6, జూన్ 2012, బుధవారం

లిక్కర్ కేస్.....ఖతం!




రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లిక్కర్ సిండికేట్ కేసు కొండెక్కింది.. ఈ కేసులను మూసేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్నయం తీసుకుంది. ఈ నిర్ణయం వెనుక ఓ పెద్ద కదే దాగుంది.. రోశయ్య తరువాత రాష్ట్రానికి కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.. ఈ పదవి కోసం
వెంపర్లాడుతూ కూర్చొన్న బొత్సా సత్యనారాయణకు ఒక్కసారిగా గుండె కలుక్కుమంది.. మనసులోనే బాధను దిగమింగుకున్న బొత్సా కిరణ్ కుమార్ రెడ్డికి ఎసరు పెట్టే కార్యక్రమాలు ముమ్మరం చేశారు.. క్షణం మనశ్శాంతి లేకుండా చేయగలిగాడు.. మరోవైపు కిరణ్‌ పనితీరు అస్సలు బాగాలేదంటూ డిల్లీకి ఫిర్యాదుల పరంపరను ముమ్మరం చేయసాగాడు.
.
ఈ మొత్తం వ్యవహారమంతా చూసిన కిరణ్ కుమార్ రెడ్డి టిట్ ఫర్ టాట్ మంత్రం జపించారు.. బొత్సాను అదఃపాతాళలోకానికి తొక్కేసే ఓ అద్భుతమైన ప్లాన్‌ను రూపొందించారు.. ఆ పధకంలో భాగంగా 2011 డిసెంబర్ 16న రాష్ట్రవ్యాప్తంగా మద్యం సిండికేట్ల మీద ఏసీబీ దాడులకు దిగింది.. నిజాయితీగల ఆఫీసర్‌గా పేరుపడ్డ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సిండికేట్ల గుట్టుమట్లు ఒక్కొటొక్కటిగా బయటపడసాగాయి.. ఖమ్మంకు చెందిన సిండికేట్‌ లీడర్ నున్న రమణ అరెస్టయ్యాడు... ఆయన విచారణ తర్వాత అబ్కారీ మంత్రి మోపిదేవికి పదిలక్షల రూపాయల ముడుపులిచ్చినట్లు రిమాండ్ రిపోర్టును ఏసీబీ కోర్టుకు సమర్పించింది.. అదే సమయంలో బొత్సా సత్యనారాయణ సొంత జిల్లాలో మద్యం సిండికేట్ల మీద దర్యాప్తు మొదలయింది.. బొత్సావారి భాగోతం బయటపడింది... బినామీ పేర్లతో బొత్స కుటుంబసభ్యులు జిల్లా అంతా మద్యం దుకాణాలు తెరచారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి..
కిరణ్‌ కుమార్ రెడ్డి కొట్టిన దెబ్బకు బొత్సా సత్యనారాయణ దిమ్మదిరిగింది.. అటు శ్రీనివాసరెడ్డి దర్యాప్తును ముమ్మరం చేశారు.. ఆయన దూకుడు చూసి బొత్స సత్యనారాయణకు చెమటలు పట్టాయి.. కిరణ్ తీరుపై బొత్స డిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేశారు.. ఇద్దరూ ఇద్దరే కాబట్టి ఒకరి మీద ఒకరు కత్తులు నూరుకోకుండా కలసి పనిచేస్తన్నట్లు కలరివ్వండి.. ఎదో ఒక మార్గం చూస్తామని డిల్లీ పెద్దలు హామీ ఇచ్చారు... ప్లాన్ ఆఫ్‌ యాక్షన్ ప్రారంభమయింది..అందులో భాగంగా  శ్రీనివాసరెడ్డి బదిలీకి రంగం సిద్దమయింది. ఉన్నట్టుండి శ్రీనివాసరెడ్డిని కేసు నుంచి తప్పిస్తే జనం నోట్లో ఊసే అవకాశముంది కాబట్టి ఆయనకి ప్రమోషనిచ్చారు.. ప్రాధాన్యం లేని
ఓ శాఖకు ఉన్నతాధికారిగా బదిలీ చేశారు.. అక్రమార్కులు ఊపిరి పీల్చుకున్నారు..
అంతా ఓకే అనుకున్న తరుణంలో కధ మరో మలుపు తిరిగింది. ఆ శాఖకు చెందిన మరో ఉన్నతాధికారి దర్యాప్తను వదిలే ప్రసక్తేలేదని అక్రమార్కులు ఎంతటి వారయినా వదిలేది లేదని తేల్చిచెప్పారు.. కధ మళ్లీ మొదటికొచ్చేసరికి సర్కారు పెద్దలు మరో ప్లానేశారు. ఆయన మీద ఒక అధికారిని నియమించారు.. బూబతి బాబును  డమ్మీ చేసేశారు.. ఈ పరిణామాల నేపధ్యంలో సీఎంకు తనకు ఎటువంటి విభేదాలు లేవని బొత్సావారు ప్రకటించారు...ఇలా కధను ఓ కొలిక్కి రప్పించిన డిల్లీ పెద్దలు గొడవలు సద్దుమణిగాయని తేలిగ్గా నిట్టూర్చారు..
విజయంనగరం జిల్లా వ్యాప్తంగా 200 మద్యం దుకాణాలుంటే వాటిలో 56 దుకాణాలు బొత్సా బినామీలేవేనని ఏసీబీ తయారు చేసిన రిపోర్టు ఇపుడు ఎందుకూ పనికిరానిదిగా మిగిలిపోయింది.. రూపాయి బియ్యంతో నెల గడుపుకునే పేదోళ్లే ఈ షాపుల యజమానులన్న నిజం నిస్తేజమయిపోయింది.. అతి తక్కువ మొత్తం ప్రభుత్వానికి కట్టి భారీ సంఖ్యలో దుకాణాలు దక్కించుకున్న అవినీతి బాగోతం
అటకెక్కింది.. బొత్స వారి డైరెక్షన్లో ప్రభుత్వానికి పడ్డ కోట్ల రూపాయల నష్టం విషయం ఏసీబీ వారి రికార్డులకే పరిమితమయింది..
విజయనగరం జిల్లాలో 200 మద్యం దుకాణాలుంటే అందులో 56 బొత్స బినామీవేలనంటూ ఏసీబీ రిపోర్ట్
మొత్తానికి సర్కారు ఖజానాకు కోట్ల రూపాయల నష్టం
ఒక శ్రీనివాసరెడ్డి, ఒక బూబతి బాబు, ఆ ఇద్దరి ఆద్వర్యంలో రేయింబవళ్లు పనిచేసి ఏసీబీ అధికారులు వెలికి తీసిన కఠిన వాస్తవాలు కోట్ల రూపాయల ప్రజాధనం లూటీలు రాజకీయ నాయకుల మాజిక్‌లో మాయమైపోయాయి... కేసును ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదు దర్యాప్తు కొనసాగుతుంది అని ఏసీబీ అత్యున్నత అధికారి ప్రకటించి కొద్ది రోజులు కాకమందే కేసు దర్యాప్తు కొడిగట్టింది.. ఒక్క బొత్స కుటుంబాన్ని కాపాడేందుకు ...  సిండికేట్ స్కాంలో కోట్ల రూపాయలు కూడగట్టుకున్న వ్యాపారులందరికి కేసు నుంచి రిలీఫ్ లభించింది.. లిక్కర్ సిండికేట్ కేసును రాష్ట్రప్రభుత్వం మూసేసింద.. తదుపరి విచారణకూడా వద్దంటూ ఆదేశాలు జారి చేసింది. బొత్సను బయటపడేసేందుకే ఈ నిర్ణయమంటూ ఈ మొత్తం విచారణలో కీలక పాత్ర పోషించిన ఓ అధికారి ఆవేదన వ్యక్తం చేయడం ఇక్కడ విశేషం. ఏదయితేనేం రాష్ట్రాన్ని కుదిపేసిన ఓ భారీ స్కాం సర్కారు వారి సౌజన్యంతో పూర్తిగా మూతబడిపోయింది.. కేస్ ఖతమయింది.. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి