22, ఏప్రిల్ 2012, ఆదివారం

జాతీయ పానీయంగా 'టీ'ను ప్రకటిస్తాం : మాంటెక్ సింగ్


ఆదివారం, 22 ఏప్రిల్ 2012( 16:03 IST )

జాతీయ పానీయంగా టీను ప్రకటిస్తామని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా తెలిపారు. అస్సోంలో మొదటిసారిగా తేయాకు చెట్లు నాటిన మణిరాం దివాన్‌ 212వ జయంతిని పురస్కరించుకుని జోర్హాత్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాంటెక్ మాట్లాడుతూ దేశంలో ఎక్కువ మంది మహిళలకు తేయాకు రంగమే ఉపాధి కల్పిస్తోందని అన్నారు.

అంతేకాకుండా, దేశంలోని 83 శాతం కుటుంబాలలో టీ తాగడం విడదీయరాని భాగంగా ఉందన్నారు. త్వరలో గౌహతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక చాయ్‌ బార్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బ్లాక్ టీ ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. కాఫీ తరహాలోనే తేయాకులో కూడా వైవిధ్యమైన రకాలను ఉత్పత్తి చేయాలని ఆయన టీ ప్లాంటేషన్ యజమానులను కోరారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి