నెట్ సెంటర్, ఆఫీస్, మరెక్కడైనా ఏదైనా ముఖ్యమైన డేటాని సేవ్ చేయాల్సివస్తే? ఆ సమయంలో మీ దగ్గర పెన్‌డ్రైవ్‌గానీ మరేదైనా బ్యాక్‌అప్ డ్రైవ్ లేకపోతే? వెంటనే ఎడ్రైవ్ (Adrive) లోకి లాగిన్ అయిపోండి. మెయిల్ ఐడీతో సభ్యత్వ నమోదు చేసుకుని 50జీబీ మెమరీని ఉచితంగా పొందొచ్చు. ఆన్‌లైన్ స్టోరేజీ, బ్యాక్‌అప్ సర్వీసుగా దీన్ని పిలుస్తున్నారు. సినిమాలు, డాక్యుమెంట్‌లు, ఫొటోలు, మ్యూజిక్... ఇలా డేటా ఏదైనా అప్‌లోడ్ చేసుకుని బ్యాక్‌అప్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లోనే ఎడిట్ చేసుకోవచ్చు. ఫైళ్లను అప్‌లోడ్ చేయడానికి జావా స్క్రిప్ట్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సిస్టంలో మాదిరిగా ఫోల్డర్లను క్రియేట్ చేసుకోవచ్చు. డేటాని ఇతరులతో పంచుకోవచ్చు కూడా. www.adrive.com
గూగుల్
అదే విధంగా గూగుల్ కూడా ఉచిత స్టోరేజీ కల్పించడానికి సిద్ధంగా ముందుకు వస్తోంది. దీనికి సంబంధించిన సమాచారం https://drive.google. com/start సైటు నుండి పొందవచ్చు. అన్ని రకాల కంప్యూటర్లలో, ఐ-ఫన్, ఐ-పాడ్, ఆండ్రాయిడ్‌లలో ఉచిత స్టోరేజీ సదుపాయం పొందవచ్చు. ఇందుకోసం ముందుగా కంప్యూటర్‌లో గూగుల్ డ్రైవ్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేయాలి. ఆ తర్వాత కంప్యూటర్‌లో ఉన్న ఫైళ్లను డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిలో ఆన్‌లైన్ స్టోరేజీలో సేవ్ చేయాలి. ఇలా స్కై డ్రైవ్‌లో కానీ, గూగుల్ డ్రైవ్‌లో కానీ సేవ్ చేసిన ఫైళ్లను ఎక్కడి నుంచైనా పొందవచ్చు. గూగుల్ డ్రైవ్‌లో స్టోరేజీ చేసిన ఫైళ్లను ఐ-పాడ్, ఐ-ఫన్‌లలోనే కాకుండా ఆండ్రాయిడ్ డివైజ్‌నుంచి తిరిగి పొందవచ్చు. ఇందుకోసం ఆయా సాఫ్ట్‌వేర్లను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కార్యాలయ పనులను ఇంటిదగ్గర చక్కబెట్టుకుని, వాటిని కార్యాలయంలో ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చు. ఉచిత స్టోరేజీలో ఆడియో, వీడియో, డేటా తదితరాలను స్టోర్ చేసుకోచ్చు. ముఖ్యంగా గూగుల్‌లో 5జిబి కంటే ఎక్కువ సామర్థ్యం గల డేటాను ఫోల్డరుగా స్టోర్ చేసుకోవాలంటే అదనంగా చెల్లించి పొందాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన వివరాలు సపోర్టు గూగుల్ డాట్ కామ్‌లో తగు సమాచారం లభిస్తోంది. గూగుల్‌లో ఒక ఐడి ద్వారా సేవ్ చేసిన సమాచారాన్ని మరో ఐడి ద్వారా పొందడం ఎంతమాత్రం సాధ్యం కాదు.
మైక్రోసాఫ్ట్ స్కైడ్రైవ్
ప్రస్తుతం వారు అందిస్తోన్న 7జిబి ఉచిత స్టోరేజీ సదుపాయం నుంచి 25జిబి స్టోరేజీకి వారు అప్‌గ్రేడ్ అవడానికి అవకాశం కల్పించింది. https://skydrive.live.comలో దీనికి సంబంధించిన సమాచారం లభిస్తోంది. సిస్టంలోని హార్డ్‌డ్రైవ్ మాదిరిగా మైక్రోసాఫ్ట్ ఉచితంగా 25 జీబీతో స్కైడ్రైవ్‌ను అందిస్తోంది. ఉచిత స్టోరేజీ సదుపాయం మైక్రోసాఫ్ట్ ఇదివరకే విండోస్ లైవ్ ఐడి ఉన్నవారికి కల్పిస్తోంది. విండోస్ skydrive.live.comలో అలా కాదు. హాట్‌మెయిల్ ఐడితో దీనిని రూపొందించుకోచ్చు. ఇప్పటికే స్టోరేజీ సదుపాయం ఉన్నవారు అప్‌గ్రేడ్ చేసుకోచ్చు. ఇందులో డాక్యుమెంట్ పబ్లిక్, ఫొటోల పేరుతో ఫోల్డర్లను ఏర్పాటు చేసుకుని వాటిని ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్లలో వర్డ్, ఎక్స్‌ఎల్, పవర్ పాయింట్ లాంటి వాటిని ఎక్కడి నుండైనా యాక్సెస్ చేయవచ్చు. కంప్యూటర్ లేకపోయినా నెట్ సెంటర్‌లో బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని స్కైడ్రైవ్‌లోకి అప్‌లోడ్ చేసుకోవచ్చు. మెయిల్ ఐడీతో సభ్యత్వ నమోదు చేసుకోవాలి. సైన్‌ఇన్ అయ్యాక మై కంప్యూటర్‌లో మాదిరిగానే క్రియేట్ ఫోల్డర్స్ లింక్‌ను ఎంచుకుని ఫోల్డర్లను క్రియేట్ చేసుకోవచ్చు. యాడ్ ఫైల్స్‌పై క్లిక్ చేసి ఐదు ఫైల్స్‌ని ఒకేసారి అప్‌లోడ్ చేయవచ్చు. మీరు ఫొటోలను అప్‌లోడ్ చేస్తే మెనూబార్‌లోని స్లైడ్‌షో ఎంచుకుని చూడొచ్చు. ఫైళ్లని ఐకాన్స్, డిటెయిల్స్, థంబ్‌నెయిల్స్ వ్యూలో చూడొచ్చు. మోర్‌లోని వ్యూ పర్మిషన్లపై క్లిక్ చేసి ఫైళ్లని ప్రైవేటు, పబ్లిక్ చేయవచ్చు. డేటాని స్నేహితులతో పంచుకోవాలనుకుంటే షేర్‌ని ఎంచుకోవాలి.
ఓపెన్‌డ్రైవ్
వ్యాపార నిమిత్తం ముఖ్యమైన డాక్యుమెంట్లని బ్యాక్‌అప్ చేసుకుని మేనేజ్ చేసుకోవాలనుకుంటే humyo సర్వీసులో సభ్యత్వం నమోదు చేసుకుంటే సరి! 10 జీబీ ఉచితం. Backup, Access, Share, sync సర్వీసుల్ని దీంట్లో పొందొచ్చు. ఫేస్‌బుక్, హాట్‌మెయిల్, జీమెయిల్ యూజర్లకు సులువుగా ఆహ్వానాన్ని పంపొచ్చు. 2,500 డాక్యుమెంట్స్, పాటలు, ఫొటోలను బ్యాక్‌అప్ చేసుకోవాలంటే ఓపెన్ డ్రైవ్‌లో సైన్‌ఇన్ అవ్వండి. దీంట్లోని బేసిక్ ప్లాన్‌లో 5జీబీ ఉచితంగా అందిస్తున్నారు.www.humyo.com, www.opendrive.com
మైఆదర్ డ్రైవ్
నచ్చిన ఫొటోలు, డాక్యుమెంట్స్, ప్రజెంటేషన్స్... లాంటి ముఖ్యమైన డేటాని బ్యాక్‌అప్ చేసుకోవాలనుకుంటే MyOtherDrive ఆన్‌లైన్ సర్వీసులో సైన్‌ఇన్ అవ్వాలి. 2జీబీ ఉచితం. ఒకే ఎకౌంట్‌తో మల్టిపుల్ కంప్యూటర్లలో బ్యాక్‌అప్ చేయవచ్చు. డేటాని ఇతరులతో పంచుకోవచ్చు. డ్రాప్‌బాక్స్ సర్వీసులో కూడా 2జీబీ ఉచితం. www.myotherdrive.com
ఐడ్రైవ్
వేగంగా, సురక్షితంగా డేటాని ఆన్‌లైన్‌లోనే బ్యాక్‌అప్ చేసుకునే సౌలభ్యాన్ని అందిస్తోంది Idrive. సైట్‌లోని సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని, సైన్‌ఇన్ అయ్యి రెండే క్లిక్కుల్లో ఫొటోలు, డాక్యుమెంట్లలాంటి ముఖ్యమైన డేటాని బ్యాక్‌అప్ చేయవచ్చు. 2 జీబీ స్పేస్‌ని ఉచితంగా పొందొచ్చు. ఆటోమాటిక్ బ్యాక్‌అప్ సదుపాయాన్ని సెట్ చేసుకోవచ్చు. మీ డేటాని మేం సురక్షితం చేస్తామంటున్నారు Mozyhome నిర్వాహకులు. దీంట్లో కూడా 2 జీబీ స్పేస్ ఉచితం. మిలటరీ గ్రేడ్ ఎన్‌క్రిప్షన్‌తో డేటాని సెక్యూర్ చేస్తున్నారు. అప్‌గ్రేడ్ సర్వీసులతో అపరిమిత స్టోరేజ్ స్పేస్‌ని పొందొచ్చు. www.idrive.com, http://mozy.com/home
డ్రాప్‌బాక్స్
డ్రాప్‌బాక్స్ క్విక్ లింక్‌తో ఇక ఫైల్ లేదా ఫోల్డర్ షేర్ చెయ్యటం చాలా సులువు... ఉచిత ఆన్‌లైన్ స్టోరేజీని అందిస్తున్న https://www.dropbox.com/ ఇప్పుడు కావలసిన ఫైల్ లేదా ఫోల్డర్ మనకు కావలసిన వారితో షేర్ చేసుకోవటానికి Get Link అనే ఆప్షన్ జత చెయ్యబడింది. డ్రాప్‌బాక్స్‌లో లాగిన్ అయ్యి షేర్ చెయ్యవలసిన ఫైల్ లేదా ఫోల్డర్ వరుసలో చివరన ఉన్న లింక్ గుర్తు పై క్లిక్ చెయ్యాలి. బ్రౌజర్‌లో లింక్ ఓపెన్ అవుతుంది, అడ్రస్ బార్‌లో ఉన్న లింక్‌ని కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో షేర్ చేసుకోవచ్చు. అవతలి వారు సైన్-ఇన్ చెయ్యకుండానే మన ఫైల్ లేదా ఫోల్డర్‌ని బ్రౌజర్‌లో చూడగలరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి