దుబాయి, ఫిబ్రవరి 26: ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల్లో ఖతార్ అగ్రస్థానంలో నిలిచింది. అమెరికాకు చెం దిన ప్రతిష్ఠాత్మక ఫోర్ బ్స మేగజైన్ ప్రక టించిన ప్రపంచ సంపన్న దేశాల తాజా జాబితాలో కేవలం 17 లక్షల జనాభా గల్గిన ఖతార్ అత్యధిక తలసరి ఆదాయంతో టాప్ ర్యాంక్ సాధించింది. ఆయల్ ధరలు మళ్లీ పెరగటం, సహజవాయు నిల్వలు భారీగా కలిగివుండటం ఈ గల్ఫ్ దేశాన్ని విశ్వ చిత్రపటంలో అగ్రస్థానంలో నిలబెట్టింది. కొనుగోలు శక్తి పరంగా 2010 సంవత్సరానికి 88 వేల డాలర్ల తలసరి జాతీయ స్థూల ఉత్పత్తి కలిగివుందని ఫో ర్బ్స్ మేగజైన్ పేర్కొంది. అలాగే గల్ ఫలో 47,500 డాలర్ల తలసరి జాతీయ ఉత్పత్తితో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆరో స్థా నంలో, కువైట్ 15డవ స్థానంలో నిలి చాయని మేగజైన్ తెలిపింది.
2022 ఫుట్‌బాల్ ప్రపంచ కప్ నిర్వహించనున్న ఖతార్, 2020 ఒలింపిక్స్ కోసం పోటీ పడుతోంది కూడా. ఫోర్ బ్స మేగజైన్ సంపన్న దేశాల జాబితాలో 81వేల డాలర్ల తలసరి జిడిపితో లక్సెంబర్ గ ద్వితీయ ధనిక దేశంగా అవతరించింది. ఇక 56,700 డాలర్ల తలసరి జిడిపితో టెక్నాలజీ, వస్తూత్పత్తి, ఫైనాన్స్ హబ్‌గా పేర్కొనే సింగపూర్ తృతీయ స్థానంలో నిలిచింది. సంపన్న దేశాలకు ర్యాంక్ నిర్ణయంచడంలో మొత్తం 182 దేశాల కొనుగోలు శక్తితో జిడిపిని సర్దుబాటు చేసి లెక్కించడం జరిగిందని, ఇందుకు 2010 సంవత్సరం అంతర్జాతీయ ద్రవ్యనిధి గణాంకాలను పరిగణనలోకి తీసుకోవడం జరిగిందని ఫోర్బ్స్ మేగజైన్ తెలిపింది. కాగా, ఈ జాబితాలో నార్వే, బ్రునేయ ఐదో ర్యాంక్‌లో వుండగా, యుఎఇ ఆరు, యుఎస్ ఏడు, హాంకాంగ్ ఎనిమిది, స్విస్ తొమ్మిది, నెదర్లండ్స్ పదో స్థానంలో నిలిచాయని మేగజైన్ పేర్కొంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి