13, ఏప్రిల్ 2012, శుక్రవారం
వివాహాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ఇక వివాహాల రిజిస్ట్రేషన్‌ను తప్పని సరి చేసే రెండు బిల్లులకు ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన గురువారం సమావేశమైన కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. 1969 నాటి జనన, మరణాల రిజిస్ట్రేషన్ చట్టం, 1909 నాటి ఆనంద్ వివాహ చట్టానికి సవరించడానికి ఉద్దేశించిన ఈ రెండు బిల్లులను ఈ నెల 24 తర్వాత తిరిగి ప్రారంభమయ్యే ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెడతామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్ సిబల్ మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాకు తెలియజేసారు. ఈ బిల్లుల ప్రకారం మతంతో సంబంధం లేకుండా అన్ని మతాల వారు వివాహాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంటుంది. విడాకుల కేసులో మహిళలు అనవసరంగా వేధింపులకు గురి కాకుండా కాపాడడానికి ఈ బిల్లులు తోడ్పడతాయని ఆయన చెప్పారు. భారత దేశంలో కుల, మత, వర్గ వివక్ష లేకుండా ప్రతి ఒక్కరి వివాహాన్నీ రిజిస్టర్ చేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా వివాహాల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేసేందుకు ఇప్పుడు ఈ బిల్లులను తీసుకు రానున్నారు. ఈ బిల్లులతో పాటుగా కేంద్ర మంత్రివర్గం ప్రభుత్వ విభాగాల్లో వస్తు సేకరణకు సంబంధించిన మరో బిల్లును కూడా మంత్రివర్గం ఆమోదించింది..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి