- ఇకపై రోమింగ్ వుండదు
- కొత్త టెలికం విధానానికి కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగల్
న్యూఢిల్లీ : మొబైల్ ఫోన్
వినియోగదారులకు శుభవార్త. రోమింగ్ చార్జీలు ఇక వర్తించవు. దేశం లోని ఏ
రాష్ట్రానికైనా, ఏ ప్రాంతానికైనా రోమింగ్ లేకుండా ఫోన్ సేవలు
వినియోగించుకోవచ్చు. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ టెలికాం
విధానం-2012ను గురువారం ఆమోదిం చింది. రోమింగ్ చార్జీలు రద్దు చేయడమే
లక్ష్యంగా కేంద్రం ఈ విధానం రూపొందించింది. అదనపు చార్జీలు చెల్లించకుండానే
దేశవ్యాప్తంగా ఒకే నెంబ రును ఉపయోగించుకునేందుకు మొబైల్ ఫోన్ విని
యోగదారులకు అనుమతి లభించినట్లు అయింది. 'యావత్ ప్రపంచం ఓ కుగ్రామంగా మారిన
పరిస్థితుల్లో ఒకరాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి ఫోన్ చేసుకోవాలంటే
అదనపు చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి లేకుండా చేయడానికి వీలుగా కొత్త
టెలి కాం విధానం తీసుకొచ్చినట్లు టెలికాం మంత్రి కపిల్ సిబల్ చెప్పారు.
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర కేబినెట్
సమావేశం అనంతరం సిబల్ విలేకరులతో మాట్లా డారు. జాతీయ టెలికాం విధానానికి
కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. ఈ విధానం అత్యంత
పారదర్శకంగా వుంటుందని పేర్కొన్నారు. జూన్ 1వ తేదీ నుండి ఈ విధానం
అమలులోకి వస్తుందని మంత్రి వివరించారు. పూర్తి స్థాయి మొబైల్ నెంబరు
పోర్టబిలిటీ అమలు ప్రక్రి యను టెలికాం డిపార్టుమెంట్ ప్రారంభిస్తుందని
మంత్రి తెలిపారు. ఇదిలావుండగా రోమింగ్ చార్జీలు రద్దుచేయడానికి ముందు
వినియోగదా రులు కొంతకాలం వేచివుండాల్సి వస్తుంది. ఒక దేశం-ఒకే నెంబరు
లక్ష్యంతోనే ఈ విధానం తీసుకొచ్చినట్లు మంత్రి చెప్పారు. ఒక దేశం, ఒకే
నెంబరు అమలుకు ముందుగా ఈ కొత్త పథకానికి సంబంధించిన విధివిధానాలు
రూపొందించాల్సి వుంటుంది. ఆ తర్వాతే ఈ విధానం అమలులోకి వస్తుంది.
ఎన్‌టిపి(జాతీయ టెలికాం విధానం- 2012) ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో టెలికాం
సేవలు 2017 నాటికి 39 నుండి 70శాతానికి, 2020 నాటికి 100శాతానికి చేరతాయని
భావిస్తున్నారు. ఈ కొత్త విధానం వల్ల ఎన్నో ప్రయోజనాలు వున్నాయని మంత్రి
సిబల్ వెల్లడించారు. బ్రాండ్‌బాండ్ వేగం సెకనుకు కనీసం 2 మెగాబైట్‌లకు
పెరుగుతుంది. ఈ మార్పు తక్ష ణమే అమలులోకి వస్తుంది. కొత్త విధానం ఆమో దంతో
టెలికాం లైసెన్సులను స్పెక్ట్రమ్ నుండి డీలింక్ చేసుకుంటారు. గాలి
తరంగాలు ఉపయో గించుకోవడం ద్వారా ఏ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగానైనా
ఆపరేటర్లు సేవలు అందించడానికి ఎన్‌టిపి-2012 అనుమతిస్తుంది. ప్రత్యేకించి
ఫలానా ఫ్రీక్వెన్సీ బాండ్ ఉపయోగించుకోవాలన్న నిబంధనేమీ లేదు. వీటిపై
ఎలాంటి ఆంక్షలు లేవు. ప్రస్తుతం కంపెనీలకు లభించిన అనుమతుల ప్రకారం
జిఎస్‌ఎం లేదా సిడిఎంఎ సర్వీసులను మాత్రమే ఉపయోగించుకోవాల్సి వుంది.
1999
నాటి టెలికాం విధానం స్థానంలో ఈ కొత్త విధానం తీసుకొచ్చామని మంత్రి సిబల్
వెల్లడించారు. స్వదేశీ టెలికాం పరికరాల తయారీ పరిశ్రమలను ప్రోత్సహించాలని
కేంద్రం భావిస్తు న్నదని చెప్పారు. టెలికాం పరికరాల తయారీలో భారత్‌ను
ప్రపంచంలోనే అగ్రస్థాయిలోకి తీసుకె ళ్ళాలని భావిస్తున్నామని మంత్రి
చెప్పారు. ఇప్పటి వరకు పరిశ్రమను మనం ఇక్కడ ఏర్పాటు చేసుకో లేకపోయాం.
ఇలాగైతే భారత్ ప్రపంచస్థాయికి ఎదగలేదు. అదే సమయంలో టెలికాం పరికరాల ధరలు
తగ్గడం కూడా చాలా కీలకమని సిబల్ వ్యాఖ్యానించారు. రెవెన్యూ ఉత్పాదన
లక్ష్యం, స్పెక్ట్రమ్ చట్టం, ట్రారు చట్టాలకు సంబంధించిన ఐదు మార్పులతో
ఎన్‌టిపి 2012ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. స్పెక్ట్రమ్ చట్టాన్ని
ప్రభుత్వం తొల గించింది. విధాన నిర్ణయంలో భాగంగా స్పెక్ట్రమ్ చట్టాన్ని
పూర్తిగా రద్దు చేసినట్లు మంత్రి చెప్పారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి