమీ కాదు. ఆయుర్వేదం కూడా దీనిని ఏనాడో గుర్తిచింది. మన శరీరంలో పంచ మహాభూతాలుంటాయని ఆయుర్వేదం విశ్వసిస్తుంది. బ్లడ్ గ్రూప్ అనేది కొత్తగా వచ్చేది కాదు. ఇది మన పూర్వీకుల నుండి వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది. వారీ వృత్తిపరమైన, జీవన స్ధితి గతులపై ఆధారపడి ఉంటుంది. వారీ వృత్తులు, ప్రవృత్తులు ఆధారంగా నిర్ణయమవుతుంది. నేడు మనం బ్లడ్ గ్రూప్ ఆధారంగా తీసుకోవాల్సిన ఆహారం మన పూర్వికులు ఆహారపు అలవాట్లపై కూడా ఆధారపడి ఉంటుంది.
బ్లడ్ గ్రూప్ బట్టి ఆహారపట్టిక (A List for food contents based on blood group):-
గ్రూప్ ఒ  - [Group O]:-
          ‘ఒ’ బ్లడ్ గ్రూప్ _ O Blood Group వారు అధిక పోటిన్, తక్కువ కార్బోహైడ్రేట్స్గల ఆహార పదార్ధాలు తీసుకోవడం మంచిది. వీరికి ఆహారాన్ని జీర్ణం చేసుకోగల శక్తి అధికంగా ఉంటుంది. వీరు అధికంగా మాంసం, చేపలు వంటి ఆహారాన్ని తీసుకోవచ్చు, పాల ఉత్పత్తులు, గోధుము, వరి, పప్పు ధాన్యాలను మానివేయడం మంచిది. ఆలివ్ ఆయిల్, కోడి గుడ్లు, పప్పులు, కూరగాయలు, తక్కువ పరిమాణంలో పళ్ళు తీసుకోవాలి. పాల ఉత్పత్తిలు, తృణధాన్యాలు, పప్పులు, రొట్టె వంటి ఆహార పదార్ధాలును మానివేయండం మంచిది. వీరు అధిక శక్తి అవసరమైన వ్యాయామాలు ఎక్కువగా చేయాలి. అందువల్ల వారీ శరీరం దృడంగా మారుతుంది.
ఈ గ్రూప్ వారిలో రొండు రాకల రక్త-కణాలు ఉంటాయి. ఒకటి O+ మరియు రొండు O- .
గ్రూప్ ఎ – [Group A]:-
            ‘ఏ’ బ్లడ్ గ్రూప్ _ A Blood Group ఈ బ్లడ్ గ్రూప్ గలవారు విటమిన్-డి (Vitamin-D) ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. మాంసం వంటి ఆహార పదార్ధాలను వీరు ఎక్కువగా జీర్ణం చేసుకోలేరు. శాకాహారం ఎక్కువగా తీసుకోవటం అవసరం. వీరు ఆహారంలో వరి, గోధుమ వంటి తృణధాన్యాలు ఎక్కువగా ఉండటం మంచిది. కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. మాంసం, పాల ఉత్పత్తులను వీలైనంత తక్కువగా తీసుకోవాలి. పప్పులు, గోధుమ, వరి, రొట్టె, తాజా కూరగాయలు, పళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. ప్రకృతి సిద్ధమైన వ్యాయామాలు, అంటే యోగా, మెడిటేషన్ వంటివి చేయడంవల్ల అరిగ్యవంతమైన శరీరం ఏర్పడుతుంది. ఈ గ్రూప్ వారిలో రొండు రాకల రక్త-కణాలు ఉంటాయి. ఒకటి A+ మరియు రొండు A-
గ్రూప్ బి – [Group B]:-
            ‘బి’ బ్లడ్ గ్రూప్ _ B Blood Group గలవారు వివిధ రకాల ఆహార పదార్ధాలను తీసుకొని సులభంగా జీర్ణం చేసుకోగలుగుతారు. వీరి ఆహారంపై ఎటువంటి ఆంక్షలు అవసరంలేదు. వీరికి ఇష్టమైన ఎటువంటి ఆహారాన్నయినా తీసుకోవచ్చు. అయితే ప్రాసెసింగ్ చేసిన, అధిక కార్బోహైడ్రేట్లు గల ఆహారాన్ని తక్కువగా తీసుకోవటం మంచిది. శరీర, మానసిక పరమైన వ్యాయామాలు చేయడం మంచిది. ఈ గ్రూప్ వారిలో రొండు రాకల రక్త-కణాలు ఉంటాయి. ఒకటి B+ మరియు రొండు B-
గ్రూప్ ఎ బి – [Group AB]:-
            ‘ఎ బి’ బ్లడ్ గ్రూప్ _ B Blood Group గలవారు మానవులకు ఈ గ్రూప్ ఎక్కువగా నప్పుతుంది. అయితే ఈ బ్లడ్ గ్రూప్ గలవారు అరుదుగా మాత్రమే కనిపిస్తుంటారు. గ్రూప్ ఎ, గ్రూప్ బి వారికి సూచించిన ఆహారాన్ని వీరు తీసుకోవచ్చు. శాకాహారం ఎక్కువగా తీసుకోవడం మంచిది. తక్కువ పరిమాణంలో మాంసం, చేపలు, పాలఉత్పత్తులను తీసుకోవచ్చు. ప్రశాంతమైన వ్యాయామాలు చేయాలి. ఈ గ్రూప్ వారిలో రొండు రాకల రక్త-కణాలు ఉంటాయి. ఒకటి AB+ మరియు రొండు AB-


సరైన పద్దతి:-
        పైవిధంగా చెప్పిన గ్రూపులు వారిగా అందించిన ఆహారపట్టిక ఎక్కువ ప్రజాదరణ పొందింది. ఆహారం శరీరం బరువును తగ్గించడంతోపాటు మానవులను ఉత్సాహవంతంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు, తక్కువ అనారోగ్యసమస్యలు కలిగి ఉంచేందుకు ఉపయోగపడుతుంది. మనం తీసుకోవాల్సిన ఆహారాన్ని ఎంపిక చేసుకొనే ముందు మన బ్లడ్ గ్రూప్ ఏమిటో తెలుసుకోవాలి. మన శరీరతత్వం, వ్యాధులు, ఆయా పరిస్థితుల ఆధారంగా ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి. మన ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు సమతుల్యగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఈ వివరాల ప్రాతిపదికగా రోజూ వివిధ సమయాల్లో తీసుకోవాల్సిన ఆహార షెడ్యూలును రూపొందించుకోవాలి.
:: చివరిగా ఓ మాట:-
          :: ఒక కుటుంబంలో విభిన్న బ్లడ్ గ్రూపులుగల సభ్యులుంటే సమస్యలు ఎదురవుతాయి. అందరికి ఆమోదయోగ్యమైన సమతుల ఆహారాన్ని తయారు చేసుకోవడం కష్టమవుతుంది. ఈ సిద్ధంతానికి సంబంధించిన అనేక ఊహాగానాలు ఇంకా శాస్త్రీయ పరంగా రుజువు కావాల్సిఉంది. అందువల్ల మన ఆహారాన్ని ప్లాన్ చేసుకొనే ముందు సరైన మార్గాదర్శకుడ్ని ఎంపిక చేసుకోవడం అవసరం. ఏది ఏమైనా మన ఆహార అలవాట్లు, వ్యాయామాల్లో క్రమశిక్షణ పాటించడం అత్యవసరం. ఈ విధంగా పాటించినప్పుడే మీమనసు ప్రశాంతంగా మరియు భలంగా ఉంటుంది. అలపాటించినప్పుడు మిమల్ని ఏ చెడు కలలు లేక చెడు ప్రయోగాలు ఏమి చేయలేవు. మీరు మీశారిరాన్ని కాపాడుకుంటే మీకు మీశరీరం ఎల్లప్పుడూ శ్రీరామరక్షగా కాపాడుతుంది !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి