12, అక్టోబర్ 2012, శుక్రవారం

మెక్సికోను కుదిపేసిన వాల్‌మార్ట్‌ సంక్షోభం


ప్రపంచంలోనే అతిపెద్ద రిటైలర్‌ వాల్‌మార్ట్‌ స్టోర్‌ సోమవారం తన మార్కెట్‌లో 10 బిలియన్‌ డాలర్ల న
ష్టానికి లోనైంది. వాల్‌మార్ట్‌ వ్యాపారాన్ని పెంపొదించడానికి ముడుపులు చెల్లించారని వచ్చిన ఆరోపణపై అమెరికా శాసనకర్తలు విచారణ చేపడుతున్నట్టు ప్రకటించడంతో వాల్‌మార్ట్‌ కంపెనీ షేరు 4.7 శాతం నష్టపోవడంతో డోజోన్స్‌పై కూడా ప్రభావం చూపింది. డోజోన్స్‌ సూచీ ఒక శాతం నష్టాన్ని నమోదు చేసింది. దాంతో ఈ సంవత్సరం ఆర్జించిన లాభాల కంటే ఎక్కువ మొత్తంలో తుడిచిపెట్టుకుపోయింది. మెక్సికో మార్కెట్‌లో వాల్‌మాక్స్‌గా పిలువబడే వాల్‌మార్ట్‌ సంస్థ షేరు 12 శాతం కుంగి 37.89 పీసోల నష్టానికి గురైంది.
అవకతవకలకు పాల్పడిన వాల్‌మార్ట్‌పై విచారణ చేపట్టడానికి అనుమతించాల్సిందిగా ప్రభుత్వానికి ఎలిజా కమ్మింగ్స్‌, హెన్రీ వాక్స్‌మ్యాన్‌లు లేఖ రాశారు. మెక్సికోలో భవనాల నిర్మాణం చేపట్టడానికి అనుమతుల కోసం మెక్సికన్‌ కంపెనీ ఏవిధంగా ముడుపులు చెల్లించిందన్న విషయాన్ని ఈమెయిల్‌ వాల్‌మార్ట్‌ లాయర్‌కు వచ్చిందని న్యూయార్క్‌ టైమ్స్‌ కథనంలో వెల్లడించింది. అయితే వాల్‌మార్ట్‌పై వస్తున్న ఆరోపణలు తమ వ్యాపారంపై పెద్ద ప్రభావం చూపించవని తెలిపింది. మెక్సికో మార్కెట్‌ ముగిసిన తర్వాత తొలి క్వార్టర్‌లో వాల్‌మాక్స్‌ ఆర్థిక ఫలితాలు అంచనాలు చేరకోలేదని వార్తలు వెలువడ్డాయి. ఈ ప్రతికూల వార్తలతో వాల్‌మార్ట్‌ ఆర్థిక పరిస్థితి మార్కెట్‌లో మరింత దిగజారే అవకాశమున్నట్టు ఆర్థిక విశ్లేషకులు వెల్లడించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి