ఇంటర్నెట్లో ఒక రోజుకు ఏమి జరుగుతోందో అనే ఆలోచన మీకు ఎప్పుడైనా కలిగిందా? మనం ఎంతసేపు ఇంటర్నెట్లో గడుపుతున్నమో మనకి తెలుసు. మనం దానిని ఎలా ఉపయోగించుకుంటున్నామో కూడా మనకి తెలుసు.మరి ప్రపంచంలో ఇంటర్నెట్ వాడుతున్న వారందరూ కలిసికట్టుగా ఒకేసారి ఇంటర్నెట్ ను వారివారి వాడుకకు వాడుకంటుంటే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. ఈ రోజు వ్యాపారులు కూడా ఇంటర్నెట్ మూలంగా వ్యాపారం చేసుకుంటున్నారు.2011 లో ఇంటర్నెట్ మూలంగా 680 బిల్లియన్ డాలర్ల విలువకు వ్యాపారం జరిగిందంటే వారు ఎంతగా ఇంటర్నెట్ ను ఉపయోగించుకుంటున్నారో తెలుసుకోవచ్చు.అమెరికాలో జరుపుకునే బ్లాక్ ఫ్రైడే రోజున అమజాన్ కంపెనీవారు ఒక సెకెండుకు 32 వస్తువులు అమ్మేరట!
ఈ రోజు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరినీ ఆన్ లైన్ లో కలుసుకోవచ్చు.ఎంబీఏ ఆన్ లైన్ వారు ఇంటర్నెట్లో ఒకరోజుకు ఏం జరుగుతున్నదో ప్రకటించేరు. ఇందులో ముఖ్యమైనది ఏమిటంటే ఇంటర్నెట్లో ఒకరోజులో వేయబడే బ్లాగ్ టపాలు టైం మేగజైన్లో 770 సంవత్సరాలకు కావలసిన ప్రింటింగ్ కు సరిపోతుందట? ఒకరోజుకు భూమిమీద పుట్టే బిడ్డలకన్నా, ఒకరోజులో అమ్ముడుపోయే ఐ ఫోన్లు ఎక్కువట?...మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
ఒక రోజులో ఇంటర్నెట్ నుండి పొందే సమాచారం ....168 మిల్లియన్ డివీడిలలో రాసుకునేటంత ఉంతుందట.
294 బిల్లియన్ ఈ-మైల్స్ పంపుతున్నారట.
2 మిల్లియన్ బ్లాగ్ టపాలు వేస్తున్నారట.
172 మిల్లియన్ ప్రజలు ఫేస్ బుక్ ను సందర్శిస్తున్నారట.
40 మిల్లియన్ ప్రజలు ట్విట్టర్నూ,
22 మిల్లియన్ ప్రజలు లింక్డిన్నూ,20 మిల్లియన్ ప్రజలు గూగుల్+ నూ
మరియూ 17 మిల్లియన్ ప్రజలు పింటెరెస్ట్ నూ సందర్శిస్తున్నారట.
250 మిల్లియన్ ఫోటోలను ఫేస్ బుక్ లో అప్లోడ్ చేస్తున్నారు.వీటిని ప్రింట్ చేసి నిలబెడితే 80 ఈఫిల్ టవర్స్ ఎత్తుకు వస్తుందట.
22 మిల్లియన్ గంటలసేపు పాత టీవీ షోలూ మరియూ సినిమాలూ చూస్తున్నారు.
8,64,000 గంటల వీడియోను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు.
18.7 మిల్లియన్ గంటల మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు.వింటున్నారు.
ఐఫోన్ అమ్మకాలు బిడ్డలు పుడుతున్న సంఖ్యకంటే ఎక్కువగా ఉన్నది. గంటకు 3,71,000 మంది బిడ్డలు పుడుతున్నారు.... 3,78,000 ఐ ఫోన్లు అమ్ముతున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి