2, మార్చి 2012, శుక్రవారం

పాక్ జీడీపీ కి యాపిల్ ‘మార్కెట్ కేపిటలైజేషన్’ మూడు రెట్లు


ipad_iphone_ipodఐ పాడ్, ఐ ఫోన్, ఐ ప్యాడ్, మేక్ కంప్యూటర్ల సృష్టి కర్త స్టీవ్ జాబ్స్ కంపెనీ ‘యాపిల్’ మార్కెట్ కేపిటలైజేషన్ విలువ త్వరలో అర ట్రిలియన్ (500 బిలియన్) డాలర్ల మార్కు దాటనున్నది. మంగళవారం నాటికి ఆ విలువ 499.2 బిలియన్ డాలర్లుగా నమోదయింది.  ఐ ప్యాడ్ -3 అమ్మకాలు బంపర్ స్ధాయిలో ఉంటాయన్న ఊహాగానాలతో యాపిల్ కంపెనీ స్టాక్ విలువ పైపైకి దూసుకు పోతుండడంతో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా రికార్డు స్ధాయిని చేరుతోంది.
గతంలో కూడా అయిదొందల బిలియన్ మార్కును తాకిన కంపెనీలు లేకపోలేదు. 2000 సంవత్సరం నాటి డాట్ కామ్ బూమ్ లో మూడు ఐ.టి కంపెనీలు ఈ స్ధాయిని అందుకున్నాయి. అవి సిస్కో, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ కంపెనీలు. ఆ తర్వాత డాట్ కామ్ బుడగ బద్దలు కావడంతో వాటి విలువలు కూడా పడిపోయాయి. జులై 2009లో ఆయిల్ కంపెనీ ‘ఎక్సాన్ మొబిల్’ మార్కెట్ క్యాప్ 500 బిలియన్ డాలర్ల మార్కుని తాకింది. ఈ కంపెనీలేవీ ఆ స్ధాయిని ఎంతో కాలం కొనసాగించలేకపోయాయి.
యాపిల్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువను ‘ఫస్ట్ పోస్ట్’ వెబ్ పత్రిక మరొక రూపంలో మన ముందుంచింది. వివిధ దేశాల జీడీపీ లతోనూ, భారత్ దేశానికి చెందిన వివిధ ఆర్ధిక ప్రమాణాలతోనూ పోలుస్తూ వివరాలు ప్రచురించింది. అవి ఇలా ఉన్నాయి.
  • భారత కరెన్సీ రూపాయిల్లో యాపిల్ కంపెనీ మార్కెట్ క్యాప్ విలువ: రూ. 24 లక్షల 68 వేల 490 కోట్లు. లేదా 24 ట్రిలియన్ల 684 బిలియన్ల 900 మిలియన్ల రూపాయలు.
  • సి.బి.ఐ డైరెక్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం విదేశాల్లో భారతీయ బందిపోట్ల దొంగలు దాచుకున్న నల్ల డబ్బు విలువ 24.5 లక్షల కోట్ల రూపాయలు.
  • భారత విదేశీ మారక ద్రవ్య నిల్వల కంటే యాపిల్ కంపెనీ మార్కెట్ క్యాప్ 1.6 రెట్లు ఎక్కువ.
  • బోంబే స్టాక్ ఎక్చేంజీ (బి.ఎస్.ఇ) మొత్తం స్టాక్ ల విలువలో 40 శాతం.
  • బోంబే స్టాక్ ఎక్చేంజీ లో భాగమైన మిడ్ క్యాప్ సూచి విలువ కంటే 2.5 రెట్లు ఎక్కువ.
  • బి.ఎస్.ఇ లోని ఐ.టి స్టాక్ ల విలువ కంటే నాలుగు రెట్లు ఎక్కువ.
  • భారత దేసంలో అతి పెద్ద కంపెనీ రిలయన్స్ కంటే పది రెట్లు ఎక్కువ.
  • మార్కెట్ క్యాప్ లో భారత దేశానికి చెందిన అతి పెద్ద 17 కంపెనీల తో సమానం.
  • భారత దేశంలో ధనిక రాష్ట్రాలుగా ఉన్న నాలుగు రాష్ట్రాలు -గుజరాత్, మహా రాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక- ల మొట్ట జి.డి.పి తో సమానం. (భారత్ జీడీపీ దాదాపు 1.5 ట్రిలియన డాలర్లు)
  • పాకిస్ధాన్ జీడీపీ కంటే మూడు రెట్లు ఎక్కువ.
  • ప్రపంచంలో 20 దేశాలు మాత్రమే 500 బిలియన్ డాలర్ల కంటే అధిక జీడీపీ కలిగి ఉన్నాయి.
  • రాజా, కనిమోళి, దయానిధి మారన్ లు పాల్పడిన 2 జి కుంభకోణం విలువ కంటే 15 రెట్లు ఎక్కువ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి