6, జులై 2012, శుక్రవారం

ఆదాయానికి మంచి ఆస్తుల కేసులో మాయావతికి క్లీన్‌చిట్


శుక్రవారం, 6 జులై 2012( 11:36 IST )
Webdunia
mayawati

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి సుప్రీంకోర్టు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. మాయావతికి వ్యతిరేకంగా సీబీఐ మోపిన అభియోగాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపలేదని, అందువల్ల ఈ కేసును ఆమెపై సీబీఐ విచారణ జరపాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం తేల్చి చెప్పింది.

2003లో కోటి రూపాయల ఉన్న ఆమె ఆస్తి 2007 నాటికి 50 కోట్ల రూపాయలకు చేరుకోవటంతో సీబీఐ విచారణ చేపట్టింది. అయితే, తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తన అభిమానులు, కార్యకర్తలు ఇచ్చిన విరాళాలని ఆమె వాదించారు. దీనిపై సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది.

మాయావతిపై సీబీఐ చేసిన అభియోగాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారని వ్యాఖ్యానించింది. అటు ఇన్‌కం టాక్స్‌ ట్రిబ్యునల్‌ కూడా ఆమెకు గతంలో క్లీన్‌ చిట్‌ ఇచ్చిన విషయం తెల్సిందే. సీబీఐ విచారణను సవాల్ చేస్తూ మే 2008 సంవత్సరంలో మాయావతి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

కేవల రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై ఈ తరహా అభియోగాలు నమోదు చేసినట్టు ఆమె తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం విచారించి తీర్పునిచ్చింది. కాగా, తొమ్మిదేళ్ల తర్వాత మాయాకు క్లీన్ చిట్ రావడం పట్ల బీఎస్పీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి