- ఎంపీలకు పచ్చరంగు బ్యాలెట్ పేపర్
- ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలెట్ పేపర్
- మొత్తం ఓట్లు - 4896
- ఎంపీల ఓట్లు- 776
- ఎమ్మెల్యేల ఓట్లు - 4120
- మొత్తం ఓట్ల విలువ - 10,98,882
- ఎంపీల ఓట్ల విలువ - 5,49,408
- ఎమ్మెల్యేల ఓట్ల విలువ - 5,49,474
- గెలుపునకు కావాల్సిన ఓట్ల విలువ - 5,49,442
- ఎంపీ ఓటు విలువ - 708 ఓట్లు
- రాష్ట్రపతిని ఎన్నుకోనున్న ఎలక్టోరల్ కాలేజీ
- ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు
- ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం సభ్యులు 4896
- ఎంపీలకు, ఎమ్మెల్యేలకు వేర్వేరు ఓటు విలువ
- రాష్ట్ర జనాభాను బట్టి ఎమ్మెల్యేల ఓటు విలువ
- 1971 జనాభా లెక్కల ప్రకారం విలువ నిర్ణయం
- 1971లో ఆంధ్రప్రదేశ్ జనాభా 4 కోట్ల 35 లక్షలు
- ప్రస్తుతం ఏపీ ఎమ్మెల్యే ఓటు విలువ 148
- ఎమ్మెల్యేల ఓటు విలువను ఎంపీల సంఖ్యతో భాగించాలి
- ప్రస్తుతం ఒక్కో ఎంపీ ఓటు విలువ 708
- అందరి ఓట్ల విలువ 10లక్షల 98వుల 882
భారత రాష్ట్రపతి ఎన్నిక విధానం కొంచెం సంక్లిష్టంగా ఉన్నా.. భారత రాజ్యాంగంలో మాత్రం దానికి సంబంధించి అన్ని వివరాలు చాలా కూలంకుషంగా పొందుపరిచారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 54 ప్రకారం దేశ రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఎలక్ట్రోరల్ కాలేజీలో.. ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు, రాష్ట్రాల ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారు. దీని ప్రకారం పార్లమెంటు ఉభయసభల్లోని 772 సభ్యులతో పాటు, దేశంలోని అన్ని రాష్ట్రాల శాసన సభల్లో ఉన్న 4,123 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొంటారు. అంటే దేశం మొత్తం మీద 4896 మంది సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. అయితే లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్ర విధాన సభల్లో ఎన్నికైన సభ్యులు మాత్రమే రాష్ట్రపతి ఓటింగ్‌లో పాల్గొనేందుకు అర్హత కలిగి ఉంటారు.అయితే రాష్ట్రపతి ఎన్నిక విధానంలో ఎంపీకి, ఎమ్మెల్యేకి వేరువేరు ఓటు విలువ ఉంటుంది. 1971 జనాభా లెక్కల ప్రకారం ఆయా రాష్ట్రాల జనాభాను బట్టి.. ఎమ్మెల్యేల ఓటు విలువను నిర్ణయిస్తారు. ఉదాహరణకు 1971లో ఆంధ్ర ప్రదేశ్ జనాభా సుమారు 4కోట్ల 35 లక్షలు. దీన్ని రాష్ట్ర అసెంబ్లీలోని స్థానాలతో భాగించి ఓటు విలువను నిర్ణయిస్తారు. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 294. దీన్ని రాష్ట్ర జనాభాతో భాగించగా వచ్చే విలువను తిరిగి 100తో భాగించాలి. దీని ప్రకారం మన రాష్ట్ర ఎమ్మెల్యే ఓటు విలువ 148. ఈ లెక్కన 208 ఓట్లతో ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యేల విలువ అత్యధికంగా ఉండగా... 7 ఓట్లతో సిక్కిం ఎమ్మెల్యేల విలువ అతితక్కువగా ఉంది.
ఇక దేశంలోని మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువను, మొత్తం ఎంపీల సంఖ్యతో భాగిస్తే.. వచ్చే ఫలితాన్ని ఒక ఎంపీ ఓటు విలువగా నిర్ణయించారు. ఒక్కో ఎంపీ ఓటు విలువను, మెత్తం ఎంపీల సంఖ్యతో భాగిస్తే వచ్చే ఫలితమే ఎంపీల ఓటు విలువ. దీని ప్రకారం ప్రస్తుతం ఎంపీల ఓటు విలువ 708గా ఉంది. ఈ లెక్కన మొత్తం ఎమ్మెల్యేలు, మొత్తం ఎంపీల ఓట్ల విలువ 10 లక్షల 98వేల 882గా నిర్ణయించారు. ఈ మొత్తం ఓట్లలో సగానికన్నా ఎక్కువ వచ్చిన వారిని రాష్ట్రపతిగా ఎన్నుకుంటారు. వాయిస్‌ః ఇక రాష్ట్రపతి ఎన్నికలో ప్రాధాన్యతా ఓటు పద్దతిని ఉపయోగిస్తారు. దీని ప్రకారం ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థి పేరు ముందు వాళ్ళు ఇవ్వాలనుకున్న ప్రాధాన్యతను అంకెల్లో స్పష్టంగా సూచించాల్సి ఉంటుంది. ఏ అభ్యర్థికి ఎక్కువ మొదటి ప్రాధాన్యతా ఓట్లు వస్తే వారు విజేతగా నిలుస్తారు. ఒకవేళ ఇద్దరికీ సమాన ప్రాధాన్యతా ఓట్లు వస్తే.. రెండవ ప్రాధాన్యత ఓట్లు ఎక్కువగా వచ్చినవారిని పరిగణలోనికి తీసుకొని విజేతను నిర్ణయిస్తారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి