26, అక్టోబర్ 2012, శుక్రవారం

హైదరాబాద్‌పై 'సూర్య' కాంతులు !


ముంబయి: ఐపిఎల్‌ తాజా వేలంలో హైదరాబాద్‌ ఫ్రాంచైజీని 'సన్‌' గ్రూప్‌కు చెందిన 'సన్‌ నెట్‌వర్క్‌' కైవశం చేసుకుంది. దీంతో దక్కన్‌ ఛార్జర్స్‌ స్థానంలో నూతన జట్టుకు ఎంపికకై కొన్నాళ్ళుగా సాగుతున్న 'వేట'కు తెర పడింది. గురువారం ఇక్కడ సమావేశమైన ఐపిఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ నూతన ఫ్రాంచైజీ కోసం దాఖలైన టెండర్లను పరిశీలించగా, 'సన్‌ నెట్‌వర్క్‌' అత్యధికంగా ఏడాదికి రు. 80.05 కోట్ల మేరకు 'బిడ్‌' దాఖలు చేసినట్లు తేలిందని, గతంలో 2008లో ఈ ఫ్రాంచైజీ కోసం దక్కన్‌ ఛార్జర్స్‌ గ్రూపు చెల్లించిన మొత్తం కంటే ఇది నూరు శాతం ఎక్కువని బిసిసిఐ కార్యదర్శి సంజరు జగ్దలే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 'సన్‌ నెట్‌వర్క్‌' తరువాత పివిసి వెంచర్స్‌ రెండో అత్యధిక మొత్తం రు.69.03 కోట్లకు 'బిడ్‌' వేసిందని ఆయన తెలిపారు. కాగా, దాదాపు 2.8 బిలియన్‌ డాలర్ల (సుమారు రు. 15 వేల కోట్లు) 'సన్‌ గ్రూప్‌'కు అధిపతైన 48 ఏళ్ళ కళానిధి మారన్‌ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనుమడేగాక, మాజీ కేంద్ర మంత్రి మురసోలి మారన్‌ కుమారుడు కూడా. ఆయన సోదరుడు దయానిధి మారన్‌ కూడా ఇంతకుముందు కేంద్ర మంత్రిగా వ్యవహరించాడు. దక్షిణ భారతదేశంలో అతి పెద్ద టివి నెట్‌వర్క్‌ అధిపతైన కళానిధి మారన్‌ ప్రస్తుతం దేశంలోని అత్యధిక ధనవంతులు జాబితాలో 24 వ స్థానంలో వున్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి