22, జూన్ 2012, శుక్రవారం

కొత్త గెగాబైట్‌ బుక్‌ టాప్‌ వచ్చేసింది


నేటితరంలోఎక్కువమంది బుక్‌ టాప్‌లు వాడేందుకు చాలా ఇష్ట పడుతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని కంప్యూటర్‌ కంపెనీలు బుక్‌టాప్‌ లని మార్కెట్‌లోకి ప్రవేశ పెడుతున్నాయి. ఈ క్రమంలో గెగాబైట్‌ సంస్ధ కూడా అటు డస్క్‌టాప్‌, ఇటు ల్యాప్‌టాప్‌లతో పాటు టాబ్లెట్‌ పిసిల ఫీచర్లనీ కలగలిపి ప్రత్యేకంగా బుక్‌టాప్‌ని టి 1132 ఎన్‌ పేరు తో విడుద ల చేసింది. అత్యా ధునిక సాంకేతిక పరి జ్ఞానంతో రూపొందిన ఈ బుక్‌ టాప్‌ అందర్నీ తప్పక ఆకర్షి స్తుందని కంపెనీ ప్రతినిధులు చెప్తుంగా... ఇది కేవలం 1.76 కేజీల బరువుతో 11.6 అంగు ళాల స్క్రీన్‌తో మల్టీటచ్‌ సామ ర్ధ్యంతో చూడముచ్చటగా ఉంది. ఇందులో ఇంటెల్‌ ఐ5-2467 ఎం ప్రోసెసింగ్‌తో పాటు 8 జీబి గరిష్ట పరిమితి ఉన్న మెమెరీకి తోడుగా 520 ఎం గ్రాఫిక్‌ కార్డు, ఇంటెల్‌ ఎక్స్‌ప్రెస్‌ గ్రాఫిక్‌ కార్డు, సులభంగా టైపింగ్‌ చేసేందుకు వీలైన కీబోర్డు, ట్రాక్‌ ప్యాడ్‌లతో దీనిని డిజైన్‌ చేసారు. ఇందులో 2 జిబి, 4 జిబి ర్యామ్‌లను నిక్షి ప్తం చేసుకుని సిస్టమ్‌ స్పీడ్‌ని పెంచుకునేందుకు అవకాశా లున్నాయి. ప్రాసెసర్‌ క్లాక్‌ స్పీడ్‌ 1.66 నుండి 2.3 జిహెచ్‌జెడ్‌ వరకు ఉంది. న్విడియా జి ఫోర్స్‌ జిటి 520 ఎం గ్రాఫిక్‌ కార్డు ఉండటం వల్ల స్క్రీన్‌ లోని బొమ్మ మంచి క్వాలిటీతో కనిపిస్తుంది. దీనిగి రెండు ఇంటి గ్రేటెడ్‌ వెబ్‌ స్పీకరు, 1.3 మెగా పిక్సిల్‌ కెమేరా తదితర అంశా లతో పాటు హెచీఎమ్‌ఐ అవుటు పోర్ట్‌, 3.0 పోర్టు, కార్డు రీడర్‌ కలిగిన ఈబుక్‌టాప్‌ నాణ్యమైన లిథీనియం బ్యాటరీతో మంచి బ్యాకప్‌ ఇస్తుంది. ధర వివరాలు తెలియాల్సి ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి