20, మార్చి 2012, మంగళవారం

బడ్జెట్ 2012-13 ముఖ్యాంశాలు


2012-13 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం పార్లమెంటు లో బడ్జెట్ ప్రతిపాదించాడు. ఇందులో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
అంచనాలు:
మొత్తం బడ్జెట్ అంచనా: రు. 14.9 లక్షల కోట్లు (14,90,925 కో). ఇది 2011-12 బడ్జెట్ కి 29 శాతం ఎక్కువ.
ప్రణాళికా ఖర్చు: రు. 5,21,025 కోట్లు. గత సంవత్సరం కంటే 18 శాతం ఎక్కువ. మొత్తం ఖర్చులో ఇది 35 శాతమే.
ప్రణాళికేతర ఖర్చు: రు. 9,69,900 కోట్లు. (65 శాతం)
మిలట్రీ ఖర్చు: 1.94 లక్షల కోట్లు. (గత సం. కంటే 18 శాతం ఎక్కువ)
బడ్జెట్ లోటు:
దీనిని ఫిస్కల్ డేఫిసిట్ అని కూడా అంటారు. ద్రవ్య లోటు అని కూడా.
2012-13 కి ఫిస్కల్ డెఫిసిట్ జి.డి.పిలో 5.1 అని అంచనా వేశారు. 2011-12 కి ఈ లోటు 4.6 శాతం అని అంచనా వేసినా, శుక్రవారం దానిని 5.9 శాతానికి సవరించారు.
వసూళ్ళు:
మొత్తం పన్నుల వసూళ్ళు: రు. 10,77,612 కోట్లు (2011-12 ఆసలు అంచనా కంటే 15.6 శాతం ఎక్కువ, సవరించిన అంచనా కంటే 19.5 శాతం ఎక్కువ )
కేంద్రానికి అందే నికర పన్నులు: రు. 7,71,071 కోట్లు.
పన్నేతర రెవెన్యూ ఆదాయం: రు. 1,64,614 కోట్లు.
అప్పేతర పెట్టుబడి వసూళ్ళు: రు. 41,650 కోట్లు.
ప్రభుత్వరంగ కంపెనీలను అమ్మి 30,000 కోట్లు సంపాదించాలని అంచనా. (ఇది గత సం. 40,000 కోట్లు అనుకున్నా, ఇప్పటికీ 15,000 కోట్లే సాధ్యం అయింది.)
సర్వీస్ టాక్స్ 10 నుండి 12 శాతం కి పెంపు.
కార్పొరేట్ పన్నుల్లో తేడా లేదు.
వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి 1.8 లక్షల రూపాయల నుండి రెండు లక్షల రూపాయలకు పెంపు.
విద్యుత్ కంపెనీల కోసం బొగ్గు దిగుమతిపై పూర్తి పన్ను మినహాయింపు.
బంగారంపై ప్రాధమిక కస్టమ్స్ సుంకం రెట్టింపు.
అప్పులు:
నికర మార్కెట్ అప్పులు: 4.8 లక్షల కోట్లు.
సబ్సిడీలు:
2012-13 కు గాను సబ్సిడీలు జి.డి.పి లో 2 శాతం కంటే తక్కువ ఉండాలన్నది లక్ష్యం.
ప్రధాన సబ్సిడీల బిల్లు: రు. 1.8 లక్షల కోట్లు.
ఇందులో ఆహార సబ్సిడీ: 75,000 కోట్లు. ఎరువుల సబ్సిడీ: 60,970 కోట్లు. పెట్రోలియం సబ్సిడీ: 43,580 కోట్లు.
(2011 -12 కు పెట్రోలియం సబ్సిడీ 68,480 కోట్లకు సవరించారు)
ప్రభుత్వ రంగ బ్యాంకులకు 15,900 కోట్ల రూపాయలు పెట్టుబడులు సమకూర్చాలని నిర్ణయం.
జీడీపీ వృద్ధి
2012-13 లో జీడీపీ వృద్ధి 7.6 శాతం ఉంటుందని అంచనా.
2011-12 లో ఇది 8.5 శాతం అని అంచనా వేసి ఇప్పుడు 6.9 కి తగ్గించారు.
మార్చి నెల నుండి ఆర్ధిక వ్యవస్ధ తిరిగి వేగంగా పెరుగుతుందని అశ.
సంస్కరణలు:
రిటైల్ రంగ ప్రవేటీకరణకు హామీ, రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధిస్తామని హామీ.
విమాన రామ్గానికి వర్కింగ్ కేపిటల్ కోసం విదేశీ వాణిజ్య అప్పు 1 బిలియన్ డాలర్ (5,000 కోట్లు) వరకు అనుమతి.
భారత కార్పొరేట్ కంపెనీలు నేరుగా విదేశీ అప్పులు తెచ్చుకోవడానికి అనుమతి.
విద్యుత్ ప్రాజెక్టుల అప్పుకు విదేశీ వాణిజ్య అప్పుల అనుమతి.
వ్యవసాయం:
మరో ఐదు సంవత్సరాలకి యూరియా ఉత్పతిలో స్వాలంబన సాధిస్తామని ప్రకటన. (వచ్చే సంవత్సరంలో సాధించేదెంతో చెప్పరు)
వ్యవసాయ అప్పుల టార్గెట్ 5.75 లక్షల కోట్లు. (?)
ఇతరములు:
కరెంట్ ఖాతా లోటు జి.డి.పి లో 2011-12 శాతం. 2012-13 లో ఈ లోటు ఇంతకంటే తగ్గిస్తామని హామీ.
వ్యాఖ్యానాలు
“మనం సంస్కరనల వేగం ఇంకా పెంచాలి. ఆర్ధిక వ్యవస్ధలో సరఫరా వ్యవస్ధను మెరుగుపరచాలి. వైద్య సేవల్లో లాగా ఆర్ధిక విధానాలవల్ల సమీప కాలంలో నొప్పిగా, బాధగా ఉంటుంది గానీ దీర్ఘ కాలంలో ఫలితం బాగుంటుంది” -ప్రణబ్ ముఖర్జీ
“సగటు మనిషికి ఈ బడ్జెట్ స్వాంతన ఇవ్వలేదు. వారి విశ్వాసాలను వమ్ము చేసింది” -బి.జె.పి ప్రతినిధి షానవాజ్ హుస్సేన్
“ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్” -బి.జె.పి నాయకుడు అనంత కుమార్
“లక్ష్యం లేని బడ్జెట్. గుమస్తాలు కూర్చుని రాయగలరు దీన్నీ” -గురుదాస్ దాస్ గుప్తా, సి.పి.ఐ
“ఏ ప్రత్యేకతా లేని బడ్జెట్” బైజయంత్ పండా, బి.జె.డి
“సగటు మనిషిపై భారం పెంచే బడ్జెట్” -సీతారాం యేచూరి, సి.పి.ఏం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి