14, జూన్ 2012, గురువారం

చుక్కానిలేని నావ.. ఆర్థిక వ్యవస్థ



న్యూఢిల్లీ, జూన్ 13: భారత ఆర్థికరంగం
పరిస్థితి చుక్కాని లేని నావలా మారిందని,
దేశంలో సరైన నాయకత్వం లేకుండా
పనిచేస్తున్నందుకు చింతిస్తున్నామని
అగ్రశ్రేణి పారిశ్రామిక అధిపతులు
ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సరైన విధాన నిర్ణయాలులేక, అంచనాలకు
అందని వాణిజ్య వాతావరణంలో భారత్
ప్రతిష్ఠ మసకబారుతున్నదని వీరు
ఆక్షేపించారు. గడచిన మూడునాలుగు
నెలలుగా భారత్ ప్రతిష్ఠ దెబ్బతిందని ..ఈ
పరిస్థితి ఏర్పడినందుకు భారత పౌరునిగా
ఎంతో చింతిస్తున్నానని ఇన్ఫోసిస్
టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు
ఎన్.ఆర్.నారాయణ మూర్తి అన్నారు.
మరో ఐటి దిగ్గజం విప్రో చైర్మన్ అజీం
ప్రేమ్‌జీ మాట్లాడుతూ నాయకత్వం లేని
దేశంలో పనిచేస్తున్నట్లుగా వుంది. ఈ స్థితి
మారకపోతే మనం ఎన్నో సంవత్సరాలు
వెనుకబడి పోవడం ఖాయమని
పేర్కొన్నారు. జిడిపి వృద్ధి మందగించడం,
ఆర్థిక విధానాలకు రాజకీయ అవరోధాల
వల్ల ఇండియా ఇనె్వస్ట్‌మెంట్ గ్రేడ్
కోల్పోయే ప్రమాదం ఉందని ప్రముఖ రేటింగ్
సంస్థ స్టాండర్డ్ అండ్ పూర్స్ హెచ్చరించిన
నేపధ్యంలో ఇద్దరు దిగ్గజ పారిశ్రామికవేత్తలు
పైవిధంగా స్పందించారు. తాను గా
తెచ్చుకున్న సమస్యల మధ్య భారత్
సతమతమవుతోందని, దురదృష్టవశాత్తు
ఈ సవాళ్లు మనం సృ ష్టించుకున్నవేనని
నారాయణ మూర్తి మోర్గాన్‌స్టాన్లీ సంస్థకు
ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఒక
సానుకూలత ఏమిటంటే ఈ తప్పులను
మనం సరిదిద్దుకోవచ్చు. ఇప్పటికే
ఆర్థికవ్యవస్థకు చాలా నష్టం జరిగింది.
మరింత నష్టం కలుగకుండా
చూసుకోవాల్సివుందని వ్యాఖ్యానించారు.
ప్రేమ్‌జీ మాట్లాడుతూ ప్రపం చ సూక్ష్మ ఆర్థిక
పరిస్థితి ఇంకా ఒడిదుడుకుల్లో వుందని,
యూరోజోన్‌లో గ్రీస్ సమస్య ఇంకా
కొలిక్కిరాలేదని అన్నారు. మరోపక్క
మనదేశం విధా న సమస్యల వలయంలో
చిక్కుకుని వుందని తెలిపారు. రానున్న
రెండేళ్లకాలంలో 7-8 ప్రధాన సంస్కరణలు
అమలుచేసినట్లయితే భారత్ పరిస్థితి మళ్లీ
మారగలదని అన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి