11, అక్టోబర్ 2012, గురువారం

కరెంట్‌ కోతలు ఆపేందుకు కొత్తవిధానం

  • పవర్‌ కట్స్‌ కు సోలార్ పవర్‌తో చెక్‌
  • కొత్త కరెంట్ పాలసీని ప్రకటించిన ప్రభుత్వం  
  • సోలార్ విద్యుత్ ప్లాంట్లకు రాయితీల వర్షం
  • ఎక్సైజ్‌-స్టాంపు-వ్యాట్‌ భారాల నుంచి మినహాయింపు   
  • విద్యుత్ కోతలకు సోలార్ పవర్ తో చెక్‌ పెట్టేందుకు సర్కార్‌ సిద్దమవుతోంది.
  • సౌర విద్యుత్ ప్లాంట్ కు 5 రోజుల్లోనే క్లియరెన్స్‌
  • పారిశ్రామిక వేత్తలు సోలార్ పాలసీని వాడుకోవాలన్న విద్యుత్ శాఖ
విద్యుత్ కోతలతో అవస్థలు పడుతున్న రాష్ట్రాన్ని సోలార్‌ పవర్‌తో గట్టెక్కించేందుకు సర్కార్ రంగం సిద్దం చేసింది. మూడు నెలల కసరత్తు అనంతరం కొత్త సోలార్‌ పవర్ పాలసీని రూపొందించింది. ఎవరైనా సోలార్ పవర్ ప్లాంట్ ను నెలకొల్పవచ్చిన తెలిపిన ప్రభుత్వం . ప్లాంట్లకు భారీగా రాయితీలిస్తామని ప్రకటించింది. అటు ఢిల్లీ వేదికగా ఇవాళ్టీనుంచి జరగనున్న అంతర్జాతీయ సౌర విద్యుత్ సమావేశంలో  దేశంలో తమదే అత్యుత్తమైన పాలసీ అని చెప్పేందుకు విద్యుత్ మంత్రి పొన్నాల సిద్దమయ్యారు.  

ఫ్యాప్సీ-సిఐఐ సంయుక్తంగా రూపొందించిన నివేదిక ఆధారంగా సోలార్ విద్యుత్ పాలసీని ప్రభుత్వం విడుదల చేసింది. సోలార్ ప్లాంట్ లను ఎవరైనా ఎక్కడైన పెట్టుకోవచ్చని తెలిపిన ప్రభుత్వం, భూమిని ఎంచుకుని ప్లాంట్ ను నెలకొల్పితే 15 రోజుల్లో నే విద్యుత్ కొంటామని ప్రకటించింది. ఎక్సైజ్‌-స్టాంపు-వ్యాట్‌ భారాలు లేకుండా ప్లాంట్లకు రాయితీలిస్తామనీ పేర్కొంది. సోలార్ ప్లాంట్లపై ఇంత పారదర్శకమైన విధానం ఎక్కడా లేదని రాష్ట్ర సర్కార్ ఘనంగా ప్రకటించుకుంది.   

ఇక ఢిల్లీ వేదికగా జరగనున్న సౌర అంతర్జాతీయ విద్యుత్‌ సమావేశంలో ప్రభుత్వం కొత్త సోలార్ పాలసీని ప్రస్తావించనుంది. ప్రధాని మన్మోహన్ సింగ్‌ ప్రారంభించే ఈ సదస్సులో సుమారు 50 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. మన రాష్టప్రభుత్వం తరుపు నుంచి మంత్రి పొన్నాల ప్రతినిధిగా హాజరవుతున్నారు. విద్యుత్ కోతలతో అవస్థలు పడుతున్న పరిశ్రమలు.. సౌర విద్యుత్‌ ప్లాంట్ నెలకొల్పేందుకు ముందుకొస్తే కేవలం 5 రోజుల్లోనే క్లియరెన్స్ ఇస్తామని విద్యుత్ శాఖ చెబుతోంది.మరోవైపు సోలార్ పవర్‌ పై అంతర్జాతీయ సమావేశాన్ని దృష్టిలో ఉంచుకునే రాష్ట్రప్రభుత్వం కొత్త పవర్‌ పాలసీని రూపొందించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోలార్ పవర్‌ ప్లాంట్లకు కావాల్సిన యంత్రాలను  ప్రభుత్వమే రాయితీలతో అందించాలని పారిశ్రామిక వేత్తలు కోరుతున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి