24, జనవరి 2012, మంగళవారం

సునీల్‌రెడ్డి ఎవరు..? జగన్ తో సంబంధం ఏమిటి?



సునీల్ రెడ్డిది కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం అనిమెల గ్రామం.. నర్రెడ్డి సంగిరెడ్డి రెండో కుమారుడు ఈ సునీల్‌రెడ్డి. 30 సంవత్సరాల క్రితం సంగిరెడ్డి తన కుటుంబంతో సహా పులివెందులకు వచ్చి స్థిరపడ్డాడు. వైఎస్‌ బావ సీవీ సుబ్బారెడ్డికి ... సంగిరెడ్డి బంధువు కావడంతో వైఎస్‌ కుటుంబంతోనూ పరిచయం ఏర్పడింది. అప్పట్లో జియాలజిస్ట్‌గా పనిచేసిన సంగిరెడ్డి... వైఎస్‌ కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల ప్రాంతంలో మైన్స్‌ వ్యాపారాలు చేశాడు.. నష్టాలు రావడంతో సంగిరెడ్డి ఆర్ధికంగా కుంగిపోయాడు. దీంతో సంగిరెడ్డి ఆస్తులను కూడా వైఎస్‌ కుటుంబీకులు తీసుకున్నారని సమాచారం.   ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంగిరెడ్డి కుటుంబాన్ని YSR చేరదీశారు. సంగిరెడ్డి కుమారుడు సునీల్‌రెడ్డికి జగన్‌ కంపెనీలో ఓ చిరుద్యోగం ఇచ్చారు.. సునీల్‌లో ఉన్న చురుకుదనం, ఉత్సాహం గమనించిన జగన్‌.. సునీల్‌రెడ్డిని తన ఆంతరంగికుడిగా, వ్యక్తిగత సహాయకుడిగా నియమించుకున్నారు. అధికారికంగా పీఏ కాకపోయినా, అన్ని వ్యవహారాలను సునీల్ రెడ్డే నిర్వహించేవాడు. అతి తక్కువ కాలంలోనే జగన్‌ ఆర్థిక, వ్యక్తిగత కార్యకలాపాల్లో సునీల్‌ ప్రముఖ పాత్ర పోషించే స్థాయికి ఎదిగాడు. సునీల్ రెడ్డికి కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డితోనూ బంధుత్వం ఉంది. ఆయన సోదరుడి కుమార్తె కృష్ణతేజతో సునీల్ రెడ్డికి వివాహమ్యయింది. ఇప్పుడు సునీల్ రెడ్డిని సీబీఐ ప్రశ్నిస్తుండడంతో జగన్ కేసుపై మరింత ఉత్కంఠ పెరిగింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి