అనంతపురం,
మార్చి 16 : సాయి కాళేశ్వర్ ఆకస్మిక మరణంతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కి
పడింది. ఉన్న ట్లుండి ఆయన మృతి చెందినట్లు తె లుసుకున్న జిల్లా వాసులు శోక
సం ద్రంలో మునిగిపోయారు. సత్యసాయి బాబా శివైక్యం చెంది ఏడాది కూడా కా క
మునుపే విశేష సేవలందించిన మరో ఆధ్యాత్మిక వేత్త మృతి చెందడం జిల్లా వాసులను
కలచివేసింది. సత్యసాయి లాగే కాళేశ్వర్ మృతి కూడా ఎన్నో అనుమానాలకు
తావిస్తోంది.
ముందు
గానే అనారోగ్యం. ఆపై ఆర్థిక లావాదే వీలు, కుటుంబ స్పర్థలు, కొందరి బెది
రింపులు వంటి కారణాలతో కాళేశ్వర్ మానసిక శాంతిని కోల్పోయారని చెబుతారు.
ఆయనపై విష ప్రయోగం కూడా జరిగి ఉంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గురువారం
ఉద యం నుంచి పలు టీవీ చానళ్లలో కాళే శ్వర్ మృతి చెందినట్లు వార్తలు
వచ్చాయి. అయితే సాయంత్రం 4.00గంటల సమయంలో కాళేశ్వర్ బెంగళూరు ఆస్పత్రిలో
మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. *విషప్రయోగం జరిగిందా..? *స్తబ్ధతకు కుటుంబ సభ్యులే కారకులా . . .? *రూ.కోట్ల విలువైన బీమా పాలసీలు *ఏడాదిన్నరగా ఏకాంతమే ? *ట్రస్టుకు నాగిరెడ్డి ఎందుకు దూరమయ్యారు?
సాయికాళేశ్వర్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంత కాలంగా ఆ యన స్తబ్ధుగా ఉంటున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా రు. ఆరోగ్య సమస్యలు అధికమవడం తోనే ఆయన భక్తులకు దూరంగా ఉం టున్నారని అందరూ భావించారు. అయి తే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? కార కులెవరు? కుటుంబ సభ్యులమధ్య నెల కొన్న విభేదాలే కారణమా? ఆస్తి తగా దాలా?స్వామిపై విష ప్రయోగం జరి గిందా? ఇలాంటి అనేక సందేహాలు వ్య క్తమవుతున్నాయి.
కాళేశ్వర్ ఉన్నట్టుండి భౌతికదేహాన్ని వదలడం వెనుక పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. కుటుం బంలో ఆధిపత్యపొరు ఏడాది నుంచి కొ నసాగుతున్నట్లు తెలుస్తోంది. భార్య తర పు బంధువులతో తరచుగా విభేదించే వారని సమాచారం. ఆర్థికపరమైన లా వాదేవీలతో అప్పుడప్పుడు సతమతమ య్యేవారని తెలిసింది. తిరుపతి, చెన్న య్, బెంగళూరు ప్రాంతాల్లో విలువైన ఆ స్తులున్నట్లు తెలుస్తోంది. వీటిలో కొన్నిం టికి సంబంధించి జరిగిన ఆర్థిక లావా దేవీలు ఆయనకు తలపోటుగా మారా యనే వదంతులున్నాయి.
కాళేశ్వర్‌కు వి విధ బీమా కంపెనీల ద్వారా రూ.20 కోట్లకు పైగా పాలసీలున్నట్లు తెలుస్తోం ది. అవికూడా రెండేళ్ల నుంచే చేయిం చారనే వదంతులు వినిపిస్తున్నాయి. రెం డేళ్లుగా అనారోగ్యంతో ఉన్నందునే ఉన్న ఫళంగా రూ.కోట్ల విలువైన బీమా చే యించారనే విమర్శలున్నాయి. అయితే వీటికి సంబంధించి స్పష్టమైన ఆధారాల్లే కపోయినా ఎదో తెలియని మనోవేదన తో కొంత కాలంగా బాధపడుతూండే వారన్నది వాస్తవం. వీటి నుంచి బయ టపడే మార్గంతేలియక కొన్ని సంద ర్భాల్లో ఏకాంతంగా గడిపేవారని తెలు స్తోంది. దీనికి తోడు ఇటీవలి కాలంలో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి కుటుంబం లో విభేదాలు మరింత ముదిరినట్లు ఆరోపణలున్నాయి.
సోదరుడి మరణం తర్వాత ఆయన మొదటి భార్య తరపు బంధువులు కాళేశ్వర్‌పై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమకు తెలియ కుండా రెండో భార్య బంధువులు ఆస్తు లు అమ్మేస్తున్నారని పత్రికలకు సైతం వి వరించారు. ఆస్తిలో వాటా ఇప్పించాలని బాబాకు విన్నవించినా ప్రయోజనం లే కుండాపోయిందని ఆరోపించారు. సోద రుడి కుటుంబ వ్యవహారం కూడా మాన సిక అశాంతికి కారణమంటున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కూడా ఆయన స్తబ్ధతగానే ఉండేవారని తెలు స్తోంది. ఆయన మొండిగా మారేందుకు బలమైన కారణాలున్నాయంటున్నారు. కొన్ని కోట్ల ఆస్తులకుఅధిపతిగా ఉన్నా… డ్రా చేసుకునేందుకు అవకాశం లేక ఇ బ్బంది పడ్డారనే విమర్శలున్నాయి. పలు మార్లు కాళేశ్వర్ ఆశ్రమం నుంచి బ యటికి వచ్చి ఒంటరిగా ఎక్కడ బడితే అక్కడ కూర్చొని కంటతడిపెట్టేవారని స్థానికుల ద్వారా తెలుస్తోంది. ఇలా పలు ఇబ్బందులు పడుతున్న కాళేశ్వర్ ఆరోగ్యం మరింత క్షీణించిన నేపథ్యంలో మృతి చెందినట్లు భావిస్తున్నారు.
ఇప్పుడే ఇలా..? కాళేశ్వర్ ఆధ్యాత్మిక బోధకుడిగా పలు వురికి సుపరిచితం. స్థానికులతో పాటు దేశ, విదేశాల్లోనూ అనేక మందిని ఆయ న ఆధ్యాత్మిక బోధనలతో ఆకట్టుకు న్నా రు. ఒకప్పుడు చిన్న ఆశ్రమానికే పరిమి తమైన ఆయన నివాసం క్రమంగా వి స్తరించింది. దీనికి భక్తులిచ్చిన విరాళాల తో పాటు గుప్తనిధుల వేటలో లభించిన నిధులు కూడా వచ్చాయనే ప్రచారం జరుగుతోంది. శ్రీకృష్ణదేవరాయలు రెండో రాజధానిగా చేసుకుని పాలించిన పె నుకొండ ప్రాంతంలో అక్కడక్కడ పురా తన ఆలయాలు, కట్టడాలు కూల్చేశారు. వీటిలో బాబా హస్తం ఉందనే ప్రచారం ఇదివరలో జరిగింది.
అలాగే భూ వివా దాలు కాళేశ్వర్‌ను చుట్టుముట్టాయి. పు రావస్తుశాఖ కూడా ఆరు నెలల క్రితం ఆశ్రమ ప్రాంగణాన్ని పరిశీలించి కొలత లు తీసుకుంది. భక్తులకు అ«ధ్యాత్మిక బోధనలు అందిస్తున్న కాళేశ్వర్ ఆరోగ్యం ఉన్నట్టుండి క్షీణించిందా? ఆస్పత్రికి తీ సుకెళ్లిన రెండు రోజుల్లోనే ఎలా చని పోయారనే సందేహాలు పలువురిని వేధి స్తున్నాయి. మల్టీఆర్గన్ డిజాస్టర్ సిండ్రో మ్‌తో బాబా బాధపడేవారని సన్నిహితు లు చెబుతున్నట్లు సమాచారం. దీనివె నుక ఏదైనా కుట్ర జరిగిందా? అనే అ నుమానం కూడా లేకపోలేదు. బాబా ఆ స్తులపై కన్నేసిన వ్యక్తులు విషప్రయోగం చేశారనే వదంతులు వినిపిస్తున్నాయి. అందువల్లే అనారోగ్యం పాలైవుండవ చ్చుననే చర్చ స్థానికంగా జరుగుతోంది. రూ.కోట్ల విలువైన ఆయన ఆస్తులపై కన్నేసిన వారు ఏమైౖనా చేశారా? అనే అనుమానాలను స్థానికులు వ్యక్తపరు స్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపడితే మినహా వాస్తవాలు వెలుగు చూసే అవకాశం కనిపించడం లేదు.
ట్రస్ట్‌కు నాగిరెడ్డి దూరం… కాళేశ్వర్ ఏర్పాటుచేసిన షిర్డీసాయి గ్లోబ ల్‌ట్రస్టులో నాగిరెడ్డి అనే వ్యక్తి బాబాకు విశ్వాసంగా పనిచేస్తూ 1995 నుంచి కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కొద్ది నె లల క్రితం ఆయనను బాధ్యతల నుంచి తప్పించి ఆ స్థానంలో చంద్రమౌళిరెడ్డి అనే వ్యక్తిని నియమించారు. ఇన్నాళ్లూ ట్రస్ట్‌లో చక్రం తిప్పిన నాగిరెడ్డిని ఒక్క సారిగా తప్పించడం వెనుక కారణా లేవైనా ఉన్నాయా? అనే సందేహాలున్నా యి. ఆర్థిక, ఇతరాత్రా అంశాల్లో అభి ప్రాయభేదాలు పొడచూపడంతోనే ఆయ నను తప్పించి ఉంటారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాగిరెడ్డితో పాటు బాబా సొంతమామ విజయభాస్కర్ రెడ్డి కూడా ట్రస్ట్‌లో కీలకమే. కాళేశ్వర్ ట్రస్ట్ చైౖర్మన్‌గా వ్యవహరిస్తుండగా విజ యభాస్కర్‌రెడ్డితో పాటు చిట్టిబాబు, హరిప్రసాద్, చంద్రమౌళిరెడ్డిలు సభ్యు లుగా కొనసాగుతున్నారు. ట్రస్ట్ అంత రంగిక వ్యవహారాలు, బాబా మరణం వెనుక వ్యక్తమవుతున్న అను మానాలను వీరే నివృత్తి చేయగలరనే అభిప్రాయం వుంది.
బెదిరింపుల పర్వమా..? సాయికాళేశ్వర్‌కు ట్రస్టును ఏర్పాటు చే యకముందు నుంచి బెదిరింపులుం డే వని చెబుతారు. మావో యిస్టు రంగారెడ్డి కాళేశ్వర్ ఆశ్రమంపై టిన్‌బాంబువేసి ఒకరి మృతికి కారకులయ్యారు. అప్పటి నుంచి 15రోజుల క్రితం వరకు కాళేశ్వర్ బెదిరింపులకు గురవుతూనే ఉన్నట్లు స మాచారం. కాళేశ్వర్ అనతి కాలంలోనే కోట్లు సంపాదించారనే కారణంతో రాజ కీయంగా చలామణి అయ్యేవారు కూడా అయిన కాడికి డిమాండ్ చేసేవారనే వి మర్శలున్నాయి. దీనికి తోడు ఇటీవల రెండు దశాబ్దాల కాలంలో జరిగిన ఎన్ని కల్లో కూడా ఈ ప్రాంతానికి చెందిన పలువురు ఎన్నికల నిధి రూపంలో డబ్బులు తీసుకున్నట్లు ఆరోప ణలున్నాయి.
ఓ పత్రికకు సంబంధించిన ప్రతినిధులు కాళేశ్వర్‌కు వ్యతిరేకంగా కథనం రాకుండా ఉండాలంటే నజరానా ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయమై కోర్టులో కేసు కూడా నమోదయింది. తాజాగా వెంకటరెడ్డిపల్లి వద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం జరిగే చోటుకు ధర్మవరం ప్రాంతానికి చెందిన నాయకులు కొందరు వెళ్లి భారీగానే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. కాళేశ్వర్ ఇదే విషయాన్ని సన్నిహితుల వద్ద మొరపెట్టుకున్నట్టు సమాచారం. పోలీ సులు కూడా తనను బెదిరించే వారి పట్ల కఠినంగా వ్యవహరించలేదని ఆరోపించి నట్లు తెలిసింది. కాళేశ్వర్‌పై ఆరోపణ లను పలువురు సొంతలబ్ధి కోసం వాడుకుంటు న్నారనే విమర్శలున్నాయి.
శనివారం ఉదయం అంత్యక్రియలు . . . సాయికాళేశ్వర్ అంత్యక్రియులు శనివా రం ఉదయం 11గంటలకు నిర్వహిం చనున్నట్లు ట్రస్టు సభ్యులతో పాటు పెను కొండ ఆర్డీఓ ప్రకటించారు. ట్రస్టు ప్రాంగణంలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకు చెందిన అధికారులు, అనధికా రులతో పాటు రాజకీయ పార్టీల ప్రతిని ధులు, ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొనే అవకాశముంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి