5, ఏప్రిల్ 2012, గురువారం

ప్రపంచంలో కెల్లా పొడవైన, ఎత్తయిన బ్రిడ్జి ప్రారంభం





చైనాలోని హునాన్‌ ప్రావిన్స్‌లో నిర్మించిన అంజాహైట్‌ సస్పెన్షన్‌ బ్రిడ్జి ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తయినది, పొడవైనది. 1,102 అడుగుల ఎత్తున, 3,858 అడుగుల వెడల్పున నిర్మించిన ఈ బ్రిడ్జిని మంగళవారం అధికారికంగా వాహన చోదకులకు అనుమతించినట్లు డైలీ మెయిల్‌ పేర్కొంది. ఈ బ్రిడ్జి పనులు 2007 అక్టోబరులో ప్రారంభ మయ్యాయి. గతేడాది చివరిలో దాదాపు చాలావరకు పని పూర్తయింది. రెండు టన్నెల్స్‌ను కలుపుతున్న ఈ కొత్త వంతెన పొడవునా అంటే 3,858 అడుగుల పొడవునా డెహాంగ్‌ కేనియా న్‌ లోయ అందాలు తిలకిస్తూ వెళ్ళొ చ్చు. ఈ బ్రిడ్జిపై ఏకంగా 1,888 లైట్లు ఏర్పాటు చేశారు. దీంతో రాత్రి పూట ఈ వంతెన వెలిగి పోతోంది. రెండు పర్వతాలను కలిపే వెడల్పయిన ఈ వంతెన నాలుగో సస్పెన్షన్‌ బ్రిడ్జి అని డైలీ మెయిల్‌ పేర్కొంది. నాలుగు లైన్ల రహదారి ఉన్న ఈ వంతెనపై కార్లు, లారీలు 50 ఎంపి హెచ్‌ వేగంతో వెళ్ళొచ్చు. రోడ్డుకు కిందగా ప్రత్యేకంగా పాదచారులు నడిచేందుకు మార్గముం ది. 64 కిలో మీటర్ల పొడవుండే జిషు- చాడంగ్‌ ఎక్స్‌ప్రెస్‌వేలో ఈ వంతెన కీలకమైన భాగం. ఈ రోడ్డు పొడవునా 18 టన్నెల్స్‌ ఉన్నాయి. పర్వత ప్రాంతా ల్లో చాలా సాధారణంగా ఉండే ట్రాఫిక్‌ జామ్‌ వంటి సమస్యలను పరిష్కరిం చేందుకు ఈ వంతెన బాగా ఉపయోగ పడుతుందని భావిస్తున్నారు.

చైనాలో ఎత్తైన,పొడవైన అంజైట్ బ్రిడ్జిని నిన్న ట్రఫిక్ కోసం తెరిచారు. ఈ బ్రిడ్జి పొడవు 3858 అడుగులు. 
No jams: It is hoped the bridge will help ease traffic jams which are common in the mountainous area which has narrow, steep and winding roads

High rise: The bridge is a key part of the Jishou-Chadong Expressway, a 64-kilometre road which has 18 different tunnels which cover about half of its length

ఇది 1102 అడుగుల ఎత్తులో ఉంది. హునాన్ రాష్ట్రంలోని, డేహాంగ్ లోయపైనున్న ఈ ఇంజినీరింగ్ అద్భుతం నిర్మాణం 2007లో మొదలయింది.
Dizzying: Labourers put the finishing touches to the Anzhaite Long-span Suspension Bridge in Jishou, Hunan, China, this week, just in time for its opening

Brush with death: Work started on the engineering feat in October 2007 and the bulk of the work finished at the end of last year
 ఈ బ్రిడ్జివల్ల ఈ పర్వత మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని భావిస్తున్నారు. ఈ ఫోర్ లేన్ బ్రిడ్జిలో పాదచారులకి ప్రత్యేక లైన్ ఉంది.


Eerie: The bridge, which is lit up at night with 1,888 lights, is the fourth suspension bridge to cross a valley so wide it seems to be connecting two mountain ranges

Anzhaite long-span suspension bridge opens in Jishou, Hunan province

 ఈ బ్రిడ్జిని రాత్రి వేళల్లో 1888 లైట్లతో వెలిగిస్తారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి