26, మార్చి 2012, సోమవారం

అమెరికాలో అక్రమంగా 1.10 కోట్ల మంది విదేశీయుల నివాసం

అగ్రరాజ్యం అమెరికాలో అక్రమంగా 1.10 కోట్ల మంది విదేశీయులు నివశిస్తున్నట్టు తాజా నివేదిక వెల్లడించింది. ఇందులో భారతీయుల సంఖ్య 2.4 లక్షల మంది ఉన్నట్టు తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. గత 2011 నాటికి అక్రమంగా అమెరికాలో నివశిస్తున్న వారి వివరాలను అమెరికా భదత్రా శాఖ తాజాగా వెల్లడించింది.

మొత్తం కోటీ పది లక్షల మంది విదేశీయులు అక్రమ వీసాలతో, సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఇక్కడ నివసిస్తున్నారని, వీరిలో మెక్సికోకు చెందిన వారు 60 లక్షల పైచిలుకు మంది నివశిస్తున్నట్టు చెప్పారు. అక్రమంగా నివసిస్తున్న వారిలో మెక్సికో ప్రజలు మొదటి స్థానంలో ఉండగా భారతీయులు ఏడో స్థానంలో ఉన్నారు. ఇక, చైనా దేశస్తులు ఐదో స్థానాన్ని ఆక్రమించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి