13, ఏప్రిల్ 2012, శుక్రవారం

గూగుల్‌ కళ్ళు

అంతర్జాలం (ఇంటర్నెట్‌) లో అత్యధిక ప్రజాదరణ పొందిన సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌. ఇప్పుడిది మరోరకంగా వార్తల్లోకెక్కింది. స్మార్ట్‌ఫోన్‌లు చేయగలిగిన పనులు చేస్తూ, కంటి అద్దా లలా వాడుకోగలిగే ఒక 'సాధనాన్ని' గతవారం ఇది ఆవిష్కరించింది. ఆ సాధ నంలో ఉండే పారదర్శక అద్దం టెక్ట్స్‌ మెసేజ్‌ల నుండి మ్యాపుల వరకూ, వీడియో చాట్‌ నుండి దారి చూపించ డం వరకూ, అన్నీ కేవలం నోటి మాటలతో చేయడమే కాకుండా కళ్ళకు కట్టినట్టుగా చూపెడుతుంది కూడా. అంటే, కాఫీ తాగు తూనే ఆ రోజు చేయవలసిన పనులు ఏమిటో తెలుసుకోవచ్చు; లంచ్‌ చేస్తూ వీడియో చాట్‌ చేయవచ్చు; కిటికీలో నుండి బయటికి చూస్తూ వాతావరణ సూచనలను గ్రహించవచ్చు; కారు నడుపుతూ వెళ్లవలసిన గమ్యానికి సులువైన మార్గం చూడవచ్చు. వినడానికే అద్భుతంగా వున్న ఈ ఆవిష్కరణ ఇంకా పూర్తిస్థాయిలో విడుదలకు సిద్ధం కాలేదు. త్వరలో రానున్న ఈ పరికరం స్మార్ట్‌ ఫోన్‌ స్థాయి ధరల్లో వుండే అవకాశం ఉంది. కేవలం చెవి, నోటి తోనే పని ఉండే సెల్‌ఫోన్లతోనే మనవాళ్ళు రోడ్లమీద ప్రమాదాలు సృష్టిస్తున్న రోజుల్లో, కంటికి కట్టుకున్న 'గూగుల్‌ కన్నుతో ఇంకెన్ని విన్యాసాలు చేస్తారో మరి?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి