బ్రిటన్
లో అనిల్ బిద్వే హత్యకు గురైన కొన్ని రోజులకే మరో భారతీయ విద్యార్ధి
హత్యకు గురయ్యాడు. ఈసారి వంతు కెనడా తీసుకుంది. ఇరవే యేడేళ్ళ ‘అలోక్
గుప్తా’ కెనడాలో తుపాకితో కాల్చి చంపబడ్డాడు. పశ్చిమ కెనడాలో సర్రే నగరంలో ఈ
దుర్ఘటన చోటు చేసుకుంది. క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఈ ఘటన చోటు
చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఒక స్టోర్
యజమానులు అందరూ కలిసి క్రిస్టమస్ వేడుకలు జరుపుకోవడానికి వీలుగా అలోక్
గుప్తా మధ్యాహ్నం షిఫ్టు పని చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడని
పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి తుపాకితో అతనిని కాల్చి చంపాడని
వారు తెలిపారు. దొంగతనం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ హత్య జరిగిందీ లేనిదీ
ఇంకా స్పష్టం కాలేదని ‘ది హిందూ’ తెలిపింది.
హత్య
విషయంలో పోలీసులు ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. గ్యాంగు సంబంధిత హత్య కాదని
తాము నమ్ముతున్నామని పోలీసులు తెలిపారు. “క్రిస్టమస్ డే రోజున తన
యజమానులకు సహాయంగా బాధితుడు పనిలో ఉన్నాడు” అని ‘ఇంటెగ్రేటెడ్ హోమిసైడ్
ఇన్వెస్టిగేటింగ్ టీమ్’ కి చెందిన సార్జంట్ జెన్నిఫర్ పౌండ్ తెలిపింది.
అలోక్
గుప్తా సమీపంలో ఉన్న నివాసానికి వెళ్ళి సాయం కోరాడనీ అనంతరం ఆసుపత్రికి
తీసుకెళ్లారనీ తెలుస్తోంది. ఆసుపత్రికి వెళ్ళిన కొద్దిసేపటికే అలోక్
మరణించినట్లుగా డాక్టర్లు ప్రకటించారని జెన్నిఫర్ తెలిపింది. “తుపాకి
గుండువల్ల మరణించాడని తెలుస్తున్నప్పటికీ మరణ కారణం అటాప్సీ పరీక్షల్లో
ధృవపడుతుందని ఆమె తెలిపింది.
అలోక్
కుటుంబ సభ్యులు షాక్ లో ఉన్నారని అలోక్ బావ నితిన్ భూటాని తెలిపాడు.
ఎం.బి.ఎ చదువుతున్న అలోక్ కి గ్రేడింగ్ లు బాగా వస్తున్నాయనీ, అతి త్వరలో
టాప్ పొజిషన్ కి చేరుకుంటాడని భావిస్తున్నమనీ, ఇంతలో ఈ దుర్ఘటన జరగడం
షాకింగ్ గా ఉందనీ అతను తెలిపాడు. గుప్తాను చంపిన వ్యక్తిని అరెస్టు చేసి
తగిన శిక్ష విధించాలని అతని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి