12, అక్టోబర్ 2012, శుక్రవారం

వాల్‌మార్ట్ – కొన్ని వాస్తవాలు !


- చైతన్య
వాల్‌మార్ట్ గురించి ఈ వాస్తవాలను మీతో పంచుకుందామనుకుంటున్నాను. Walmart గురించి మనం తెలుసుకోవలసిన కొన్ని నిజాలు – ఇవి తెలుసుకున్నాక Walmart లో తక్కువ ధరలు ఎందుకుంటాయో అర్థం కాక మానదు.
  • Walmartలో అన్నింటికన్నా ఎక్కువ ఉండేవి సేల్స్ అసోసియేట్స్ ఉద్యోగాలు. 2001 లో సగటున వారి సంవత్సర ఆదాయం $13,861. 2001లో అమెరికా Poverty guidelines ప్రకారం ముగ్గురు సభ్యులున్న కుటుంబానికి $14,630 సంవత్సర ఆదాయం దారిద్ర రేఖగా పరిగణించబడింది. అంటే Walmart లో పనిచేసే ఎక్కువ శాతం ఉద్యోగులు దారిద్ర రేఖకు దిగువన ఉన్నారు. ఇక సంఖ్యలో సేల్స్ అసోసియేట్స్ తర్వాత వచ్చే కాషియర్ల సంవత్సర ఆదాయం 2003 wage analysis ప్రకారం $11,948 మాత్రమే.

  • Walmartలో అమ్మే వస్తువుల ధరలు డాలర్ కి ఒక అర సెంటు చొప్పున పెంచితే Walmart ప్రతి ఉద్యోగి యొక్క గంట జీతం ఒక డాలర్ పెంచే అవకాశం ఉంది. అంటే $2 లకు వస్తువుని $2.01 కి అమ్మడం, లేదా $200 లకు అమ్మే వస్తువులని $201కి అమ్మి Walmart తన ప్రతి ఉద్యోగికీ సంవత్సరానికి $1800 అదనంగా జీతం ఇచ్చే అవకాశం ఉంది. [Analysis of Wal-Mart Annual Report 2005]
  • Walmart లో చాలా మంది ఉద్యోగులు off-the-clock work చేస్తున్నారు. అంటే వాళ్ల పని గంటలు అయిపోయిన తర్వాత కూడా పని చేయించుకొని దానికి జీతం గాని, overtime గాని చెల్లించకపోవడం. మరి ఉద్యోగులు ఎందుకు off-the-clock పని చేస్తున్నారు? స్టోర్ మేనేజర్ల నుండి ఒత్తిడి, చేయమని తిరగబడితే ఉద్యోగం ఊడుతుందని భయం. భయమే కాదు అట్లా ఉద్యోగాలు ఊడిన దాఖలాలు అనేకం ఉన్నాయి. మరి మేనేజర్లు ఎందుకు అట్లా ఒత్తిడి తెస్తున్నారు? వాళ్లకేమి ఒరుగుతుంది? 1) ప్రతి స్టోర్ కి headquarters నిర్ణయించిన ఒక payroll budget target ఉంటుంది. ఆ నిర్ణీత బడ్జెట్ కన్నా labor cost ఎక్కువ అయితే మేనేజర్లకు వార్నింగ్ లివ్వడం లేదా వాళ్ళని demote చేయడం, dismiss చేయడం జరుగుతాయి. 2) Labor costs లను తగ్గించిన మేనేజర్లకు ఆ స్టోర్ మీద వచ్చిన లాభాలకనుగునంగా బోనస్ లివ్వడం. అంతిమంగా తక్కువ సంఖ్యలో ఉండే మేనేజర్లను నయానో భయానో వాళ్ళ చెప్పు చేతల్లో ఉంచుకొని ఎక్కువ సంఖ్యలో ఉన్న ఇతర ఉద్యోగుల శ్రమని దోచుకోవడం. కేవలం 2006 లోనే Walmart యాభై ఏడు wage and hour lawsuits ని ఎదురుకుంది.
  • ఇక Walmart లలో జరిగే Fair Labor Standards Act ఉల్లంఘనల లెక్కే లేదు. ఈ చట్టం ప్రకారం పని స్థలాలలో ఉద్యోగులకి కల్పించవలసిన విశ్రాంతి సమయాలు, భోజన విరామాలు కల్పించకపోవడం, మైనర్లను అపాయకరమైన మిషిన్లతో పని చేయించడం వంటివి జరుగుతున్నట్టు వేరు వేరు దర్యాప్తులలో వెల్లడయింది.
  • అమెరికాలో సగటున పెద్ద కంపనీలు, 66% ఉద్యోగులకి అరోగ్య భీమా అందిస్తుండగా Walmart కేవలం 43% ఉద్యోగులకి మాత్రమే health insurance అందిస్తుంది. అయితే 2005 అంచనాల ప్రకారం ఫుల్-టైమ్ పని చేసే ఒక Walmart ఉద్యోగి Walmart  అందించే single coverage తీసుకుంటే సగటున తన జీతం నుండి 7 శాతం ప్రీమియం కట్టడానికి, 25% డిడక్టబుల్ కట్టడానికి, family coverage తీసుకుంటే సగటున తన జీతం నుండి 22 శాతం ప్రీమియం కి, 40% డిడక్టబుల్ కట్టడానికి ఖర్చు అవుతుంది. Walmart అందిస్తున్న ఇన్సూరెన్స్ పాలసీల ఖర్చు భరించే శక్తి లేక చాలా మంది ఉద్యోగులు ప్రభుత్వం low-income జనాభాకి ఇచ్చే Medicare, Medicaid లపై ఆధారపడుతున్నారు. Medicare, Medicaid లు ప్రజల టాక్స్ డాలర్లతోనే కదా నడిచేది. అంటే సంతోషంగా రెండు మూడు డాలర్లు తక్కువకు కొన్న వస్తువు మనకు కనబడ్తుంది కాని తెలియకుండా టాక్స్ డాలర్ల రూపంలో పడే భారం మనకు కనిపించదు. Walmart కి రావలసిన లాభాలకు ఎలాంటి ఢోకా లేదు, నష్టపోయేది అటు Walmart ఉద్యోగులు, ఇటు కస్టమర్లు.
  • 2004 లో (దారిద్ర్య రేఖకు దిగువనున్న) Walmart ఉద్యోగులు సుమారు 2.5 బిలియన్ డాలర్ల ప్రభుత్వ సహాయానికి (Federal assistance) అర్హులని ఒక అంచనాలో తేలింది. అవి food-stamps, low-income housing assistance, low-income energy assistance, health-care, ఇలా రకాల రకాల రూపాల్లో ఉంటుంది.
  • ఇంతే కాక tax-payer లు వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులు సబ్సిడీల రూపంలో కూడా Walmartకి ధారపోస్తున్నారు. Walmart సబ్సిడీలపై మొదటిసారి జరిగిన ఒక జాతీయ రిపోర్ట్ ప్రకారం స్టేట్, లోకల్ ప్రభుత్వాల నుండి Walmart పొందిన సబ్సిడీలు కనీసం ఒక బిలియన్ డాలర్లు.
  • 2005 లో National Bureau of Economic Research జరిపిన ఒక పరిశోధనలో Walmart ఉన్న ఒక countyలో సగటున ఒక మనిషి ఆదాయం 5% తగ్గుతుందని తేలింది. ఈ పరిశోధనలో Walmart స్టోర్ రికార్డులు, ప్రభుత్వ రికార్డులు ఉపయోగించబడ్డాయి.
  • 2004 లో Walmart అమ్మిన 60% వస్తువులని నేరుగా చైనా నుండి దిగుమతి చేసుకుంది. అమెరికా నుండి సప్లై అవుతున్నయని చెప్పుకుంటున్న వస్తువులు కూడా చాలా మటుకు ఆ సప్లయర్ చేత చైనా, ఇండొనేసియా, బంగ్లాదేశ్ వంటి దేశాలలో తయారు చేయించబడుతున్నవే. ఇన్ని లేబర్ హక్కులు ఉన్న అమెరికాలోనే ఉద్యోగుల పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటే ఇక third world దేశాలలో వస్తువులు తయారు చేసే వాళ్ల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. వాళ్లకి కనీస వేతనలు (legal minimum wage) కూడా ఇవ్వకుండా వాళ్ల నిస్సహాయతని సొమ్ము చేసుకుంటున్నారు. సెప్టెంబర్ 2005లో తమకి కనీస వేతనాలు చెల్లించడం లేదని, సెలవులు ఇవ్వడం లేదని, overtime పని చేయించుకుంటున్నారని చైనాలో Walmart కోసం పని చేస్తున్న వర్కర్లు Walmartపై class action suit కూడా వేసారు. ఇతర దేశాలలో Walmart దౌర్జన్యాల గురించి చెప్పాలంటే చిట్టా సాగుతూనే ఉంటది.
  • Walmart వర్కర్ యూనియన్లకి పచ్చి వ్యతిరేకి. 2005 లో Union certification వచ్చిన మొదటి Walmart స్టోర్ ని Walmart మూసివేసింది. వేరే ఏ స్టోర్ లలోని ఉద్యోగులు ఆ సాహసం చేయకుండా అనుకుంటాను. కేవలం 2002 లోనే unfair labor practices charges కింద Walmart పై 43 కేసులు పెట్టబడ్డాయి. యూనియన్లు పెట్టుకోదల్చిన వర్కర్లపై చట్టవ్యతిరేకంగా నిఘా ఉంచడం, వాళ్లని బెదిరించడం, ఉద్యోగాల్లో నుండి తీసెయ్యడం ఇలా రకరకాలుగా యూనియన్లు పెట్టుకోకుండా Wlamart యాజమాన్యం ప్రయత్నిస్తుంటుంది.
  • ఇక లింగ వివక్ష, బాల కార్మికులు, undocumented workers తో తక్కువ జీతాలకు పని చేయించుకోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పుకోవచ్చు.
మనకి Walmart లో కొంత తక్కువ ధరలకి వస్తువులు దొరకవచ్చు, అయితే ఎవరిని దోచుకోవడం వల్ల మనకి ఈ వస్తువులు తక్కువ ధరలకి దొరుకుతున్నాయి? Walmart ఉద్యోగులనా? Tax-payers నా? వెనుకబడిన దేశాలలో పనిచేస్తున్న వర్కర్లనా? బాల కార్మికులనా? Illegal immigrants నా? అసలు నిజంగా మనకి Walmart లో వస్తువులు తక్కువ ధరలకి దొరుకుతున్నాయా? లేక కేవలం ఎదురుగా కనబడేదే నిజమనుకొని భ్రమ పడుతున్నామా?



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి