13, ఏప్రిల్ 2012, శుక్రవారం

విద్యా హక్కు చట్టం అంటే ఏంటి.. అదేం చెపుతోంది!!


విద్యా హక్కు చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తాజాగా వెలువరించిన తీర్పు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఈ తరహా చట్టం చాలా మంచిదని, అందువల్ల ఈ చట్టాన్ని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ఖచ్చితంగా అమలు చేసి తీరాలంటూ సుప్రీం సంచలనాత్మక తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో దేశంలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు పేద విద్యార్థులకు తమ సీట్లలో 25 శాతం ఖచ్చితంగా కేటాయించాల్సి ఉంది. దీన్ని ప్రైవేట్ యాజమాన్యాలు ఏమాత్రం అంగీకరించడం లేదు.

ఈ పరిస్థితుల్లో అసలు విద్యాహక్కు చట్టం అంటే.. అదేం చెపుతోంది. దేశంలోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు నిమిత్తం గత 2009 జులై రెండో తేదీన విద్యా హక్కు చట్టం (ఆర్.టి.ఈ)కి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ బిల్లుపై 2009 జులై 20వ తేదీన రాజ్యసభ ఆమోదించింది. 2009 ఆగస్టు నాలుగో తేదీన లోక్‌సభలోనూ ఆమోదపొందింది. ఆ తర్వాత సెప్టెంబరు మూడో తేదీన ఆర్.టి.ఐను ఓ చట్టంగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది.

* ఈ విద్యాహక్కు చట్టం ప్రకారం.. ఆరు నుంచి 14యేళ్ళ లోపు చిన్నారులకు విద్యా ప్రాథమిక హక్కు. ప్రాథమిక పాఠశాలలు కనీస ప్రమాణాలు పాటించాల్సి ఉటుంది.

* అన్ని ప్రభుత్వ పాఠశాలలు పేద కుటుంబాల పిల్లలకు 25 శాతం సీట్లు రిజర్వు చేయాల్సి ఉంటుంది.

* పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం డొనేషన్లు, క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేయడం వల్ల పిల్లలు లేదా వారి తల్లిదండ్రులను ఇంటర్వూ చేయడం నిబంధనలకు విరుద్ధం.

* ప్రాథమిక విద్య పూర్తయ్యేంత వరకు ఏ విద్యార్థిని వెనక్కి పంపండం, తొలగించడం, బోర్డ్ పరీక్షల్లో పాస్ అవ్వాలనడం కుదరదు.

* డ్రాపౌట్లను వారి సమాన తరగతి విద్యార్థుల స్థాయికి తెచ్చేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి