1, అక్టోబర్ 2012, సోమవారం

మనిషే విలన్


‘హైదరాబాద్‌లో బయోడైవర్సిటీ సదస్సు... అవును! అయితే...? ఎందుకు తక్కువగా చూడాలి? 1992 నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఈ సదస్సులకు ఎక్కడో అక్కడ వేదిక కావాలి. కిందటి సారి జపాన్‌లో జరిగింది. ఈ సారి ఇండియాలో చేయాలనుకున్నారు. దేశంలో ఢిల్లీలో ఇప్పటికే చాలా ఈవెంట్లు జరిగాయి. అన్నిటికీ ప్రతిసారీ ఢిల్లీనే ఎందుకని హైదరాబాద్‌కు అవకాశం ఇచ్చారు. ఇక్కడ వెదర్ బాగుంటుంది, అన్నిటికీ అనుకూలంగా ఉంటుందని కూడా హైదరాబాద్‌ను హోస్ట్‌గా చేశారు. దురదృష్టవశాత్తు మీడియా దీని మీద న్యారో యాంగిల్ తీసుకుంది. కానీ ఈ సారి బయోడైవర్సిటీకి హైదరాబాద్ వేదికైనందుకు హ్యాపీగా ఫీలవ్వాలి. ఇలాగైనా హైదరాబాద్ జీవావరణం ప్రపంచ దృష్టికి వస్తుంది కదా..!

అర్బనైజేషన్...
ఈ సమస్య హైదరాబాదుదే కాదు ప్రపంచంలోని అన్ని నగరాలకూ ఉంది. పరిక్షిశమలు, నగరీకరణ పర్యావరణ ప్రభావాన్నే దెబ్బతీస్తున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులు, కుంటలు మాయమై రియల్ ఎస్టేట్ విస్తరిస్తున్నది. ఇలాంటి ప్రాబ్లమే జపాన్‌లో ఉంది, చైనాలో ఉంది. అక్కడ మనకన్నా దారుణం. బ్రెజిల్లోనైతే అమేజాన్ అడవులను నరికేయడం కాదు ఏకంగా తగలబె

ప్లస్ పాయింట్స్
జీవవైవిధ్యమే మనకు ప్లస్ పాయింట్. ముందు దక్షిణ భారతాన్ని తీసుకుంటే... తూర్పు, పశ్చిమ కనుమలు, వింద్యా పర్వత శ్రేణులు జీవవైవిధ్యానికి చక్కని ఉదాహరణలు. హైదరాబాద్ విషయానికి వస్తే.. 150 కిలోమీటర్ల దూరంలోనే తూర్పుకనుమల్లోని నల్లమల అడవులున్నాయి. రీజనబుల్ రెయిన్ ఫాల్స్, లోయలు, కృష్ణానది, దాని ఉపనదులు, సెలయేళ్లు, వాగులు, వంకలు, చెట్లు, గుట్టలు, పుట్టలతో జీవవైవిధ్యానికి ప్రతీకగా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది భారతదేశంలోనే పెద్దదైన టైగర్ శాంక్చురీ ఇది. పులులున్నాయంటే ఇక్కడ జీవవైవిధ్యమున్నట్లే లెక్క. దాని శత్రువులు, మిత్రువులు.. వాటికి కావలసిన ఆహారం అంతా ఇక్కడుంటుంది కాబట్టి అన్నిరకాల జీవుల వైవిధ్యం నల్లమలలో కనపడుతుంది. అంతేకాదు నల్లమల అడవుల్లో ఉన్నన్ని ఔషధ మొక్కలు ప్రపంచంలో ఎక్కడా లేవు.

దొరకవ్ కూడా. ఇదే నల్లమలలో తూర్పుకనుమలకు తూర్పువైపు ఉన్న ప్రకాశం జిల్లాలోని ఒంగోలు గిత్త వరల్డ్ ఫేమస్. దాన్ని మించిన బలమైన, అందమైన గిత్త ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇటువైపు కర్నూలు జిల్లాలోని రోళ్లపాడు.. మంచిగడ్డి మైదానాలకు నిలయం. ఇక్కడే అరుదైన పక్షి ‘బట్ట మేక పిట్ట’ ఉంటుంది. అంతరించి అంతరించి ఈ పక్షులు ఇప్పుడు వందల్లో మిగిలాయి. వీటిని సంరక్షించడానికి ఇక్కడే ఓ పరిరక్షణ కేంద్రం ఏర్పడింది!

పక్షులు.. చెట్లే కావు..
బయోడైవర్సిటీ అంటే కేవలం పక్షులు, చెట్లే కావు.. ఫలాలు, ధాన్యాలు కూడా. హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరంలో.. మహబూబ్‌నగర్ వెళ్లే దారిలో బాలానగర్ ఉంటుంది. అక్కడ దొరికే సీతాఫలం ప్రపంచంలోనే అత్యంత తీయనైంది. సహజసిద్ధంగానే అంత కాస్తున్న ఆ ఫలాల వనాన్ని పరిరక్షించే చర్యలు ఏమైనా చేపడుతుందా ప్రభుత్వం? ప్రశ్నార్థకమే. అంతేకాదు తాండూర్, నారాయణ్‌పేట్, మఖ్తల్ ప్రాంతాల్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన తెల్ల జొన్నలు, కందులు దొరుకుతాయి. వీటిని కాపాడుకోవడానికి ప్రభుత్వం ఒక్క రీసెర్చ్ సెంటర్ అయినా పెట్టిందా? ఇక్కడి వాళ్లకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తోందా? హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే దారిలో ఉండే స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఒకప్పుడు ‘సాంబార్లు’ అనే ఒకరకమైన బియ్యం దొరికేవి. అవి ఒరిజినల్ వరి వంగడాలు. ఇప్పుడు లేవు.

ఇదే కాదు చిట్టిముత్యాలు లాంటి వెరైటీ కూడా కనుమరుగే! దీనికి కారణం మనం పెంచి పోషించుకున్న హరిత విప్లవం. అది పేరుకే హరితం కాని చేసిందంతా పతనం. మన దేశంలోని నేలకు మనం అనాదిగా ఆచరించిన సంప్రదాయ సాగురీతులే కరెక్ట్. పరాయి దేశ పాలకులు తెచ్చిన ఈ మార్పులన్నీ మన దగ్గర వాళ్ల మార్కెట్‌ను విస్తరించుకోవడానికి, మన దేశంలో వాళ్లు సౌకర్యంగా ఉండడానికి తెచ్చినవే. వాటివల్ల తాత్కాలికంగా వ్యవసాయంలో దిగుబడి పెరిగి ఉండొచ్చు కానీ నేల తనకున్న సహజ గుణాన్ని కోల్పోయి సారాన్ని క్షీణింపచేస్తుంది. ఇప్పుడు మన వ్యవసాయం ఎదుర్కొంటున్న క్రైసిస్ అదే.

వాగులు.. ఇసుక
అన్నిటికన్నా మనం ఎదుర్కొంటున్న పెద్ద త్రెట్.. వాగుల్లోంచి ఇసుకను తోడడం. ఇదెంత ప్రమాదం అంటే... వాగుల్లో ఇసుక లేకపోతే భూమిలో నీటి శాతం తగ్గిపోయి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోతున్నాయి. ఇసుక ఉండడం వల్ల వాగుల్లో నీరొచ్చి పారుతున్నప్పుడు ఆ నీరు ఇసుకలో ఇంకి భూమిలో భద్రమవుతుంది. ఇసుకను తోడేస్తుంటే నీరు వృథాగా అలా పారుకుంటూ వెళ్లిపోతుంది. వాగుల్లోంచి ఇసుకను తవ్వడానికి వ్యతిరేకంగా నేను, నాలాంటి ఇంకొంతమందిమి కోర్ట్‌లో కేసు వేశాం. ఇసుక తియ్యొద్దని తీర్పు వచ్చింది. అయితే ప్రభుత్వం కాంట్రాక్టర్‌లకు.. కొండరాళ్లను పగుల కొట్టి ఆ పౌడర్ అంటే రాక్‌శాండ్‌ను కట్టడాలకు వినియోగించుకొమ్మని కొత్త వరాన్నిచ్చింది. ఒకవైపు ప్రకృతిని పరిరక్షించుకోవాలనే కదా.. వాగుల్లో ఇసుకను తీయొద్దని మేము కొట్లాడింది? మరి అట్లాంటప్పుడు రాళ్లను కొట్టి ఆ పిండిని వాడుకోండి అని చెప్పడంలో అర్థమేంటి? రాళ్లు మాత్రం ప్రకృతిలో భాగం కావా? రాళ్లు తరిగిపోతే మళ్లీ పుడతాయా? పైగా దక్కన్ అంటే రాక్స్‌కి పెట్టింది పేరు కదా! ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించకుండా గుడ్డిగా దేనికంటే దానికే అనుమతిస్తే ఎట్లా!

ప్రత్యామ్నాయం..
మన నిత్యావసరాలు సాఫీగా సాగిపోవడానికి ప్రకృతిని డిస్టర్బ్ చేయని ప్రత్యామ్నాయాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి ఇసుకకే ప్రత్యామ్నాయం తీసుకుంటే స్టీల్ ప్యాక్టరీల్లో వేస్ట్‌గా ఉన్న స్లాగ్ ఉంది. ఇది ఇసుక కన్నా కూడా స్ట్రాంగ్! దీనిమీద ప్రభుత్వమే ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇవన్నీ జరగడానికే ఇలాంటి బయోడైవర్సిటీ సమ్మేళనాలు!

అమలవుతున్నాయా?
విత్తనం నాటంగానే తెల్లవారే మొక్క మొలకెత్తదు కదా! సమయం పడుతుంది. ఇది కూడా అంతే. ఇప్పుడు హైదరాబాద్‌లో జరగబోయేది పదకొండవ సమ్మేళనం. ఇంతకుముందు కార్పొరేట్ సెక్టార్స్ నుంచి చాలా సమస్యలుండేవి. పర్యావరణానికి వాళ్లు కలిగిస్తున్న హాని గురించి ఇప్పుడు వాళ్లకూ తెలిసింది. చైతన్యం అయ్యారు. ప్రజలకూ మెల్లమెల్లగా అవగాహన వస్తోంది. పరిక్షిశమలు ఏ కొంచెం పొల్యూషన్‌ను విడుదల చేసినా ప్రజలు ఊరుకునే పరిస్థితి పోయింది. కార్పోరేట్ సెక్టార్‌ను ప్రభుత్వం సపోర్ట్ చేసే దశా దాటిపోయింది. ఇదంతా ఇలాంటి సదస్సుల వల్ల పెరుగుతున్న అవగాహనే. అందుకే మంచి మార్పుకు కొంత సమయం పడుతుంది. కానీ అది ప్రభావవంతంగా ఉంటుంది. ఈ సందర్భంలో బయోడైవర్సిటీకి హైదరాబాద్ డయాస్ కావడం నిజంగా మంచి పరిణామమే. అన్ని సమస్యలూ చర్చకు వస్తాయి కదా!’

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి