18, అక్టోబర్ 2012, గురువారం

హానికర వైరస్‌ను సృష్టించిన యుఎస్‌


  • శత్రు దేశాల కంప్యూటర్‌ వ్యవస్థల ధ్వంసానికి ప్రయోగం!
కంప్యూటరు వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయగల హానికర వైరస్‌ను అమెరికా సృష్టించింది. ప్రత్యర్థులుగానూ, శత్రువులుగానూ పరిగణించే దేశాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఈహానికర వైరసును ప్రయోగిస్తుంటుంది. అమెరికా ఇంటెలిజెన్స్‌ స్పెషల్‌ సర్వీసెస్‌ దీన్ని కనుగొన్నట్లు రష్యాకు చెందిన కంప్యూటరు భద్రతా సంస్థ కాస్పరస్కీ వెల్లడించింది. ఫ్లేమ్‌వార్మ్‌ నుంచి సమీకకరించిన కమాండ్ల జతను కలగలిపి వైరస్‌ రూపంలో ఉత్పత్తి చేసినట్లు కాస్పరస్కీ వెల్లడించింది. మేలో ఈ హానికర వైరస్‌ను తొలిసారిగా గుర్తించారు. ఇంతవరకు వినియోగంలోకి రాని అత్యాధునిక సైబర్‌ నిఘా ఆయుధంగానూ పలు మీడియా కథనాలు దీన్ని పేర్కొన్నాయి. దీనికి సంబంధించి వాషింగ్టన్‌ పోస్ట్‌లోనూ తాజాగా ఒక కథనం ప్రచురితమైంది. అమెరికా నేషనల్‌ సెక్యూరిటీ ఏజెన్సీ, సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ, ఇజ్రాయిల్‌ మిలిటరీలు సంయుక్తంగా ఈ హానికర వైరస్‌ను అభివృద్ధి చేసినట్లు ఆ కథనం సాగింది. ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌ను మినిఫ్లేమ్‌గా వ్యవహరిస్తున్నారు. స్క్రీన్‌షాట్లు తీసుకోగలగడంలోనూ, రహస్య సందేశాలను అప్పటికప్పుడు పంపే విధంగానూ బ్రౌజర్‌ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌, మొజిల్లా, మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌, లేదా అడోబ్‌ ఆక్రోబట్‌ లేదా ఎఫ్‌టిపి క్లయింట్ల రూపంలో ఈ వైరస్‌ విస్తరణ జరుగుతుందని కథనం. ఈ హానికర వైరస్‌ ఏదో ఒక ప్రాంతమో లేదా దేశాన్నో లక్ష్యంగా చేసుకోలేదని వాషింగ్టన్‌ పోస్ట్‌ వెల్లడించింది. కాగా పాలస్తీనా, ఇరాన్‌, లెబనాన్‌లలో ఆరు రకాల వైరస్‌ శ్రేణు(వెర్షన్‌)లను గుర్తించారు.
నియంత్రణ అదుపు తప్పిన నేపథ్యంలో యాంటీవైరస్‌ విక్రేత సిమాంటిక్‌తో కలిసి హానికర వైరస్‌ కట్టడికి కృషి చేస్తున్నట్లుగా కస్పరస్కీ తెలిపింది.
ఇంటర్నెట్లోకి చొచ్చుకు పోగలిగినట్లుగా గత వారం అమెరికా రక్షణ మంత్రి లియోన్‌ పనెట్టా అంగీకరించారు. జల, ఉపరితల, వాయు మార్గాల గుండా సమర్థనీయంగా ప్రత్యర్థి కంప్యూటరు వ్యవస్థలను ధ్వంసం చేయగల సత్తా ఈ వైరస్‌కు ఉందని తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి