న్యూయార్క్ : ఆన్‌లైన్
ఎన్‌సైక్టోప ీడియా అయిన వికీపీడియా బుధ వారం తన కార్యకలాపాలను నిలిపి
వేసింది. రోజుకు కొన్ని లక్షలాది మంది నెటిజన్లు వికీపీడియా వెబ్ సైట్‌ను
సందర్శిస్తుంటారు. అయితే ఉన్నట్టుండి బంద్ పాటించడంతో నెటిజన్లు తీవ్ర
ఆందోళనకు గురయ్యారు. అమెరికన్ కాంగ్రెస్ పరిశీలనలో వున్న పైరసీ నిరోధక
బిల్లులకు నిరసనగా వికీపీడియా బుధవారం నాడు 24 గంటల బంద్‌ను పాటించింది.
ప్రతిపాదిత ఆన్‌లైన్ పైరసీ నిరోధక చట్టం (సోపా), ప్రొటెక్ ఐపి యాక్ట్
(పిపా) బిల్లుల పట్ల వికీపీడియా ఆందోళన వ్యక్తంచేసింది. ఈ బిల్లును
విధ్వంసకరమైనవిగా వికీపీడియా అభివర్ణించింది. ఈ బిల్లులు ఆమోదం పొందితే భావ
వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని సంస్థ కమ్యూనికేషన్ల విభాగం
అధిపతి జిమ్మీ వేల్ష్ తెలిపారు. ఇంటర్నెట్‌పై సెన్సార్‌షిప్ కోసం
అంతర్జాతీయంగా ఇవే తరహా చట్టాలకు ఈ బిల్లులు దారితీస్తాయని ఆయన ఆందోళన
వ్యక్తంచేశారు. మెజారిటీ వికీపీడియన్లు చేసిన సూచన మేరకు 24 గంటల బంద్‌కు
పిలుపునిచ్చినట్లు తెలిపారు. పైరసీ బిల్లులు చాలా అసాధారణ చర్యగా
అభివర్ణించారు. వికీపీడియాతోపాటు ఇంకా పలు వెబ్‌సైట్లు కూడా తమ నిరసనను
తెలిపాయి. ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ తన లోగోను చాలాసేపు
నిలిపివేసింది. విద్యార్థులారా...మీరు మీ హౌంవర్క్‌ను త్వరగా ముగించుకోండని
వికీపీడియా ప్రతినిధి వేల్ష్ కోరారు. గూగుల్ పేజిలోని బ్లాక్‌టేపుపై
క్లిక్‌చేయగానే, ఎండ్ పైరసీ...నాట్ లిబర్టీ అంటూ ప్రత్యక్షమైంది.
ఇంటర్నెట్ ప్రపంచంలో ఇటువంటి అసాధారణ పరిస్థితి నెలకొనడం ఇదే ప్రథమం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి