31, జులై 2013, బుధవారం

Road ahead for Telangana, the state


Hindustan Times  Hyderabad, July 31, 2013



After much deliberation, the ruling UPA on Tuesday decided to split Andhra Pradesh and create Telangana, acceding to a 45-year-old demand for statehood in a bid to win local support and stymie political rivals ahead of the 2014 general elections.
Telangana, likely to be born as the 29th state of India sometime next year, will comprise 10 out of the 23 districts of united Andhra.
Here are some points highlighting the road ahead for the state.
- The Union cabinet will take up the issue on Wednesday and share its plans with the President
- Government will refer the proposal to the Andhra Pradesh legislature for a resolution
- Proposal will be sent back to the cabinet
- A Group of ministers (GoM) will address the concerns of the three Andhra Pradesh regions on sharing water, land, electricity and revenue
- GoM will ask the law ministry to draft a legislation, which will be sent to the AP assembly and home ministry
- Bill cleared by the cabinet will go the President, who will forward it to Parliament
- Both the Houses of Parliament will have to pass a resolution by a simple majority
- Telangana will be born after the President's assent to the bill
- The entire process is likely to take four to five months

Telangana: How the 29th state will be formed

Telangana: How the 29th state will be formed
The first step would be a reference by the Union government to the state legislature to pass a resolution for formation of a separate state of Telangana.
NEW DELHI: With the CWC giving thumbs up to Telangana, the formal process for creation of India's 29th state will get underway in earnest. Estimated to take a bare minimum of 122 days once the resolution for creation of the new state is passed by the Andhra Pradesh state legislature, the state reorganization proposal will have to be approved thrice by the Union Cabinet apart from being ratified by the state legislature and, finally, Parliament.

The first step would be a reference by the Union government to the state legislature to pass a resolution for formation of a separate state of Telangana. On the basis of this proposal, the Union home ministry will prepare a Cabinet note over the next seven days and submit it for approval. A Cabinet meeting will take up this note and form a Group of Ministers (GoM) - comprising the ministers of home affairs, finance, education, health, irrigation, power, environment and forest, railways, HRD, chemicals and fertilizers, food and consumer affairs and labour — besides deputy chairman of Planning Commission - to examine the economic issues linked to creation of the new state. This GoM is likely to submit its recommendations in a 30-day timeframe.

The Union home ministry will study the GoM's recommendations over the next 15 days and accordingly frame the Cabinet note, to be moved with draft Andhra Pradesh Reorganisation Bill. The note will request the Union Cabinet to approve the draft Bill, recommend to the President to refer the Bill to the state legislature, ask the finance ministry to appoint an expert panel to recommend measures for smooth transition in terms of financial management and viability of the reorganized states and seek setting up of a dedicated unit in the Planning Commission to manage economic and financial factors in the rest of Andhra Pradesh. This unit will ensure multifaceted development of the region with the help of better financial management and adequate devolution of Central funds. The Cabinet approval for this is expected within seven days.

Over the next couple of days, the draft Bill — through the home minister and the prime minister — will be sent to the President, requesting him to refer it to the state legislature under Article 3 of the Constitution. The state legislature will have 30 days to consider the draft Bill and give its views, which will then be vetted by the law ministry over the next seven days. The Cabinet note with the draft reorganization Bill — vetted by the law ministry — will be put up for approval and is expected to be cleared by the Cabinet in five days.

Once the draft organization Bill is approved by the Cabinet, a notice for its introduction in Lok Sabha/Rajya Sabha will be given. This may take a couple of days. The consideration and passage of the Bill is expected over the next 15 days, followed by Presidential assent over the next two days. Thus, the process of bifurcation of Andhra Pradesh to create a separate state of Telangana will be complete.

ఆవిర్భావం నుంచి విభజన వరకు


July 31, 2013

హైదరాబాద్, జూలై 30 : ఆంధ్రప్రదేశ్.. ముందుతరాలకు ఓ చరిత్ర..ఓ పాఠం.. 57 ఏళ్లుగా సాగుతున్న సమైక్య రాష్ట్ర ప్రస్థానం ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన దిశగా మంగళవారం తొలి ప్రకటన చేయడంతో 1956 నవంబరు 1న ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల విలీనంతో రూపుదిద్దుకున్న 'ఆంధ్రప్రదేశ్' గత చరిత్రగా మిగిలిపోనుంది.

ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్న తెలంగాణ ప్రాంతం 1948 సెప్టెంబరు 17న ఇండియన్ యూనియన్‌లో భాగమైంది. 1956లో ఆంధ్రరాష్ట్రంతో కలిసి సమైక్య ఆంధ్రప్రదేశ్‌గా ఆవిర్భవించింది. నాటి నుంచి జైఆంధ్ర, ప్రత్యేక తెలంగాణ నినాదాలతో సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలన్న డిమాండ్లు అడపాదడపా విన్పిస్తున్నా సుమారు దశాబ్దంన్నర క్రితం ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎట్టకేలకు విభజనకు బాటలు వేసింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచి విభజన వరకు ఏం జరిగిందో సంక్షిప్తంగా...

హైదరాబాద్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ దిశగా...
- కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ మూడు ప్రాంతాలు 16, 17 శతాబ్ధాల్లో కుతుబ్‌షాహీ సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి.
-దేశంలో బ్రిటీష్ పాలకుల ప్రవేశంతో హైదరాబాద్ రాష్ట్ర పాలకుడు నిజాం తన పాలనలోని సర్కారు(ప్రస్తుత కోస్తాంధ్రలో కొంత భాగం), రాయలసీమ ప్రాంతాలపై అధికారాన్ని బ్రిటీష్ వారికి కట్టబెట్టారు. దీంతో అవి బ్రిటీష్ పాలనలో మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. స్వాతంత్య్రానంతరం మద్రాసు రాష్ట్రంలో భాగంగా మారాయి. నిజాం పాలనలోని హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్‌లో భాగస్వామిగా మారి ప్రత్యేక రాష్ట్రంగా ఉండిపోయింది.

- హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్‌లో భాగస్వామి అయిన తర్వాత హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా భారత ప్రభుత్వం ఎం.కె. వెల్లోడి అనే సివిల్ సర్వెంట్‌ను 1950 జనవరి 26న నియమించింది. 1952లో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
- తెలుగు మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలన్న డిమాండ్‌తో పొట్టి శ్రీరాములు 1952లో 56 రోజుల పాటు చేసిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా భాషాప్రాతిపదిక ఏర్పాటైన ఆంధ్రరాష్ట్రంతో హైదరాబాద్ రాష్ట్రాన్ని కలపాలన్న ప్రతిపాదనను 1953లో కాంగ్రెస్ అధిష్ఠానం తెరపైకి తెచ్చింది. దీనికి తెలంగాణ ప్రాంతంలో వ్యతిరేకత వ్యక్తమైనా అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం కాంగ్రెస్ అధిష్ఠానానికి మద్దతు పలికారు. దీంతో కర్నూలు రాజధానిగా 1953లో ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది.
- తెలంగాణ, ఆంధ్ర ప్రాంత ప్రజల నడుమ సాంస్కృతిక, సామాజిక వైరుధ్యాలు ఎన్ని ఉన్నా కేవలం తెలుగు భాష మాట్లాడే ప్రజలను ప్రాతిపదికగా తీసుకుని 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ను రాజధానిగా చేశారు.
అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు అప్పట్లో తెలంగాణ ప్రాంత ప్రజల్లో వ్యతిరేకత వచ్చినా ఆ ప్రాంత ప్రజల హక్కులకు ఎలాంటి భంగం కలగదన్న హామీతో విలీన ప్రతిపాదన తీర్మానాన్ని ఆంధ్రరాష్ట్ర అసెంబ్లీ 1955 నవంబరు 25న ఆమోదించింది.
- 1956 ఫిబ్రవరి 20న తెలంగాణ, ఆంధ్రరాష్ట్ర ప్రాంతాల నాయకుల నడుమ 'పెద్ద మనుషుల ఒప్పందం' జరిగింది. దీనిపై బెజవాడ గోపాలరెడ్డి, బూర్గుల రామకృష్ణారావులు సంతకం చేశారు. ఎట్టకేలకు రాష్ట్రాల పునర్విభజన చట్టాన్ని అనుసరించి తెలుగు మాట్లాడే ప్రజలందరితో కలిసి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది.
- ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో సమృద్ధిగా ఉన్న నీటివనరులు, సారవంతమైన భూముల కారణంగా కోస్తాంధ్ర అభివృద్ధి పరంగా ముందంజలో ఉంది. విశాఖపట్నంలో పారిశ్రామికాభివృద్ధి.. పలు ఓడరేవుల నిర్మాణం.. కేజీ బేసిన్‌లో చమరు నిక్షేపాల కారణంగా ఆర్థికంగా కూడా కోస్తాంధ్ర మిగిలిన ప్రాంతాలకన్నా అభివృద్ధి పథంలో ఉంది. అధికశాతం బీడు భూములు, సాగునీటి వనరులు లేకపోవడంతో తెలంగాణ ప్రాంతం అభివృద్ధిపరంగా వెనుకబడింది. రాయలసీమ సైతం కరవు కాటకాలతోను, కొన్ని దశాబ్దాలుగా సాగిన ఫ్యాక్షన్ హత్యల కారణంగా వెనకబడిన ప్రాంతంగా మిగిలిపోయింది.

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు సాగిందిలా...
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా 1969లో పెద్ద మనుషుల ఒప్పందాన్ని అమలు చేయడంలో విఫలమయ్యారంటూ తెలంగాణ ప్రాంత ప్రజలు నిరసన గళం విన్పించారు.
-కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న మర్రి చెన్నారెడ్డి ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రజా సమితి పేరుతో పార్టీని స్థాపించారు. విద్యార్థుల సహకారంతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కొంత కాలం ఉద్ధృతంగా సాగింది. ఉద్యమం హింసాత్మకంగా మారడంతో సుమారు 300 మంది మృత్యువాతపడ్డారు.
- నాటి పరిస్థితుల తీవ్రతను తగ్గించేందుకు అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ పలుమార్లు ఆంధ్ర, తెలంగాణ ప్రాంత నాయకులతో మాట్లాడి 1969 ఏప్రిల్ 12న 8 సూత్రాల ప్రణాళికను రూపొందించారు. అయితే తెలంగాణ ప్రాంత నాయకులు దాన్ని తిరస్కరించి తెలంగాణ ప్రజాసమితి పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు.
- తెలంగాణ ప్రాంతంలో సాగుతున్న ప్రత్యేక డిమాండ్‌కు ధీటుగా 1972లో సీమాంధ్ర ప్రాంతాల్లో జైఆంధ్ర ఉద్యమం మొదలైంది.
- ఇరుప్రాంతాల్లో శాంతియుత పరిస్థితులను తీసుకొచ్చేందుకు 1973 సెప్టెంబరు 21న 6 సూత్రాల పథకం తెరపైకి వచ్చింది.
-ఉద్యోగ నియామకాల్లో తమకు అన్యాయం జరుగుతోందంటూ 1985లో తెలంగాణ ప్రాంతంలో నిరసన స్వరాలు మొదలయ్యాయి. దీంతో అప్పటి తెదేపా ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రజల ఉద్యోగభద్రతకు జీవోను తీసుకొచ్చింది.
- 1999 వరకు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ఎలాంటి ఉద్యమాలు లేవు. అయితే ఎన్నికల్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ 1999లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. కొద్ది కాలానికే చంద్రబాబు నాయుడి కేబినెట్‌లో మంత్రి పదవి లభించలేదన్న కారణంతో తెదేపాను వీడిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 2001 ఏప్రిల్ 21న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేయడంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దిశగా...
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నుంచి ఒత్తిడి రావడంతో 2001లో కాంగ్రెస్ అధిష్ఠానం రెండో ఎస్సార్సీని ఏర్పాటు చేయాలంటూ తీర్మానం చేసి అప్పటి ఎన్డీయే ప్రభుత్వానికి పంపింది. అయితే ఎన్డీయే దాన్ని తిరస్కరించింది. అప్పటి హోంశాఖ మంత్రి ఎల్‌కే ఆడ్వాణి దేశ సమగ్రతకు చిన్నరాష్ట్రాల ఏర్పాటు సరికాదంటూ ప్రకటన చేశారు.
- 2004 నాటి ఎన్నికల ముందు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హామీ ఇస్తూ తెరాసతో ఎన్నికల పొత్తు పెట్టుకుంది. నాటి ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెరాస కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కాంగ్రెస్ భాగస్వామి పక్షంగా మారింది. అయితే ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి కాంగ్రెస్ సరిగా స్పందించడం లేదంటూ 2009 డిసెంబరు 9న సంకీర్ణం నుంచి తెరాస వైదొలిగి ఒంటరి పోరాటం ప్రారంభించింది.
- ప్రత్యేక రాష్ట్రం కోసం 2009 నవంబరు 29న కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభించా రు. దీంతో కేంద్రం డిసెంబరు 9న 'తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రక్రియ ప్రారంభమైంది' అంటూ ప్రకటించింది. కానీ, 23నాటికి మాటమార్చి ఈ అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు ప్రకటించింది.
- కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. పలువురు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ ఆత్మాహుతికి పాల్పడ్డారు. దీంతో కేంద్ర ప్రభుత్వం 2010 ఫిబ్రవరి 3న అయిదుగురు సభ్యులతో కూడిన శ్రీకృష్ణ కమిటీని నియమించింది. శ్రీకృష్ణ కమిటీ 2010 డిసెంబరు 30న నివేదిక ఇచ్చింది.
- శ్రీకృష్ణ కమిటీ నివేదిక అందజేసినా కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవడంతో 2011-12 మధ్యకాలంలో మిలియన్ మార్చ్, చలో అసెంబ్లీ, సకలజనుల సమ్మెలతో తెరాస ఉద్యమాన్ని ఉద్ధృతం చేసింది. దీంతో 2012 డిసెంబరు 28న అన్ని పార్టీలతో కేంద్ర హోంశాఖ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
- 2013 జూలై 30న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కీలక ప్రకటన వెలువడింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొనసాగనుంది. అయితే సాంస్కృతిక వైరుధ్యాలు కల ఈ రెండు ప్రాంతాలు కలిసి ఉంటాయా..? ఆంధ్రప్రదేశ్ మరోసారి విభజన ఉద్యమానికి వేదికగా మారుతుందా..? అన్నది చరిత్ర తేల్చాల్సిన అంశాలు.

తెలంగాణ దారిలో...

Updated: July 31, 2013 06:05 (IST)
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభిస్తామంటూ కేంద్రం ప్రకటన చేసిన 2009 డిసెంబర్ 9 నుంచి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిన ఈ ఏడాది జూలై 30 వరకు ఎన్నో  పరిణామాలు, మరెన్నో ఘటనలు... అందులో ముఖ్యమైన అంశాలు సంవత్సరాల వారీగా...
    - సాక్షి, హైదరాబాద్

 2009
 డిసెంబరు 9: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభిస్తుందని అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటన.
 10: 9న చేసిన ప్రకటనను పార్లమెంట్‌కు తెలియజేసిన చిదంబరం. ప్రకటనను నిరసిస్తూ సీమ, కోస్తా ప్రాంత ఎమ్మెల్యేల రాజీనామాలు. అంతటా నిరసనలు
 23: ప్రకటనను సవరించుకుంటూ... విస్తృత స్థాయిలో చర్చలు కొనసాగుతాయని చిదంబరం ప్రకటన
 ూ  మంత్రి జానారెడ్డి ఇంటికి వెళ్లిన కేసీఆర్.. జేఏసీ ఏర్పాటు చేస్తామని వెల్లడి. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల రాజీనామాలు.. మళ్లీ భగ్గుమన్న నిరసనలు.
 24: తెలంగాణ జేఏసీ చైర్మన్‌గా కోదండరాం. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలు.
 25: తమ పదవులకు రాజీనామా చేస్తామని తెలంగాణ ప్రాంత మంత్రుల ప్రకటన
 26: తెలంగాణ సాధనకు ఆ ప్రాంత కాంగ్రెస్ నాయకుల కమిటీ ఏర్పాటు
 31: తెలంగాణ అంశంపై చర్చించేందుకు 2010 జనవరి 5న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో సమావేశం జరుపుతామని చిదంబరం ప్రకటన.. కాంగ్రెస్, టీడీపీ, పీఆర్పీ, టీఆర్‌ఎస్, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం, బీజేపీలకు ఆహ్వానం.

 2010
 జనవరి 5: ప్రత్యేక, సమైక్య ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రంలోని గుర్తిం పు పొందిన రాజకీయ పార్టీలతో ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సమావేశం.
 28: రాష్ట్ర పరిస్థితుల అధ్యయనానికి కమిటీని నియమించనున్నట్లు అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటన.
 ఫిబ్రవరి 3: రాష్ట్ర పరిస్థితుల అధ్యయనానికి కమిటీ ఖరారు. సారథిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ణ, మరో నలుగురు సభ్యుల నియామకం.
 12: శ్రీకృష్ణ కమిటీ విధి విధానాల ఖరారు. తెలంగాణ జిల్లాల్లో మళ్లీ అలజడి.
 15: జేఏసీ నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్
 మార్చి 4: రాష్ట్రానికి శ్రీకృష్ణ కమిటీ రాక.. అన్ని పార్టీల అధినేతలతో సమావేశం.
 18: ‘హైదరాబాద్’ ఫ్రీజోన్‌ను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో ఏకవాక్య తీర్మానం. ఆమోదించిన సభ.
 డిసెంబర్ 30:  కేంద్ర హోంశాఖకు నివేదికను సమర్పించిన శ్రీకృష్ణ కమిటీ. నివేదికపై చర్చించేందుకు 2011 జనవరి 6న గతంలో పిలిచిన 8 పార్టీలతో ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించిన కేంద్రం.

 2011
 జనవరి 2: ఆరో తేదీన జరిగే అఖిలపక్ష భేటీలో పాల్గొనకూడదని టీఆర్‌ఎస్, బీజేపీ నిర్ణయం
 జనవరి 6: శ్రీకృష్ణ కమిటీ నివేదిక వెల్లడి.. ఢిల్లీలో అఖిలపక్ష భేటీ.. టీఆర్‌ఎస్, బీజేపీతో పాటు టీడీపీ కూడా భేటీకి దూరం.
 ూ తెలంగాణ సమస్యకు ఆరు పరిష్కార మార్గాలను సూచించిన శ్రీకృష్ణ కమిటీ.. నివేదికలోని అంశాలపై పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు నెల రోజుల్లో మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తామని చిదంబరం వెల్లడి (దాదాపు రెండేళ్ల పాటు ఎలాంటి సమావేశం జరగలేదు)
 శ్రీకృష్ణ కమిటీ సూచించిన ఆరు పరిష్కారాలు..
 1) రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచడం.
 2) రాష్ట్రాన్ని విభజించి, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడం. రెండు రాష్ట్రాలు సొంత రాజధానులు ఏర్పాటు చేసుకోవడం.
 3) సీమ, తెలంగాణను కలిపి రాయల తెలంగాణగా ఏర్పాటు చేయడం. కోస్తాను ఒక రాష్ట్రంగా విభజించడం. హైదరాబాద్‌ను రాయల తెలంగాణలో భాగంగా ఉంచడం.
 4) రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణగా విభజించడం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని మరింత పెంచి దాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయడం. నల్లగొండ, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్‌ల నుంచి కొన్ని మండలాలను గ్రేటర్‌లో కలపడం.
 5) రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణగా విభజించి.. హైదరాబాద్‌ను తెలంగాణ రాజధానిగా ఉంచడం. సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటు చేయడం.
 6) రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి తెలంగాణ ప్రాంత సామాజిక, ఆర్థికాభివృద్ధికి.. రాజకీయ సాధికారతకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం. చట్టబద్ధమైన అధికారాలతో తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయడం.
 మార్చి 10: హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్ కార్యక్రమం.
 సెప్టెంబర్ 13: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌తో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో పది జిల్లాలలో ‘సకల జనుల సమ్మె’ ప్రారంభం. సమ్మెలో పాల్గొన్న అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు.. 42 రోజుల పాటు కొనసాగి అక్టోబర్ 24న ముగిసిన సమ్మె. సకల జనుల సమ్మెలో భాగంగా జరిగిన రైల్‌రోకోల్లో పాల్గొన్న అధికార పార్టీ ఎంపీలపై పోలీసు కేసుల నమోదు.. జైలుకు తరలింపు.
 నవంబరు 12: తెలంగాణ జటిలమైన సమస్య అని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ వ్యాఖ్య.

 2012
 డిసెంబర్ 5: తెలంగాణ అంశంపై ఏదో ఒకటి తేల్చకుంటే.. దేశంలోకి ఎఫ్‌డీఐలకు అనుమతినిచ్చే అంశంపై లోక్‌సభలో జరిగే చర్చ, ఓటింగ్‌కు తాము దూరంగా ఉంటామని పార్టీ అధిష్టానాన్ని హెచ్చరించిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు.. దిగొచ్చిన అధిష్టానం.. డిసెంబర్ 28న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటన. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, ఎంఐఎంలతో పాటు కొత్తగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని భేటీకి రమ్మని ఆహ్వానం.
 డిసెంబర్ 28: కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన ఎనిమిది రాజకీయ పార్టీలతో అఖిలపక్ష భేటీ. (అంతకుముందు జాబితాలోలేని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించారు) సమస్యకు నెల రోజుల్లో పరిష్కారం తెలియజేస్తామని షిండే ప్రకటన.

 2013
 జనవరి 24: షిండే నెల రోజుల్లో అంటే నెల రోజుల వ్యవధిలోనే ప్రకటన చేయాలనడం సరికాదని సోనియాతో భేటీ అనంతరం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్ వెల్లడి
 27: తెలంగాణపై నిర్ణయానికి ఎలాంటి డెడ్‌లైన్లూ లేవని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్.. నిర్ణయానికి ఇంకా సమయం పడుతుందని కేంద్ర హోం మంత్రి షిండే ప్రకటన
 జూన్ 2: తెలంగాణపై నిర్ణయం తీసుకోవడంలో కాంగ్రెస్ జాప్యం చేస్తోందంటూ పార్టీ ఎంపీలు జి.వివేక్, మందా జగన్నాథం, సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు కె.కేశవ రావు పార్టీకి రాజీనామా చేసి, టీఆర్‌ఎస్‌లో చే రిక.
 16: ఆజాద్ స్థానంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా దిగ్విజయ్‌సింగ్ నియమాకం
 18: తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, నేతలు హైదరాబాద్‌లో భేటీ.. 30వ తేదీన నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం
 30: నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో తెలంగాణ సాధన సభను నిర్వహించిన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు.. కాంగ్రెస్‌తోనే తెలంగాణ సాధ్యమని నేతల ప్రకటనలు
 ూ  దిగ్విజయ్ సింగ్ విశాఖపట్నం రాక.. ఆయనను కలిసి ‘రాష్ట్రాన్ని విభజిస్తే ఊరుకోం’ అంటూ వినతిపత్రం ఇచ్చిన సీమాంధ్ర ప్రాంత ప్రతినిధులు.
 జూలై 1: హైదరాబాద్‌కు దిగ్విజయ్‌సింగ్ రాక. తమ అభిప్రాయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లిన ఇరు ప్రాంతాల ప్రజా ప్రతినిధులు
 1: తెలంగాణ అంశంపై అధిష్టానం త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తుందని దిగ్విజయ్‌సింగ్ వెల్లడి. అందుకు సంబంధించి రోడ్‌మ్యాప్‌లు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పీసీసీఅధ్యక్షుడికి ఆదేశం
 2: కోస్తా, సీమ ప్రాంతంలో సమైక్యాంధ్ర ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి పార్టీ నేతలకు దిగ్విజయ్ అనుమతి
 9: ఢిల్లీలో 12వ తేదీన జరిగే పార్టీ కోర్ కమిటీ సమావేశానికి రావాలంటూ సీఎం కిరణ్, డిప్యూటీ సీఎం రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్సకు అధిష్టానం పిలుపు
 12: కాంగ్రెస్ పార్టీ కోర్‌కమిటీ సమావేశానికి హాజరైన సీఎం కిరణ్, డిప్యూటీ సీఎం రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స. అధిష్టానం పెద్దలకు వారివారి అభిప్రాయాల వెల్లడి.
 ూ  కోర్ కమిటీ సమావేశ అనంతరం ‘తెలంగాణ అంశంపై సంప్రదింపుల ప్రక్రియ ముగిసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం’ అని దిగ్విజయ్‌సింగ్ ప్రకటించారు.
 23: తెలంగాణ అంశంపై చర్చించేందుకు సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడిని 26వ తేదీన మరోసారి ఢిల్లీ రావాల్సిందిగా అధిష్టానం పిలుపు
 26: ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వార్‌రూం చర్చల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు. చర్చల అనంతరం పార్టీ కోర్ కమిటీ సమావేశమై తెలంగాణ అంశంపై చర్చ..
 ూ  కోర్ కమిటీ సమావేశం అనంతరం దిగ్విజయ్‌సింగ్ విలేకరులతో మాట్లాడుతూ ‘తెలంగాణ అంశంపై సంప్రదింపుల ప్రక్రియ ముగిసింది. కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూద్దాం’ అని వెల్లడించారు.
 29:  యూపీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాలను 30వ తేదీన నిర్వహించాలని నిర్ణయం. ఢిల్లీ రావాల్సిందిగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడికి పిలుపు
 30: ఢిల్లీలో సాయంత్రం నాలుగున్నర గంటలకు సమావేశమైన యూపీఏ మిత్రపక్షాలు.. 50 నిమిషాల పాటు కొనసాగిన సమావేశం. అనంతరం ఐదున్నర గంటలకు సీడబ్ల్యూసీ భేటీ.
 ూ  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము సిద్ధమేనని కాంగ్రెస్ ప్రకటన
 ూ  పది జిల్లాలతో కూడిన తెలంగాణను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్, కేంద్ర మంత్రి అజయ్ మాకెన్ వెల్లడి.
టాగ్లు: ప్రత్యేక తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, కేంద్రం ప్రకటన, తెలంగాణ జేఏసీ చైర్మన్‌గా కోదండరాం,

కృష్ణా ప్రాజెక్టులు ప్రశ్నార్థకం


Updated: July 31, 2013 06:00 (IST)
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ ఖాయమైన నేపథ్యంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపు కీలకంగా మారనుంది. గోదావరిపై చేపట్టిన ప్రాజెక్టులకు అంత సమస్య లేకున్నా.. కృష్ణా బేసిన్‌లో చేపట్టిన ప్రాజెక్టులకు నీటిని కేటాయించడం అంత సులువైన విషయం కాదు. గోదావరిలో నీటి లభ్యత ఎక్కువగా ఉండడంతో ఎలాంటి ఇబ్బంది కనిపించడం లేదు. అయితే కృష్ణా నది విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ నది నీటిపై ఆధార పడ్డ ప్రాంతాలు ఎక్కువగా ఉండడం, నీటి లభ్యత తక్కువగా ఉండడం, ఎగువ రాష్ర్టంలో భారీ ప్రాజెక్టులు ఉండడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. దీంతో మిగులు, వరద జలాలపై ఆధారపడి ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

 
ఇందులో కొన్ని తెలంగాణ ప్రాజెక్టులు ఉండగా, మరికొన్ని ప్రాజెక్టులు రాయలసీమ ప్రాంతానికి నీటిని అందించేవి ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు అధికారిక (ట్రిబ్యునల్ అవార్డు) నీటి కేటాయింపులు లేకపోవడంతో రాష్ట్ర విభజన ప్రక్రియలో వీటి భవిష్యత్తుపై చర్చించే అవకాశం ఉంది. ఇలాంటి ప్రాజెక్టుల అవసరాలు తీరాలంటే 227 టీఎంసీల నీరు అవసరం ఉంది. అయితే కృష్ణాలో మనకు కేటాయించిన 811 టీఎంసీల నీరు గతంలో ఉన్న ప్రాజెక్టులకే సరిపోతోంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రాజెక్టులు వరద లేదా మిగులు జలాలపై ఆధారపడి నిర్మిస్తున్నవి కావడంతో నీటి పంపకం విషయం కొంత సున్నితంగా ఉండనుంది.

 రాయలసీమ ప్రాంత ప్రాజెక్టులు...
 తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 6 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం 59 టీఎంసీల నీరు అవసరం. అయితే ఇందులో 29 టీఎంసీల నీటిని కృష్ణా నది మిగులు జలాల నుంచి మరో 30 టీఎంసీలను పెన్నా నది మిగులు జలాల నుంచి ఉపయోగించాలని నిర్ణయించారు. అయితే ఈ తాజా పరిణామంతో పెన్నా నుంచి నీటిని తీసుకోవడం ఇబ్బంది లేకపోయినా...కృష్ణా నుంచి నీటి వాడకానికి మాత్రం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. వెలిగొండ ప్రాజెక్టు పరిస్థితీ అంతే. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 4.38 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉంది.

 ఇందుకు అవసరం అయ్యే 43.50 టీఎంసీల నీటిని కృష్ణా నది మిగులు జలాల నుంచే ఉపయోగించుకోవాల్సి ఉంది. హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లోని 6.11 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది. దీనికి అవసరం అయ్యే 40 టీఎంసీల నీటిని కృష్ణా వరద నీటి నుంచి ఇవ్వాలని నిర్ణయించారు. ఇక గాలేరు-నగరి ప్రాజెక్టు ద్వారా కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 2.60 లక్షల ఎకరాలకు నీటిని అందించాల్సి ఉంది. ఇందుకోసం 38 టీఎంసీలను కృష్ణా వరద నీటిని ఉపయోగించుకోవాల్సి ఉంది.

 తెలంగాణలోని ప్రాజెక్టులు...
 ఎస్‌ఎల్‌బీసీ ద్వారా నల్లగొండలోని 3.70 లక్షల ఎకరాల పంటలకు సాగునీటిని అందించాలి. ఇందుకు అవసరం అయిన 30 టీఎంసీలను కృష్ణా వరద నీటి నుంచి ఉపయోగించుకోవాల్సి ఉంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలోని 3.40 లక్షల ఎకరాలకు నీటిని అందించాలి. ఇందుకు అవసరం అయిన 25 టీఎంసీలకు కృష్ణా నది వరద నీరే శరణ్యం. ఇదే జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే నెట్టెంపాడు ప్రాజెక్టు కూడా కృష్ణా వరద నీటిపై ఆధారపడ్డదే. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 20 టీఎంసీల నీరు అవసరం.