ఇదిలా ఉంటే గత ఏడాది ద్రవ్యలోటు 5.2 శాతంగా రికార్డయింది. దాన్ని 5.1 శాతానికి తగ్గించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. వారం రోజుల క్రితం దేశంలో రుతుపవనాలు ప్రవేశించినా సగటు వర్షపాతానికంటే 36 శాతం తక్కువగా వర్షాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
22, జూన్ 2012, శుక్రవారం
పతనంలో రూపాయి మరో రికార్డు
ముంబై:అమెరికన్ డాలర్‌పై రూపాయి మారకం విలువ పతనం మరో రికార్డు నెలకొల్పింది. గురువారం అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ అమెరికా డాలర్‌పై 56.53 పాయింట్లకు పడి పోయింది. ఇంతకు ముందు గత నెల 31వ తేదీన డాలర్‌పై రూపాయి మారకం విలువ అధికంగా 56.52కు పడి పోయింది. స్వల్ప కాలిక బాండ్లు విక్రయించి, దీర్ఘ కాలిక బాండ్లను కొనుగోలు చేయాలని ఫెడరల్ రిజర్వు ఆదేశించడంతోపాటు చైనా, జర్మనీ విడుదల చేసిన ఆర్థిక గణాంకాలు బలహీన పడడం దీనికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశీయ కరంట్ ఖాతాలో లోటు కూడా రూపాయి మారకం విలువ పతనానికి మరో కారణమని తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్ నాటికి ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండడం వల్లే కరంట్ ఖాతాలో నాలుగు శాతం లోటు ఏర్పడింది. గతనెలలో పలు దఫాలు అమెరికాపై రూపాయి మారకం విలువ పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్‌బిఐ స్వల్ప కాలిక చర్యలు తీసుకుంది.
ఇదిలా ఉంటే గత ఏడాది ద్రవ్యలోటు 5.2 శాతంగా రికార్డయింది. దాన్ని 5.1 శాతానికి తగ్గించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. వారం రోజుల క్రితం దేశంలో రుతుపవనాలు ప్రవేశించినా సగటు వర్షపాతానికంటే 36 శాతం తక్కువగా వర్షాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి