1, అక్టోబర్ 2012, సోమవారం

ఏం చేద్దాం? ఎలా పంపిద్దాం!



-సీఎం, హోంమంత్రి, డీజీపీల భేటీ
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (టీ మీడియా): తెలంగాణ రోడ్‌మ్యాప్ ప్రకటించే వరకు కవాతు కొనసాగుతుందని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం స్పష్టం చేయటం...అర్ధరాత్రి దాటినా ఉద్యమకారులు సంజీవయ్యపార్కు వద్దనే బైఠాయించటంతో వారిని అక్కడి నుంచి పంపించటానికి పోలీసు యంత్రాంగం వ్యూహాలు పన్నుతోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి హోంమంత్రి సబితా ఇంద్రాడ్డి, డీజీపీ దినేష్‌డ్డి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డిని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో కలిశారు. ఆదివారం ఉదయం నుంచి జరిగిన పరిణామాలను ముఖ్యమంవూతికి వారు వివరించారు. సోమవారం నుంచి జీవ వైవిధ్య సదస్సు ప్రారంభం కానుండగా ఊహించని విధంగా రోడ్‌మ్యాప్ వచ్చే వరకు తెలంగాణ మార్చ్‌ను కొనసాగిస్తామని నిర్వాహకులు ప్రకటించటంపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. చర్చలు జరపటం ద్వారా కవాతును విరమింప చేద్దామా? బలవంతంగా తెలంగాణవాదులను అక్కడి నుంచి పంపించి వేద్దామా? అన్న అంశంపై చర్చించినట్టు సమాచారం. బలవంతంగా పంపిస్తే ఏ రూట్‌లో పంపించాలి? ఏవైనా విధ్వంసాలు జరిగే అవకాశాలు ఉంటాయా? అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అన్న దానిపై కూడా చర్చ జరిగినట్టుగా తెలియవచ్చింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి