ఓ ఏలిక.. ఒక పిచ్చుక
సింహాసనంపై
సుఖాసీనులయ్యాక సభ వంక దృష్టిసారించిన ఆ సీమాంవూధకేసరి ఒక్కసారిగా
అవాక్కయ్యారు. జన మధ్యమున ముర్రాజాతి గేదెలు, హాల్‌స్టీన్, జెర్సీ ఆవులను
పరికించి క్షణకాలం నోరెళ్లబెట్టారు! అంతట తేరుకొని ‘ఎవరక్కడ?’ అని
గర్జించాడు. ఆ గాండ్రింపునకు సభామందిరం మారుమోగినా చేరాల్సిన చెవిని
చేరనేలేదు! కారణం వాటికి సెల్‌ఫోన్ మైకులు వేలాడుతుండడమే! ‘అయ్యది..
వీరికెంత కండకావరం..?’ మనస్సులోనే అనుకొని అవమాన భారం, ఆగ్రహంతో కూడిన
గొంతుకతో మరొక్కసారి దిక్కులు పిక్కటిల్లేలా, ‘ఏమదీ.. ఎ..వరక్కడ..?’ అంటూ
ఉరిమాడు! అంతే ఆ ‘వాక్’పిడుగుతో ఆయన సహా వేదికనలంకరించిన ప్రముఖులు, సభలోని
సామాన్యులు ఒక్కసారిగా ఊగిపోయారు. ఉన్నట్టుండి తుఫానులో చిక్కుకున్న
అనుభూతికి లోనయ్యారు. పశువులు మాత్రం తీరిగ్గా నెమరేసుకుంటున్నాయి.
అంతట ఆయన గారి ఆంతరంగిక కార్యదర్శి ఉలిక్కిపడి, చెవిలోని సెల్‌ఫోన్ మైకులు ఊడబీకి ఒక్క ఉదుటన వేదికపైకి చేరుకున్నాడు. చెయ్యి ఛాతిపై ఆన్చి, తలవంచి ‘చిత్తం ప్రభూ..’ అంటూ రాచభక్తిని చాటుకున్నాడు. వెంటనే ఆ భువనాధీశుడు అతడినీ, పక్కనే ఉన్న మంత్రులనూ ఉటంకిస్తూ ‘మేము చెప్పిందేమిటి? మీరు చేసిందేమిటి? ఈ పశువులన్నీ ఎక్కడివి? 11వ భాగస్వామ్య దేశాల జీవ వైవిధ్య సదస్సుకు వేంచేసిన దేశ, విదేశీ ప్రముఖులంతా ఏరి? 194 దేశాల నుంచి వేలాది మంది ప్రతినిధులు తరలివస్తానన్నారే రాలేదా?’ రాజావారి గొంతు నుంచి ఆగ్రహం, ఆవేశం, కుతూహలం కలబోసిన ప్రశ్నలు ఇలా ఒకదాని వెంట ఒకటి దూసుకురావడంతో మంత్రుల గణం, అధికారయంవూతాంగం పైప్రాణాలు పైనే పోయాయి. ‘ప్రభువులు మన్నించాలి.
నిన్న సాయంవూతానికే ప్రతినిధులంతా మన రాజధాని హైదరాబాద్ చేరుకున్నారు. తమరి ఆజ్ఞానుసారం వారందరికీ ఎర్రతివాచీ స్వాగతం పలికాం. నభూతో నభవిష్యత్ అన్న రీతిలో అతిథి మర్యాదలతో పాటు అయిదు నక్షవూతాల పూటకూళ్ల ఇళ్లలో విడిది కూడా ఏర్పాటు చేయించాం..’ పర్యాటక మంత్రి సెలవిచ్చారు. ‘మరిక్కడికెందుకురాలేదు?’ ముఖ్యమంవూతివర్యుల మాట పూర్తి కాకముందే ఈ సారి ఆరోగ్యమంత్రి అందుకున్నారు. ‘ప్రభూ.. వారంతా ఇంతకాలం గాలికి రూపం, నీటికీ రంగు ఉండవనే భ్రమల్లో బతుకుతున్నారు! మన భాగ్యనగర చుట్టుపక్కల భారీ పరిక్షిశమలు, అంతర్‌నగరాన మిక్కిలి ద్వి, త్రి, చతుర్‌చక్ర వాహనాలున్నవి కదా! అవి వెలువరించే పొగతో ఇక్కడి గాలికో రూపమొచ్చింది కదా! మనం నగర
వాసులకు సరఫరా చేస్తున్న నీళ్లు ఎలాగూ ఎర్ర రంగులో ఉండనే ఉన్నవి! ఈ గాలి పీల్చి, ఈ నీటిని తాగి అంతా ఒక్కసారిగా కుప్పకూలితే ఉస్మానియాకు తరలించి, చికిత్స చేయిస్తున్నాం. మేం అక్కడి నుంచే వస్తున్నాం..’ ‘ఓహో.. అటులనా..! విదేశీయుపూంత సుకుమారులు సుమీ! సరే.. మరి ఈ పశువుల సంగతి..?’ కిరణ్‌కుమారుడి ప్రశ్నకు సమాధానంగా ‘ప్రభూ.. నేను చెబుతాను..’ అంటూ ఉపముఖ్యమంవూతివర్యులు లేచారు. ‘హైదరాబాద్.. బయోడైవర్సిటీ రాజధాని’ అని ఇటీవల మీరు పత్రికలకిచ్చిన ప్రకటన చూసి అంతా తికమకపడ్డాం. మన రాజధానికీ, జీవవైవిధ్యానికీ సంబంధమేమిటో అర్థం కాక బుర్రలు బద్దలు కొట్టుకున్నాం.
మన రాజ్యాన పేదోడు, గొప్పోడి జీవితాల మధ్య చాలా వైరుధ్యమే ఉన్నది కదా..! దీనిని ఉద్దేశించే తమరిలా ప్రకటించారేమోనని సర్దిచెప్పుకున్నాం. అయినా ఎక్కడో కించిత్ అనుమానం! పైగా వచ్చేది విదేశీ అతిథులాయె! ఎందుకైనా మంచిదని మన రాజ్యం నలుమూలల నుంచి వన్యవూపాణులను తెప్పించదలిచాం. సేనాధిపతి సహా సర్వసైన్యాన్నీ వెంటేసుకొని దండకారణ్యం నుంచి నల్లమల దాకా అడపాదడపా మిగిలిన చెట్లు, పుట్టపూల్లా వెతికాం. సింహ, వ్యాఘ్ర, ఖర, మర్కట, సర్ప, మండూక, పిచ్చుక, మయూర, గరుడ, గబ్బిల, మిడత, సీతాకోకచిలుకాదుల కోసం అణువణువూ గాలించాం. చివరకవేవీ కానరాక కృత్రిమ పాల ఉత్పత్తి కేంద్రాల నుంచి ఇదిగో ఈ గేదెలు, ఆవులను తెప్పించాం. ప్రభువులు క్షమించాలి. ఇవి కూడా జాతి పశువులు కావు. విదేశాలవి!’ అనగానే ‘ఏమి మన రాజ్యాన పశుపక్ష్యాదులేమియునూ లేవా..? వెంటనే ‘అరణ్య’కశిపుడు సింహరాజును పిలిపించుడు! అటవీ రాజ్యాన ఏం జరుగుతోందో తెలుసుకొనెదము.’ ఆదేశించారు సీమాంధ్ర దేశపు చక్రవర్తి! అంతట అటవీశాఖామాత్యులు అందుకొని ‘ప్రభువులు మన్నించాలి..
నాకు ఆనవాయితీగా అటవీశాఖ అప్పగించితిరి. మీ ఆజ్ఞ మేరకు ఆ పదవి చేపట్టితినిగానీ మీరేనాడూ నన్నో మంత్రిగా చూడకపోతిరి. ఈ శాఖ గురించి నామమావూతమైనా పట్టించుకోకపోతిరి. నిజానికి మన రాజ్యాన అడవులు ఏనాడో అంతరించినవి. గుట్టలు కూడా గ్రానైట్ రూపంలో దేశసరిహద్దులు దాటినవి! ఇప్పుడు మన దేశమంతా ఎడారిని తలపించుచున్నది! ఇక అటవీ రాజ్యమెక్క డిది? సింహరాజెక్కడ?’ నిట్టూర్చాడు. ‘అయ్యదీ ఏమిటీ వైపరీత్యం? నా రాజ్యంబున ఒక్క సింహమునూ లేదా?’ ఆశ్చర్యావేదనతో ప్రశ్నించారు ముఖ్యమంవూతివర్యులు. ‘సింగాలే కాదు మహారాజా.. వ్యాఘ్రములునూ లేవు! మొన్నటి దాకా మన నగర సమీపంలోని జంతు ప్రదర్శనశాలలో పది దాకా పులులుండేవి. అందులో రెండింటిని అప్పట్లో సిబ్బందే చంపి తోలు ఒలుసుకుపోతే, మిగిలినవి సంరక్షణ లేక చచ్చినవి.’ చివరి పదం నొక్కిపలికాడు సేనాధిపతి.
‘క్రూర జంతువుల సంగతి వదిలేయండి. సాదుజీవుల సంగతేంటి? మన కృష్ణ జింకపూక్కడ?’ నల్లారి వారి పదఝరిని ఈసారి అటవీమంవూతివర్యులు అడ్డుకుంటూ, ‘అదిగో మన రాచభవన గోడలకు వేలాడుతున్న ఆ చిత్రరాజమున గోచరించుచున్నవి..’ అని పరాచకమాడాడు. ‘ప్రభువులు.. మరొక్కసారి మన్నించాలి. మీరు నమ్మలేకున్నారు. కానీ మన రాజ్యమున వన్యవూపాణులన్నీ హరించినవి.’ అని మరోసారి ముఖ్యమంవూతివర్యులకు తేటతెల్లం చేసేందుకు ప్రయత్నించాడు. ఊగిపోయిన కిరణ్‌కుమారుడు ‘ఎందువలన చేత?’ అంటూ మొదటిసారంత కాకపోయినా ఓ మోస్తరుగా గర్జించాడు. ప్రభువు ఆగ్రహానికి అక్కడి గాలి స్తంభించగా, సభలోని సామాన్యుడైన విజ్ఞుడొకడు దానిని ఛేదించుకొని ఇలా మొదపూట్టాడు.. ‘ధర్మవూపభువులు.. తమకు తెలియనిదేముంది చెప్పండి..? ఓ వైపు రాజ్య జనాభా విశృంఖలంగా పెరుగుతూ పోతోంటే, మీ తాతముత్తాతలునూ, మీ తండ్రియునూ, మీరునూ మీసాలకు సంపెంగ నూనె రాసుకుంటూ మిన్నకుంటిరి.
లక్షల జనం కోట్లై, కూడు, గూడు కోసం వనాల్లోకి చొచ్చుకుపోతోంటే చోద్యం చూస్తూ కూర్చుంటిరి. మీ మంత్రులు, అధికారులు, ఉద్యోగుల లంచగొండితనం వల్ల అటవీదొంగలు విజృంభించి కీకారణ్యాలను మైదానాల్లా మారుస్తోంటే ఏనాడూ పట్టించుకోకపోతిరి. వన్యవూపాణులే కాదు.. మీ నిర్వాకం వల్ల చెంచులు, గోండులు, కొలాముల్లాంటి అరుదైన అడవి బిడ్డలూ ఆగమైరి.’ అంతట భూమండలాధీశుడు అడ్డుకొని ‘ఏమి నీ అధిక ప్రేలాపన..?’ అంటూ కనుబొమ్మపూగిరేయగా, అవి యథాస్థానానికి చేరకముందే విజ్ఞుడు మళ్లీ అందుకున్నాడు. ‘మీరు రాజాధిరాజులు..! సకల విద్యాసంపన్నులు..! సర్వశాస్త్రాలనూ కాచి వడబోసిన సరస్వతీపువూతులు..! అయిననూ ఈ ఒక్క రోజు నేను చెప్పేది వినండి! ప్రభూ.. ఈ సృష్టిలోనే వైవిధ్యమున్నది.
నక్షవూతాలు, గ్రహాలు, ఉపక్షిగహాలు.. ఇలా వేర్వేరే గోచరించినా, వేటికవే సంచరించినా, నిజానికవన్నీ పరస్పరాకర్షణ శక్తితో బందీలై, నిర్దేశిత కక్ష్యల్లో నిర్ణీత వేగంతో పరివూభమించడం వల్లే ఈ విశ్వం మనగలుగుతున్నది! ప్రకృతీ అంతే! భూమిపై కోటానుకోట్ల మొక్కలు, చెట్లు, క్రిమికీటకాదులు, జల, భూ, ఉభయచరాలన్నీ పరస్పరాధారభూతమై బతుకుతున్నవి! ఒకటి లేనిది మరొకటి లేదు! ఈ ధర్మసూకా్ష్మన్ని మీతో సహా వివిధ దేశాల పాలకులు నేటికినీ గ్రహించలేకపోతిరి! అభివృద్ధి పేరిట పెద్ద ఎత్తున పర్యావరణ విధ్వంసానికి పూనుకుంటిరి! ప్రకృతి విధ్వంసమే జీవన విధ్వంసమన్న సంగతిని పూర్తిగా విస్మరించితిరి! విజ్ఞుల మాటలు పెడచెవిన పెట్టి, స్వలాభాపేక్షతో మీరు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల అడవులు, గుట్టలన్నీ నాశనమై, జల, వాయు కాలుష్యంతో ఆహార చట్రం ముక్కలై, ప్రాణి కోటి మనుగడే ప్రశ్నార్థకంగా మారింది! అంతెందుకు? సేంద్రియ ఎరువులు, దేశీయ విత్తనాల వాడకమే ఉత్తమమని ఎవంత మొత్తుకున్నా వినకపోతిరి. విదేశీ శక్తులు, బహుళజాతి కంపెనీలకు తలొగ్గి వారు తయారు చేసే బీటీ విత్తనాలు, కృత్రిమ ఎరువులు, క్రిమికీటకనాశనులకు మన వ్యవసాయ క్షేత్రాలను ప్రయోగశాలలుగా మార్చితిరి! తద్వారా మన పొలాల
చేనుచెలకల్లోని నీరు, పైరు విషపూరితమై, నేలలోని వానపాములు, ఆకుల మీది మిడతలు, మిత్రపురుగుపూన్నో నాశనమవుతున్నవి! ఆ మిడతలను తిని బతికే పిచ్చుకలు, తొండలు, కప్పలు, ఎలుకలు, వివిధ రకాల చేపలు అంతరిస్తున్నవి. ఎలుకలు, కప్పలు లేకపోవడం వల్ల పాములు, పాములు లేకపోవడం వల్ల గద్దలు.. ఇలా జీవరాశులన్నీ కాలగర్భంలో కలిసిపోతున్నవి. కప్పలు, చేపలు లేకపోవడం వల్ల దోమలు విజృంభించి మానవజాతిని రోగాలపాల్జేస్తున్నవి. వ్యవసాయ యాంత్రికీకరణ పుణ్యమా అని ఎడ్లు, దున్నపోతులు, జాతి ఆవులు, గేదెలు కనుమరుగవుతున్నవి. వాటి స్థానంలో కేవలం పాల కోసం ముర్రాజాతి గేదెలు, జెర్సీ, హాల్‌స్టీన్ ఆవులు పెంచబడుతున్నవి. నాడు ఏ గ్రామ శివారులో ఎటుచూసినా గొడ్ల మందలు, ఎక్కడో ఓటి చస్తే వాటి కళేబరాలను పీక్కుతిని బతికే రాబందులు కనిపించేవి. ఇప్పుడా గొడ్లు లేవు. రాబందులూ లేవు. కాసుల కక్కుర్తితో గ్రానైట్ పేరిట గుట్టలనూ అమ్ముకొని కోతులు, ఎలుగుబంట్లు, నెమళ్లలాంటి ప్రాణులకు నిలువనీడలేకుండా చేస్తిరి. అవి కాస్తా జనావాసాల్లోకి వచ్చి కుక్కచావు చస్తున్నవి.
అడవులు, పచ్చిక బయళ్లు మాయమై జింకలు, దుప్పులు, ఏదులు, కుందేళ్ల లాంటి అనేక జాతులు అంతరించిపోతున్నవి. ఇక వాటినే తిని బతికే పులులు, సింహాలన్నీ చూస్తుండగానే గతించిపోతున్నవి. అడవులు తగ్గుతున్నకొద్దీ ఎండలు మండుతున్నవి. వర్షాలు అదుపుతప్పుతున్నవి. పంటల దిగుబడి పడిపోయి కరువు కోరలు చాస్తున్నది. ప్రభూ.. తమరు గమనించితిరో లేదో ఈ యేడు వరుణుడు కరుణించక వర్షాకాలంలోనే కరెంటు కోతలు తీవ్రమై ప్రజలు నానాపాట్లు పడుతున్నరు. ఏ పారిక్షిశామికాభివృద్ధి కోసమని మీరు పర్యావరణ విధ్వంసానికి దిగారో ఆ పరిక్షిశమలన్నీ పక్క ప్రాంతాలకు తరలిపోతున్నవి.
ఓ పక్క ఇంతటి పర్యావరణ, జీవనవిధ్వంసానికి కారణమవుతున్న మీరూ, మీ ప్రభుత్వం మరోపక్క జీవవైవిధ్య సదస్సుకు ఆతిథ్యమివ్వడం చిత్తశుద్ధిలేని శివపూజలాంటిదే తప్ప వేరొకటి కాదు! రాజాధిరాజా.. ఇప్పటికైనా కళ్లు తెరిచి, నాశనంకాగా మిగిలిన అడవులు, అందులోని వన్యవూపాణుల సంరక్షణకు చర్యలు తీసుకోకపోతే కొన్నేళ్లకు కరువు, కాటకాలు ప్రబలి ఇలాంటి సదస్సులు నిర్వహించేందుకు మీరూ, వేడుక చూసేందుకు మేమూ ఉండము.’
ఆ సామాన్యుడి అసామాన్య ఉద్బోధతో ఖిన్నుడైన కిరణ్‌కుమారుడు, ఒక్కసారిగా సింహాసనం నుంచి లేచి, ‘అంబా..’ అనే అరుపుల మధ్య రాచమందిరము వైపు వడివడిగా నడుస్తున్నాడు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి