31, జనవరి 2012, మంగళవారం

ఈ పుస్తకం విలువెంతో తెలుసా..?


బుక్స్ ఆఫ్ లెజెండ్స్
‘ఖరీదు’ పుస్తకాలు

ఈ పుస్తకం విలువెంతో తెలుసా..?
అక్షరాలా రూ.1.25 కోట్లు.
మన దేశంలో ఇంత ఖరీదైన పుస్తకం మరొకటి లేదు.
ఇంతకూ ఈ పుస్తకంలో ఏముంది..?
అది చెప్పే ముందు ఆ పుస్తక ప్రచురణ సంస్థ గురించి..

ఒక మహోన్నతుడి గెలుపు కావచ్చు. ఒక ప్రతిష్టాత్మక సంస్థ సుధీర్ఘ ప్రయాణం కావచ్చు. ఇలా ఏ విషయాన్నయినా అక్షర నైవేద్యంతో పాఠకుడికి నివేదించాలి. ఆ స్థాయిలో పుస్తకంగా తీసుకురావాలి. ఆ పనే చేస్తోంది ‘ఓపస్ మీడియా గ్రూప్’. ఈ మధ్యనే ప్రముఖ ఇటాలియన్ ఆటోమొబైల్ సంస్థ ఫెరారీ బయోగ్రఫీని ‘ద ఫెరారీ అఫీషియల్ ఓపస్’ పేరుతో ప్రచురించింది ఈ సంస్థ. ఈ పుస్తకం విలువ రూ.1.25 కోట్లు. మన దేశంలో ఇప్పటివరకు ఇదే అత్యంత ఖరీదైన పుస్తకం. 4,100 కాపీలను ముద్రించిన ఓపస్ సంస్థ మన దేశానికి మాత్రం ఒకే ఒక్క కాపీని ఇవ్వనుంది. 37 కిలోల బరువున్న ఈ పుస్తకంలో 852 పేజీలున్నాయి. ఎక్కడా అచ్చుకాని అరుదైన ఛాయచిత్రాలతో మొత్తం కలిపి వెయ్యి ఫోటోలను ఇందులో ముద్రించారు. ఫెరారీ సంస్థ లోగో- ‘ఎగిరే గుర్రం’ మీద, మరికొన్ని చిత్రాల మీద.. 30 క్యారెట్ల నాణ్యత కలిగిన 1500 డైమండ్లను పొదగడం వల్ల పుస్తకం జిగేల్ మంటోంది. ఈ పుస్తకాన్ని తీసుకొచ్చేందుకు- దుబాయికి చెందిన జ్యువెలరీ స్పెషలిస్టు అసిరోమ ప్రత్యేక డిజైనర్‌గా, ఫెరారీ అధికారిక పత్రికా సంపాదకుడు ఆంటోని గిని క్రియేటివ్ హెడ్‌గా వ్యవహరించారు. ఇందులో ప్రపంచ ఎఫ్-1 విజేతల స్వదస్తూరిలతోపాటు, పేరొందిన ఎఫ్-1 విజేతలు, రేసింగ్ ప్రముఖుల తాజా ఇంటర్వ్యూలు, ఆసక్తికర కథనాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఆటో స్పోర్ట్స్ రైటర్స్‌తోనే వీటిని రాయించడం విశేషం.
 
సౌజన్యం: ఆంధ్రజ్యోతి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి