జగన్ అరెస్టుపై అదే సస్పెన్స్
ఎటూతేల్చుకోలేక వత్తిడికి లోనవుతున్న సిబిఐ
హైదరాబాద్, ఏప్రిల్ 2, ప్రభాతవార్త: అక్రమ ఆస్తుల కేసులో సిబిఐ ఇప్పటికే ఛార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేసిన నేపధ్యంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని అరెస్టు చేస్తారా? లేదా? అన్న విషయమై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఎడతెగని ఉత్కంఠభరిత చర్చ జరుగుతోంది. ఛార్జిషీట్‌లో జగన్‌ను ఎ-1 నిందితుడుగా చూపిం చిన సిబిఐ ఆయనను అరెస్టు చేసే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. జగన్ మొదటి ముద్దాయిగా ఉన్న ఈ కేసులో పలు కీలకమైన ఆధారాలను సేకరించిన సిబిఐ అధికారులు జగన్‌ను అరెస్ట్ చేసేందుకు ఈ సమాచారం సరిపోతుందని భావిస్తున్నప్పటికీ అనేక కారణాల వల్ల ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. హడా విడిగా జగన్‌ను అరెస్ట్ చేస్తే ఎదురయ్యే పరిణా మాలు కేసు దర్యాప్తును ఆటంకపరుస్తాయని సిబిఐ అధికారులు భావిస్తున్నట్లు ప్రచారం జరుగు తున్నప్పటికీ ఈ కేసుల రెండో ముద్దాయిని ఇప్పటికే అరెస్టు చేసి మొదటి ముద్దాయి అరెస్టుకు వెనకాడటం వల్ల సిబిఐ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఓబుళాపురం గనుల కేసులలో ఎ1, ఎ2లైన బి.వి.శ్రీనివాసరెడ్డి, గాలి జనార్థన్ రెడ్డిలను, ఇమ్మార్ కేసులో మొదటి ముద్దాయి బిపి ఆచార్యను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జగన్ అక్రమాస్తుల కేసులో కూడా ఇదే
జగన్ అరెస్టుపై అదే సస్పెన్స్
జిజి వైఖరి అవలంభిస్తారా?, లేదా? అన్న అంశాన్ని సిబిఐ అధికారులు స్పష్టం చేయలేపోతున్నారు. జగన్‌ను అరెస్ట్ చేయడంవల్ల రాష్ట్రంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందంటున్న నిఘా సంస్థల నివేదికలను కూడా సిబిఐ పరిగణన లోకి తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.ఈ నేపధ్యంలో జగన్ కేసులో సిబిఐ మం గళవారం అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేయనుంది. దీంతో జగన్ అరెస్టుపై రాజకీయవర్గాలో జరుగుతున్న చర్చోపచర్చలు వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి.
కేసులో మొదటి ముద్దాయిగా ఉన్న జగన్‌ను అరెస్టుచేయడానికి సిబిఐ ఎం దుకు వెనుకాడుతోందని కొందరు కాంగ్రెస్ సీనియరు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్‌ను అరెస్టు చేయకుంటే ఆయనను కాంగ్రెస్ హైకమండ్ రక్షిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణల వర్షం కురిపిస్తాయని, దీంతో పార్టీ ప్రతిష్ట మరింత దెబ్బతింటుందని పలువురు సీనియర్లు అంటున్నారు. అయితే జగన్‌కు ప్రజల్లో ఇప్పటికే బలమైన సానుభూతి ఉందని, ఆయనను అరెస్టు చేస్తే రాష్ట్రంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని, ప్రజల్లో మరింత సానుభూతి పెరు గుతుందని, ఇందువల్ల రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న 18అసెంబ్లీ, నెల్లూరు లోక్ సభ స్థానాల ఉప ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపి కోవూరులో మాదిరిగా పార్టీ మూడో స్థానంలోకి పోతుందని మరికొందరు కాంగ్రెస్ నాయకులు అబిప్రాయ పడుతున్నట్లు సమాచారం. యువనేత అరెస్టుపై సొంత పార్టీలోనే వ్యక్తమవు తున్న భిన్నాభిప్రాయాలతో కాంగ్రెస్ బెంబేలెత్తుతోంది. అయితే ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా జగన్‌ను అరెస్టు చేసేందుకు సిబిఐ వ్యూహం రచిస్తోందని ప్రచారం జరుగుతోంది. అయితే అరెస్టు ఎప్పుడు ఉంటుందన్న అంశంపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
తాజాగా సిబిఐ జెడి లక్ష్మీనారాయణకు 'వై కేటగిరి భద్రత కలిపించడం, అద నంగా సిబిఐ బృందాలు రాష్ట్రానికి చేరుకోవడం, సిబిఐ కేంద్ర కార్యాలయం నుంచి రాష్ట్ర పోలీసు శాఖకు భద్రతకు సంబంధించి కొన్ని సలహాలు, సూచనలు అందాయని వార్తలు వస్తుండడం వంటి పరిణామాల క్రమంలో రాజకీయ వర్గాల్లో జగన్ అరెస్టు అంశంపై ఉత్కంఠభరిత చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా జగన్‌ను అరెస్టు చేయవచ్చునన్న వార్తలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తున్నప్పటికీ ఎలాంటి పరిస్థితులనైనా తమకు అనుకూలంగా మార్చుకు నేలా ఆ పార్టీ పక్కా ప్రణాళికను రూపొందించుకున్నట్లు సమాచారం. తాను జనంలో ఉన్నా, జైలులో ఉన్నా ప్రజల సానుభూతిని పొంది దానిని బలమైన ఓటు బ్యాంకుగా మార్చుకోవాలన్నదే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. పరిస్థితులు తనకు వ్యతిరేకంగా ఉన్నాయని గ్రహించిన యువనేత జగన్ అరెస్టుకూ మానసికంగా సిద్దమయ్యా రని ప్రచారం జరుగుతోంది. తాను అరెస్టు అయినంత మాత్రాన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయి పోయిందని ఎదరూ భావించకుండా ఉండేవిధంగా కార్యక్రమాలు చేపట్టడానికి, జైలుకెళ్లినా పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయడానికి అవసరమైన పక్కా ప్రణాళికను జగన్ ఇప్పటికే రూపొందించుకు న్నారని పార్టీ వర్గాలంటున్నాయి.
తనను రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు సాగిస్తున్న కుట్రల్లో భాగమే సిబిఐ కేసులని ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్లగలిగామని, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పథకాలు ఇప్పటికీ అన్ని వర్గాల ప్రజల్లో హృదయాల్లో నిలిచిపోయాయని, ఆ పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందన్న విషయాన్ని, మళ్లీ ఈ పథకాలన్నీ అమలు కావా లంటే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందేనన్న సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లామని, పైగా వైఎస్‌ఆర్ చనిపోయిన అనంతరం ఏర్పడిన సానుభూతి ఇంకా పోలేదని, చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని వేధిస్తున్నారని ప్రజలు భావిం చేలా ప్రచారం చేయగలిగామని, ఇలాంటి సానుకూల పరిణామాలన్నిటినీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పటిష్టతకు ఉపయోగించుకోవాలని జగన్ పార్టీ నేతలకు ఉద్భోధి స్తున్నారని సమాచారం. కాగా జగన్ అరెస్టుఅయినా మరింత సానుభూతి పెరు గుతుందే తప్ప ఏమీకాదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. జగన్‌ను జైల్లో పెడితే అంతిమంగా కాంగ్రెస్,తెలుగుదేశం పార్టీలే నష్టపోతాయని, త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న 18 అసెంబ్లీ, నెల్లూరు లోక్‌సభ స్థానాల ఫలితాలు కడప జిల్లా ఉప ఎన్నికల మాదిరిగా ఏకపక్షంగా ఉంటాయని వారు చెబుతు న్నారు. జగన్ అరెస్టు అయితే ఓ వైపు న్యాయపోరాటం సాగిస్తూనే మరో వైపు ప్రజాపోరాటం కూడా చేపట్టే విధంగా వైఎస్‌ఆర్‌సిపి నాయకులు ప్రణాళికను సిద్దం చేసుకుంటున్నారు. ప్రధానంగా ఏ క్షణంలో జగన్ అరెస్టు అయినా మరు క్షణమే రాష్ట్ర వ్యాప్తంగా కనీవిని ఎరుగని రీతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర ప్రజలంతా జగన్‌కు వెన్నుదన్నుగా ఉన్నారని కేంద్రానికి చాటేలా చేయాల న్నది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకుల వ్యూహంగా కనిపిస్తోంది. వైఎస్ రాజశేఖ రరెడ్డి మృతి చెందిన సమయంలో ఎంత సానుభూతి వచ్చిందో జగన్ అరెస్టు నేపధ్యంలోనూ అంతకు మించిన సానుభూతి పొందేలా జగన్ వర్గీయులు చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తున్నారు.
కాగా జగన్‌ను అరెస్టు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, జగన్ అరెస్టును అడ్డుకోవడానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ శ్రేణులనుంచి తీవ్రమైన ప్రతిఘ టన ఎదురవుతుందని, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయని, దీనికి ప్రజామద్దతు కూడా తోడయ్యే అవకాశం ఉందని నిఘా సంస్థలు ఇప్ప టికే నివేదికలు ఇచ్చినట్లు చెబుతున్నారు.
ఈస్థితిలో సిబిఐ జగన్ విషయంలో ఏమి చేయబోతుందోనన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా జగన్ అరెస్టు అనివార్యమైతే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను పులివెందుల ఎమ్మెల్యే, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేపట్టనున్నారు. అన్ని జిల్లాల్లో విజయమ్మచే సభలు పెట్టించి జగన్‌పై రాజకీయవేధింపులకు పాల్పడుతున్నారని ప్రజల్లో ప్రచారం చేయిస్తా రని కూడా తెలిసింది. విజయమ్మ అన్ని అంశాలను అధ్యయనం చేస్తు న్నారని, పదునైన ఉపన్యాసాలు ఇచ్చేలా సిద్దమవుతున్నారని విశ్వసనీ యంగా తెలిసింది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి