30, జులై 2012, సోమవారం

తెలకపల్లి రవి: రాజకీయ అనిశ్చితి-ప్రాంతాల పల్లవులు!

తెలకపల్లి రవి: రాజకీయ అనిశ్చితి-ప్రాంతాల పల్లవులు!: రాష్ట్రాన్ని విభజించదలిస్తే ముందు రాయలసీమ నాలుగు జిల్లాలను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని తెలుగు దేశం ఫ్రధాన కార్యదర్శి హ...

The scientific explanation for visiting Temples regularly



Generally, vedic temples are located in a place
where earth's magnetic waves pass through.

In simple terms, these temples are located
strategically at a place where the positive
energy is abundantly available from the magnetic wave
distribution of north/ south pole thrusts.
The Main Idol is placed in the center,
where high magnetic values are available.
A copper plate with some Vedic scripts is buried,
beneath the Main Idol. This place is known as
"Garbhagriha" or Moolasthan.

The copper plate absorbs the earths magnetic waves
and radiates them to the surroundings.

Thus a person making clockwise pradakshina of
the Main Idol's placement, automatically receives
the beamed magnetic waves .

Regular visits make him absorb more positive energy.

The Sanctum Sanctorum is completely enclosed on three sides.
The effect of all energies is very high in here.

The lamp that is lit radiates the heat and light energy.
The ringing of the bells and the chanting of prayers
gives sound energy.

The fragrance from the flowers, the burning of camphor
give out chemical energy.

The effect of all these energies comes out of the idol.

This is in addition to the north/south pole magnetic energy
that is absorbed by the copper plate and utensils that are
kept in the Moolasthan.
The water used for the Pooja is mixed with Cardamom,
Benzoine, Holy Basil (Tulsi), Clove, etc is the "Theertham".

This water becomes more energized because it receives
all these combined energies .

The water that is sprinkled onto the people passes
on the energy to all. That is the reason why, men should
not wear shirts to the temple and ladies should wear more
ornaments because it is through these jewels (metal) that
positive energy is absorbed by ladies.

It is proved that Theertham is a very good blood purifier,
as it is highly energized.
In addition, temples offer holy water (about three spoons).
This water is mainly a source of magneto therapy as they place
the copper water vessel at the Garbhagriha.

It also contains cardamom, clove, saffron, etc to add taste
and Tulsi (holy Basil) leaves are put into the water to increase
its medicinal value!

The clove essence protects one from tooth decay,
the saffron & Tulsi leave essence protects one
from common cold and cough, cardamom and benzoine
known as Pachha Karpuram,acts as a mouth refreshing agents.

This way, one's health too is protected, by regularly visiting Temples !



19, జులై 2012, గురువారం

Google+ Guide for New Google+ Users

How +Google has changed the World of Networks with the launch of their Most Powerful Weapon, +Google+;
To inaugurate a Global War among Networks.


■ Google is ALL-IN-ONE : Web Search, Gmail, Maps, Calendar, Documents, Reader etc.
■ Google is integrating Google+ appearance in all their other services.
■ You can edit my post after you post it.
■ You can format my post with BOLD, Italic & Strikethrough.
■ The character support is greater (ex:Twitter has 140 characters per post)
■ You can use Google+ for Blogging
■ You can MUTE notifications of any activity that you comment, a photo, a status, etc.
■ You can restrict re-sharing and restrict comments too.
■ You can share posts, pics, links with limited friends/people or PUBLIC
■ You can control the volume of posts of each circle that appear in my STREAM.
■ Public posts appear in Google Search
■ Hashtags [ #hashtags] help me Search faster with Trending Tags
■ Google+ Profile - Larger space to introduce to the World 'Who You Are'
■ Google+ Profile - Five custom scrapbook photos
■ Google+ Profile - 200 x 200 Profile Picture (Need to Improve) [+Frances Haugen]
■ Google+ Profile - You can know what you have +1'd on the internet.
[The Google+ Brand Pages that you +1 also appear in the +1's of your Profile]
■ +1's integrated on Google Image Search
■ You can set my email, profile, page, etc. to be VERIFIED (So, everyone know its really YOU)
■ Separate stream for different circles
■ You can use Google+ Circles to save bookmarks
[To read posts/articles later, you can create an empty circle and share it with that Circle]
[for this, you can create an empty circle and share ti with that circle ONLY.]
■ You can share circles with anyone you want to.
■ Circle Management - Hoping to see MORE FEATURES Soon..... :)
■ Google+ Chat enables to chat with Mutual Friends in Circles, on all Google Services.
■ Google+ Chat: I can customize which people can chat with me.
[Set Privacy Settings of your Chat to set who is able to chat with you]
■ Google+ Photos - Lightbox with black background [+Amir Fish]
■ Google+ Photos - Easy photo tagging
■ Google+ Photos - You can allow to Download my photos
■ Inbuilt photo editing tools using a Creative Kit Built-in with Picasa.
■ Instant Upload Pics from Mobile Phone (Android)
■ Google Hangout - Group Video Calling (max.10 including yourself)
[The most frequently hanging out person in my circles: +Bobbi Jo Woods]
[Public Hangouts also have the limit of 9, but others who join could watch it live, but cannot participate]
■ Google Hangout with Extras: Screen Sharing, Document sharing, Named Hangout, etc.
■ Google Sparks (Interests, Hobbies, etc.)
■ Google Brand Pages (SEO integrated)
■ Google Games (I ❤ Angry Birds) More to Come............
■ Google Ripples - Know how your Public posts are shared on Google+
■ Google+ Direct Connect - Search for Page and automatically add to Circles.
■ 'What's Hot' Section in the stream - Has the hottest/coolest posts all-over Google+
■ Google+ Search is 'Searching Everything' with filters.
■ Google+ Search filters - People, Posts, Pages, Sparks, Posts from Circles, Public Posts, etc.
■ Google+ Search also provides web results.
■ Google+ Search is also integrated with TRENDING TOPICS, and HASHTAGS
■ Google+ Search now features live hangouts.
■ In Google+ noone can restrict anyone from adding them to circles.
■ YouTube Integrated Stream - I can listen to any music on YouTube while on Google+
■ The development team members are available to help at any instance [Community Managers +Natalie Villalobos & +Louis Gray ]
■ You get to know NEW UPDATES of Google+ as and when it breaks.... [+Denis Labelle, +Vic Gundotra, +Natalie Villalobos, +Pete Cashmore - +Mashable]
■ A Clean and Neat G+ Stream
■ No Advertisements (YET.... :P)
■ Keyboard Shortcuts to browse through Google+ easily:
"/" to Search,
"J/K" to toggle up/down posts,
to scroll down,
Shift+Space to go up the stream,
to Comment,
TAB, then ENTER to submit comment after posting.

■ Google owns Google Chrome, the most popular web browser. [+Melissa Daniels]
■ Google Chrome Extensions : +1 button, Notifications wherever I go with my Browser.
■ Google Music - ♬ My Online Music Library ♫
■ Google Music - ♫ You can share my music on Google+
■ Google is the owner of +Android, the world's mostly used Mobile phone OS
■ Google is the social network of the No.1 Search Giant in the world (Google)
■ Google is the owner of the Second largest search engine - +YouTube
■ Google owns about 23% of the web browser market.
■ Getting to know News around the world.
[By following news providers like +CNN International]
■ The whole world in one web page.
■ You can Follow & Subscribe to any type of posts/people that I am interested in.
■ Nobody can CONSIDER HE/SHE is alone (Facebook is really boring, and everybody has the same routine on Facebook)
■ NO PORNOGRAPHY
■ LESS SPAM [+Matt Cutts]
■ NO Fake Profiles (much)
■ Reports, Feedback, Suggestions are GREATLY considered.................

జగన్ అడ్డంగా దొరికిపోయారా?, బాబు గట్టున పడినా...

జగన్ అడ్డంగా దొరికిపోయారా?, బాబు గట్టున పడినా...

గురువారం, జూలై 19, 2012, 10:48 [IST]
 Is Jagan Crisis With Voting Pranab


హైదరాబాద్: రాష్ట్రపతి రేసులో యుపిఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన ప్రణబ్ ముఖర్జీకి ఓటేయాలనే నిర్ణయం ద్వారా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారా అంటే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు అవుననే అంటున్నారు. తనపై, తన పార్టీపై కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై వేధిస్తున్నాయని ఆరోపణలు చేసిన వైయస్ జగన్ అండ్ కో ఇప్పుడు ప్రణబ్‌కు మద్దతివ్వడం ద్వారా టిడిపి చేతికి ఓ ఆయుధాన్ని ఇచ్చారంటున్నారు.
ప్రణబ్‌కు మద్దతివ్వాలనే జగన్ పార్టీ నిర్ణయాన్ని అటు టిడిపి, ఇటు టిఆర్ఎస్‌లు ప్రశ్నిస్తున్నాయి. జగన్‌కు బెయిల్ తెప్పించుకునేందుకే యుపిఏ అభ్యర్థికి ఆ పార్టీ ఓటేస్తుందని వారు ఆరోపిస్తున్నారు. ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రణబ్‌కు ఓటు.. జగన్‌కు బెయిల్ అని ఒప్పందం కుదుర్చుకొని వచ్చారని టిడిపి, టిఆర్ఎస్ నేతలు ఘాటుగా ఆరోపణలు చేస్తున్నారు.
రాష్ట్రపతి ఎన్నికలకు రాజకీయాలకు సంబంధం లేకపోయినప్పటికీ, ఇటీవలి కాలంలో జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికలను తరచి చూస్తే రాజకీయ కోణంలోనే జరుగుతున్నాయని చెప్పవచ్చు. దీంతో ప్రణబ్‌కు మద్దతుపై జగన్‌ను నిలదీస్తున్నారు. టిడిపి, కాంగ్రెసులు కుమ్మక్కయ్యాయన్న జగన్ ప్రణబ్‌కు మద్దతు ప్రకటించడం ద్వారానే ప్రశ్నించేందుకు టిడిపికి అవకాశమివ్వగా, ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యలు మరింత ఆస్కారమిచ్చాయనే చెప్పవచ్చు.
జగన్‌ను వేధిస్తోందన్న కాంగ్రెసు అభ్యర్థికి ఎలా మద్దతిస్తారని ప్రశ్నించగా.. జగన్ ఆస్తుల కేసు కోర్టు పరిధిలో ఉందని, ఈ విషయంలో అధిష్టానం ప్రమేయం ఉంటుందని తాము భావించడం లేదని చెప్పారు. నిన్నటి వరకు అధిష్టానం సూచనల మేరకే సిబిఐ పని చేస్తోందని కాంగ్రెసును ధనుమాడిన వైయస్సార్ కాంగ్రెసు ఇప్పుడు ఒక్కసారిగా అధిష్టానం ప్రమేయ ఉంటుందని తాము భావించడం లేదని చెప్పడం చర్చనీయాంశమైంది.
వైయస్సార్ కాంగ్రెసులో ఎందుకు మార్పు వచ్చిందని టిడిపి ప్రశ్నిస్తోంది. తెలంగాణ ప్రజల మనోభావాలు గౌరవిస్తామని చెప్పిన జగన్ తెలంగాణ వ్యతిరేకి యుపిఏ అభ్యర్థికి ఎందుకు ఓటు వేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రశ్నిస్తోంది. ఇరు పార్టీలు కూడా విజయమ్మ ఢిల్లీకి వెళ్లి ఒప్పందం కుదుర్చుకున్నారని, అందులో భాగంగానే దాదాకు మద్దతిస్తున్నారని, త్వరలో జగన్ కూడా బెయిల్ పైన విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ప్రణబ్‌కు మద్దతు ప్రకటించడం ద్వారా జగన్ పార్టీ ఇబ్బందుల్లో పడగా, దూరంగా ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీ గట్టున పడిందని చెప్పవచ్చు. కాంగ్రెసు, టిడిపి కుమ్మక్కయ్యాయన్న జగన్ పార్టీ ఆరోపణలు టిడిపిని ఉప ఎన్నికలలో ఘోరంగా దెబ్బతీశాయి. రాష్ట్రపతి ఎన్నికలలో ప్రణబ్‌కు మద్దతు ఇవ్వక పోవడంతో కుమ్మక్కు తలనొప్పి బాబుకు దూరమైంది. ఇప్పుడు అది జగన్ వంతు. అయితే ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్లు ఓటు వేయక పోవడం సరికాదనే విమర్శ మాత్రం టిడిపి ఎదుర్కొంటుంది.

రాష్ట్రపతి ఎన్నికలు ఓటు విలువ

  • ఎంపీలకు పచ్చరంగు బ్యాలెట్‌ పేపర్‌
  • ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలెట్‌ పేపర్‌
  • మొత్తం ఓట్లు  - 4896
  • ఎంపీల ఓట్లు- 776
  • ఎమ్మెల్యేల ఓట్లు - 4120
  • మొత్తం ఓట్ల విలువ - 10,98,882
  • ఎంపీల ఓట్ల విలువ - 5,49,408
  • ఎమ్మెల్యేల ఓట్ల విలువ - 5,49,474
  • గెలుపునకు కావాల్సిన ఓట్ల విలువ - 5,49,442
  • ఎంపీ ఓటు విలువ - 708 ఓట్లు
  • రాష్ట్రపతిని ఎన్నుకోనున్న ఎలక్టోరల్‌ కాలేజీ
  • ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు
  • ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం సభ్యులు 4896
  • ఎంపీలకు, ఎమ్మెల్యేలకు వేర్వేరు ఓటు విలువ
  • రాష్ట్ర జనాభాను బట్టి ఎమ్మెల్యేల ఓటు విలువ
  • 1971 జనాభా లెక్కల ప్రకారం విలువ నిర్ణయం
  • 1971లో ఆంధ్రప్రదేశ్ జనాభా 4 కోట్ల 35 లక్షలు
  • ప్రస్తుతం ఏపీ ఎమ్మెల్యే ఓటు విలువ 148
  • ఎమ్మెల్యేల ఓటు విలువను ఎంపీల సంఖ్యతో భాగించాలి
  • ప్రస్తుతం ఒక్కో ఎంపీ ఓటు విలువ 708
  • అందరి ఓట్ల విలువ 10లక్షల 98వుల 882
రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌ మిగతా ఎన్నికల కన్నా భిన్నంగా ఉంటుంది. ఒక ప్రత్యేకమైన పద్దతితో రాష్ట్రపతి ఎన్నిక జరగనుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఇంతకీ రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు. ఎలక్టోరల్ కాలేజీ అంటే ఏమిటి?  ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటు విలువను ఎలా నిర్ణయిస్తారు..? వీటన్నింటికీ సమాధానాలు తెలవాలంటే వాచ్‌ దిస్‌ స్టోరీ..

భారత రాష్ట్రపతి ఎన్నిక విధానం కొంచెం సంక్లిష్టంగా ఉన్నా.. భారత రాజ్యాంగంలో మాత్రం దానికి సంబంధించి అన్ని వివరాలు చాలా  కూలంకుషంగా పొందుపరిచారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 54 ప్రకారం దేశ రాష్ట్రపతిని ఎలక్టోరల్‌ కాలేజీ ఎన్నుకుంటుంది. ఎలక్ట్రోరల్ కాలేజీలో..  ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు, రాష్ట్రాల ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారు. దీని ప్రకారం పార్లమెంటు ఉభయసభల్లోని 772 సభ్యులతో పాటు, దేశంలోని  అన్ని రాష్ట్రాల శాసన సభల్లో ఉన్న 4,123 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్‌లో పాల్గొంటారు. అంటే దేశం  మొత్తం మీద 4896 మంది సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. అయితే లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్ర విధాన సభల్లో ఎన్నికైన సభ్యులు మాత్రమే రాష్ట్రపతి ఓటింగ్‌లో పాల్గొనేందుకు అర్హత కలిగి ఉంటారు.అయితే రాష్ట్రపతి ఎన్నిక విధానంలో ఎంపీకి, ఎమ్మెల్యేకి వేరువేరు ఓటు విలువ ఉంటుంది. 1971 జనాభా లెక్కల ప్రకారం ఆయా రాష్ట్రాల  జనాభాను బట్టి.. ఎమ్మెల్యేల ఓటు విలువను నిర్ణయిస్తారు. ఉదాహరణకు 1971లో ఆంధ్ర ప్రదేశ్ జనాభా సుమారు 4కోట్ల 35 లక్షలు. దీన్ని రాష్ట్ర అసెంబ్లీలోని స్థానాలతో భాగించి ఓటు విలువను నిర్ణయిస్తారు. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 294. దీన్ని రాష్ట్ర జనాభాతో భాగించగా వచ్చే విలువను తిరిగి 100తో భాగించాలి. దీని ప్రకారం మన రాష్ట్ర ఎమ్మెల్యే ఓటు విలువ 148. ఈ లెక్కన 208 ఓట్లతో ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యేల విలువ అత్యధికంగా ఉండగా... 7 ఓట్లతో సిక్కిం ఎమ్మెల్యేల విలువ అతితక్కువగా ఉంది.  

ఇక దేశంలోని మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువను, మొత్తం ఎంపీల సంఖ్యతో భాగిస్తే.. వచ్చే ఫలితాన్ని ఒక ఎంపీ ఓటు విలువగా నిర్ణయించారు. ఒక్కో ఎంపీ ఓటు విలువను, మెత్తం ఎంపీల సంఖ్యతో భాగిస్తే వచ్చే ఫలితమే ఎంపీల ఓటు విలువ. దీని ప్రకారం ప్రస్తుతం ఎంపీల ఓటు విలువ 708గా ఉంది. ఈ లెక్కన మొత్తం ఎమ్మెల్యేలు, మొత్తం ఎంపీల ఓట్ల విలువ 10 లక్షల 98వేల 882గా నిర్ణయించారు. ఈ మొత్తం ఓట్లలో సగానికన్నా ఎక్కువ వచ్చిన వారిని రాష్ట్రపతిగా ఎన్నుకుంటారు. వాయిస్‌ః ఇక రాష్ట్రపతి ఎన్నికలో ప్రాధాన్యతా  ఓటు పద్దతిని ఉపయోగిస్తారు. దీని ప్రకారం ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థి పేరు ముందు వాళ్ళు ఇవ్వాలనుకున్న ప్రాధాన్యతను అంకెల్లో స్పష్టంగా సూచించాల్సి ఉంటుంది. ఏ అభ్యర్థికి ఎక్కువ మొదటి ప్రాధాన్యతా ఓట్లు వస్తే వారు విజేతగా నిలుస్తారు. ఒకవేళ ఇద్దరికీ సమాన ప్రాధాన్యతా ఓట్లు వస్తే.. రెండవ ప్రాధాన్యత ఓట్లు ఎక్కువగా వచ్చినవారిని పరిగణలోనికి తీసుకొని విజేతను నిర్ణయిస్తారు.

18, జులై 2012, బుధవారం

కరెంటు కష్టాలకు రిలయన్సే కారణం?


Publish Date:Jul 14, 2012
ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం ఎదుర్కొంటున్న తీవ్రమైన విద్యుత్తు కోతలకు కారణం రిలయన్సే అని తెలిసింది. రిలయన్స్‌ సంస్థ మన రాష్ట్రంలోని గ్యాస్‌ అథారిత విద్యుత్తు కేంద్రాలకు ఒప్పందాల మేరకు చేయాల్సిన గ్యాస్‌ను సరఫరా చేయలేకపోవటంతో మనకు ఈ దుస్థితి ఏర్పడిరది. రిలయన్స్‌ సంస్థ కృష్ణా`గోదావరి బేసిన్‌ నుంచి పెద్ద ఎత్తున సహజవాయువును పైపు మార్గాల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలించుకుపోతోంది. కేజీ బేసిన్‌ ద్వారా ధీరూభాయిఅంబానీ (డి`6) బావుల నుంచి రోజుకు 13.65 మిలియన్‌ మెట్రిక్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల (ఎన్‌ఎంఎస్‌సిఎండి) గ్యాస్‌ను సరఫరా చేయాల్సి ఉండగా, రిలయన్స్‌ మాత్రం రోజుకు 6 ఎన్‌ఎంఎస్‌సిఎండి గ్యాస్‌ మాత్రమే సరఫరా చేస్తోంది. డి`6 గ్యాస్‌ ఉత్పత్తి తగ్గిపోవటం వల్లే తాము రాష్ట్రంలోని విద్యుత్తు కేంద్రాలకు తగినంత గ్యాస్‌ను సరఫరా చేయలేకపోతున్నామని రిలయన్స్‌ బుకాయిస్తోంది.



అయితే ఈ సహజవాయువు క్షేత్రాలు ఆంథ్రా తీరప్రాంతంలో ఉన్నందున మిగిలిన బావుల నుంచి ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌ను కూడా మన విద్యుత్తు కేంద్రాలకు సరఫరా చేయవచ్చు. కానీ, రిలయన్స్‌ అలా చేయకుండా డి`6బావుల నుంచి వచ్చే గ్యాస్‌ను మాత్రమే ఇస్తామంటోంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. రాష్ట్రప్రభుత్వానికి రిలయన్స్‌కు మధ్యన ఉన్న అవగాహన ప్రకారం కేజీ బేసిన్‌ నుంచి సరఫరా అయ్యే గ్యాస్‌లో 13.65 ఎన్‌ఎంఎస్‌సిఎండి గ్యాస్‌ను మన విద్యుత్తు కేంద్రాలకు అందజేయాలి. అంతేకానీ, కేవలం డి`6 బావుల నుంచి వచ్చే గ్యాస్‌ను మాత్రమే సరఫరా చేయాలన్న నిబంధనలేవీ లేవు. కానీ, ఈ బావిలో ఉత్పత్తి తగ్గిపోయినందున ఆంధ్రాకు సహజవాయువు సరఫరాను తగ్గించాల్సి వచ్చిందని రిలయన్స్‌ అంటోంది. ఇక్కడ మరోవాదన కూడా వినిపిస్తోంది. రిలయన్స్‌ సంస్థ కావాలనే గ్యాస్‌ ఉత్పత్తిని తగ్గించిందని, గ్యాస్‌రేట్లను పెంచేందుకే ఆ సంస్థ ఇటువంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతోందని విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా రిలయన్స్‌ చర్యల వల్ల రోజుకు సుమారు 1500 మెగావాట్ల విద్యుత్తుఉత్పత్తి లోటు ఏర్పడిరది. సహజవాయువు సరఫరాను పెంచాలని స్వయాన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్రప్రభుత్వాన్ని కోరినప్పటికీ, ఇప్పటి వరకూ ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు.

ప్రేమ వద్దు! బైటికే రావద్దు!! మహిళలకు యు.పి పంచాయితీ ఫత్వా


ప్రేమ పెళ్ళిళ్ళు నిషేధిస్తూ ఉత్తర ప్రదేశ్ లోని భాగ్ పట్ జిల్లా అసారా గ్రామ పంచాయితీ ఫత్వా జారీ చేసింది. 40 యేళ్ళ లోపు మహిళలు ఒంటరిగా మార్కెట్ కి కూడా వెళ్లరాదంటూ నిషేధం విధించింది. ఆడ పిల్లలు రోడ్లపైన మొబైల్ ఫోన్లు ఉపయోగించకూడాన్నీ నిషేధించింది. ఆనక తమది ఫత్వా కాదని 36 కులాల వాళ్ళం కూర్చుని చర్చించి తీసుకున్న నిర్ణయమని పంచాయితీ పెద్దలు తమ రూలింగ్ ని సమర్ధించుకున్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ భాగ్ పట్ జిల్లా అధికారులనుండి ఈ రూలింగ్ పై నివేదిక కోరగా హోమ్ మంత్రి చిదంబరం ఫత్వాలు చెల్లవని ప్రకటించాడు.
జులై 11 న జరిగిన పంచాయితీ సమావేశంలో ఈ ఉత్తర్వులు ఆమోదించినట్లు ‘ది హిందూ’ తెలిపింది. కులాంతర వివాహం చేసుకున్న యువతీ, యువకులను పరువు పేరుతో హత్యలు చేయిస్తున్న ఖాఫ్ పంచాయితీలు అధికారికంగా, వ్యవస్ధాగతంగా పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నట్లు తాజా పరిణామం ద్వారా స్పష్టం అవుతోంది. మహిళల ప్రజాస్వామిక భావనలు భరించలేని స్ధితిలో ఉంటూ వారిపై అణచివేతను కొనసాగించడానికి మరిన్ని మార్గాలు వెతుకుతున్నట్లు స్పష్టం అవుతోంది.
అసారా గ్రామ పంచాయితీ ఉత్తర్వులపై తక్షణం నివేదిక ఇవ్వాలని యు.పి రాష్ట్ర మహిళా కమిషన్ భాగ్ పట్ జిల్లా మేజిస్ట్రేటు ను కోరింది. ప్రేమ పెళ్లిళ్లపైనా, 40 సం.ల లోపు మహిళలు తోడు లేకుండా షాపింగ్ కి వెళ్లడం పైనా నిషేధం విధించడంతో పాటు మహిళలంతా ఇల్లు దాటి బైటికి వస్తే తలపై ముసుగు కప్పుకోవాలని కూడా అసరా పంచాయితీ ఆంక్షలు విధించింది. ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నవారు గ్రామంలో నివశించడానికి అనర్హులని ప్రకటించింది. పొద్దు కుంకాక 40 లోపు మహిళలు అసలు బైటికే రావద్దని పంచాయితీ పెద్దలు చెప్పినట్లు ఎన్.డి.టి.వి తెలిపింది.
నోరు మెదపని అజిత్, ఖండించిన చిదంబరం
మహిళలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన అసారా పంచాయితీ కేంద్ర విమానయాన మంత్రి అజిత్ సింగ్ నియోజకవర్గంలో ఉంది. అయితే పంచాయితీ ఉత్తర్వులపై వ్యాఖ్యానించడానికి అజిత్ సింగ్ రోజంతా నిరాకరిస్తూనే ఉన్నాడని ఎన్.డి.టి.వి తెలిపింది. బహుశా ఓట్లు పోతాయన్న భయం అజిత్ నోటిని మూసి ఉండవచ్చు.
అయితే యు.పి ఓటర్లతో పని లేని చిదంబరం మాత్రం పంచాయితీ ఉత్తర్వులను ఖండించాడు. ప్రజాస్వామిక వ్యవస్ధలో అలాంటి ఆంక్షలకు తావులేదని చెబుతూ వారి ఉత్తర్వులను ఉల్లంఘించినవారిపై పంచాయితీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరోధిస్తుందని తాను ఆశిస్తున్నానని తెలిపాడు. ఖాఫ్ పంచాయితీలు, ఫత్వా, డ్రస్ కోడ్స్ లాంటి పంచాయితీ ఉత్తర్వులకు ఎలాంటి చట్టపరమైన ఆమోదం లేదనీ ఆ మేరకు పోలీసులకు తగిన ఆదేశాలివ్వాలనీ ఆయన కోరాడు.
గ్రామస్ధుల మద్దతు
“ఈ నిర్ణయాన్ని మేము పూర్తిగా సమర్ధిస్తున్నాం. ఆడపిల్లలు ఒంటరిగా గ్రామంలో నడుస్తుంటే అనేక సమస్యలు తలేత్తుతాయి” అని ఒక గ్రామస్ధుడు వ్యాఖ్యానించినట్లు ఎన్.డి.టి.వి తెలిపింది. ఆడ పిల్లలు ఒంటరిగా నడుస్తున్నపుడు సమస్యలు సృష్టిస్తున్నవారిని వదిలేసి ఒంటరిగా నడవడాన్నే గ్రామస్ధులు తప్పు పడుతున్నారు. యువకులు కూడా ‘హేండ్స్-ఫ్రీ’ సౌకర్యం (చేతితో ఫోన్ పట్టుకోకుండా బ్లూ టూత్ సాయంతో మాట్లాడే సౌకర్యం) ఉన్న సెల్ ఫోన్లు వాడరాదని కూడా పంచాయితీ తీర్మానించిందని సదరు చానెల్ తెలిపింది.
పంచాయితీ నిర్వహించినవారిని అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించినపుడు గురువారం రాత్రి గ్రామంలో పెద్ద యుద్ధమే జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు పంచాయితీ సభ్యులను అరెస్టు చేసిన ఇద్దరు పోలీసులపై గ్రామస్ధులు దాడి చేసి కొట్టారు. పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు. జాతీయ రహదారిపై వాహనాలు అడ్డుకున్నారు. బస్సుల్లోకి జొరబడి ప్రయాణీకులపై చేయి చేసుకున్నారు. దానితో అరెస్టు చేసిన వారిని పోలీసులు విడుదల చేయక తప్పలేదు. భాగ్ పట్ పోలీసులు ఇపుడు 10 మంది గ్రామస్ధూలపై కేసులు నమోదు చేశారు.
గ్రామస్ధుల అభిప్రాయాలు
బ్రిటన్ పత్రిక ‘డెయిలీ మెయిల్’ అసారా గ్రామస్ధుల్లో కొందరి అభిప్రాయాలు సేకరించింది. ఆ పత్రిక ప్రకారం ఈ తీర్మానాలను పంచాయితీ ఫిబ్రవరి నెలలోనే ఆమోదించింది. అయితే వాటిని గ్రామస్ధులు పెద్దగా పట్టించుకోనట్లు అనుమానం కలగడంతో జులై 11 న సమావేశమై మరోసారి గుర్తు చేసింది. “మా ఆదేశాలను కొందరు అమ్మాయిలు వారి తల్లిదండ్రులు సీరియస్ గా తీసుకోవడం లేదని మేము గమనించాము. అందుకే బుధవారం సమావేశం జరిపి ఆదేశాలను ఉల్లంఘించినవారిని మొదట వెలి వేయాలని అనంతరం గ్రామ బహిష్కరణ విధించాలని నిర్ణయించాం. ఆదేశాలు పాటించేలా చేయడానికి ఇంకా ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్ధితి వస్తే అప్పుడు చూస్తాం” అని పంచాయితీ సభ్యుడయిన 50 యేళ్ళ మహమ్మద్ మోహ్కామ్ డెయిలీ మెయిల్ తో అన్నాడు. గ్రామంలో 70 శాతం ముస్లింలు కాగా 30 శాతం హిందువులని, హిందువుల్లో ఎక్కువమంది జాట్ లనీ పత్రిక తెలిపింది.
“అబ్బాయిలు కూడా ఇయర్ ఫోన్లు వాడరాదని మేము కోరుతున్నాం. ఎందుకంటే రోడ్లపైన హారన్ లను వారు వినకుండా యాక్సిడెంట్లు చేస్తున్నారు. గ్రామంలో మహిళలు తమ తలపై ముసుగు వేయాలి. గ్రామం దాటి వెళితే వారు ముసుగు తొలగించవచ్చు” అని మోహ్కామ్ తెలిపాడు. “ప్రేమ పెళ్ళిళ్ళు సమాజానికి అవమానం. అవి తల్లిదండ్రులకు, ముఖ్యంగా అమ్మాయి కుటుంబాలకి చాలా బాధాకరం.  ఎందుకంటే వారి తల్లిదండ్రుల గౌరవాన్ని భంగం కలిగిస్తాయి. ప్రేమ పెళ్లి చేసుకునేవారినెవరినీ గ్రామంలో ఉండనీయం” అని మరో పంచాయితీ సభ్యుడు సత్తార్ అహ్మద్ అన్నాడు. 40 యేళ్ళ మహిళలు మార్కెట్ కి వెళ్లకుండా నిషేధించడాన్ని సమర్ధిస్తూ “దానివల్ల నేరాలు జరుగుతాయి” అని ఆయన వ్యాఖ్యానించాడు. తలకు ముసుగువేసుకుంటే అమ్మాయిలకే భద్రత అనీ సమర్ధించాడు.
గ్రామంలోని హిందూ, ముస్లిం ప్రజల్లో అత్యధికులు పంచాయితీ ఫత్వాకు మద్దతు ఇచ్చారు. “మహిళలు వాటిని పాటించి తీరాల్సిందే” అని విజేందర్ కశ్యప్ అన్నాడు. “అమ్మాయిలు మొబైల్స్ ఉపయోగించకుండా పూర్తి నిషేధం విధిస్తే నేనింకా సంతోషించి ఉండేవాడిని” అని తరుణ్ చౌదరి వ్యాఖ్యానించాడు. మహిళలు కూడా ఫత్వాకు మద్దతు పలికారు. “వారు నిర్ణయించినవి అన్నీ అనుసరించవలసిందే. వాదప్రతివాదాలకు స్ధానం లేదు” అని 40 యేళ్ళ గీతా దేవీ వ్యాఖ్యానించింది.
23 యేళ్ళ నీతూ సింగ్ అభిప్రాయం కొంచెం తేడాగా ఉంది. భాగ్ పట్ లో ఎం.ఏ చదువుతున్న నీతూ ఇలా అన్నది. “గ్రామంలో మహిళలు తలకు ముసుగు వేయాలన్న ఆదేశాన్ని నేను అంగీకరిస్తాను. కానీ మా తల్లిదండ్రులతో సంబంధంలో ఉండాలంటే మొబైల్ ఫోన్ చాలా అవసరం కదా.” స్వంత అవసరం తనపై ఆంక్షను వ్యతిరేకించేలా చేసినప్పటికీ మహిళలపై ఉన్న  సామాజిక వివక్షపై అవగాహన లేకపోవడం వల్ల సదరు అణచివేతకు మద్దతు పలికేలా నీతూను ప్రోద్బలించింది.
మరో పంచాయితీ సభ్యుడయిన 62 యేళ్ళ ఇస్లాముద్దీన్ ఇలా అన్నాడు, “అపరిపక్వంగా (immature) ఉండే మా అమ్మాయిలు గానీ, చెల్లెళ్ళు గాని మొబైల్ ఫోన్ వాడరాదని మా అభిప్రాయం. ఎందుకంటే అనేక సమస్యలకు అది దారి తీస్తుంది. ఎం.ఎం.ఎస్ క్లిప్ లు తీయడానికి ఫోన్ లు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో తెలిసిందేకదా. ఏ తప్పులూ చేయకుండా వారిని నిరోధించాలని, చెడ్డవారి నుండి వారిని కాపాడాలనీ కోరుకుంటున్నాం” అని ఇస్లాముద్దీన్ అన్నాడు.
చట్టాల వైఫల్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. రక్షణ యంత్రాంగం పేరుతో నిర్మించిన వ్యవస్ధలన్నీ ప్రజలకు రక్షణ ఇవ్వడం కంటే పాలకులకు రక్షణ ఇవ్వడానికే సమయం అంతా గడిపేయడంతో చట్టాల గొప్ప ప్రజల వాకిటికి రావడం లేదు. ఆధునిక టెక్నాలజీ ద్వారా వచ్చిపడుతున్న నేరాలకు కూడా పంచాయితీలే రక్షణ కల్పించవలసి రావడాన్ని బట్టి పోలీసు వ్యవస్ధపై ప్రజలకి నమ్మకం లేదని గ్రహించవచ్చు. నిత్యావసర సరుకులను ప్రజలకు చేరవేయడంలో పూర్తిగా విఫలం అయిన పాలకులు రక్షణ ఇవ్వగలమన్న భరోసాను కూడా ప్రజలకు చేరవేయలేకపోయారు.
భారత దేశ గ్రామీణ వ్యవస్ధలో భూస్వామ్య అభివృద్ధి నిరోధక భావజాలం మహిళలపై అణచివేత కొనసాగిస్తున్నదనీ, తనపై రుద్దబడుతున్న దళారీ, సామ్రాజ్యవాద పెట్టుబడుల సామాజిక అనివార్యతలకు సైతం ప్రతిఘటన కొనసాగిస్తున్నదనీ, ఆ ప్రతిఘటనకు అంతిమంగా మహిళలు, దళితులు లాంటి బలహీన వర్గాల వారే బలవుతున్నారనీ అసారా పంచాయితీ ఉత్తర్వులు రుజువు చేస్తున్నాయి. ఆధిపత్య వ్యవస్ధల భావాజాలంలోతో అణచివేతకు గురవుతున్న వర్గాలు సైతం ఆమోదం ప్రకటించే వ్యవస్ధల సాధారణత్వాన్ని డెయిలీ మెయిల్ వెల్లడించిన గ్రామస్ధుల అభిప్రాయాలు తెలియజేస్తున్నాయి.

గూగుల్ నుండి యాహూ సీఈవోగా 'మారిసా మేయర్'




శాన్ ఫ్రాన్సికో, జులై 17: గూగుల్ మొట్టమొదటి మహిళా ఇంజనీర్ మారిసా మేయర్ యాహూ కొత్త ప్రెసిడెంట్, సీఈవోగా గూగుల్ టాప్ ఎగ్జిక్యూటివ్ నియమితులయ్యారు. ప్రస్తుతం యాహు తాత్కాలకి సిఈవోగా వ్యవహరిస్తున్న రాస్ లెవిన్సన్ స్దానంలో జులై 17 నుండి మారిసా మేయర్ బాధ్యతలను చేపట్టనున్నారు. గూగుల్, ఫేస్ బుక్ నుండి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న సందర్బంలో 37 సంవత్సరాల వయసు కలిగిన మారిసా మేయర్ నియామకం యాహూకి అన్ని విధాలా కలిసి వస్తుందని యాహూ భావిస్తుంది.

ఇక మారిసా మేయర్ విషయానికి వస్తే విస్కాన్సిన్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిగా ఉన్న రోజుల్లో సైన్సు మీద ఉన్న ప్రేమతో ఆ రాష్ట్ర గవర్నర్ ద్వారా ఎంచుకున్న జాతీయ యూత్ సైన్స్ క్యాంప్‌కు ప్రాతినిధ్యం వహించింది. సిలికాన్ వ్యాలీలో ఉన్న స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్‌లో సింబాలిక్ సిస్టమ్స్ పై బ్యాచిలర్ డిగ్రీ, కంప్యూటర్స్‌లో మాస్టర్స్ డిగ్రీని సాధించింది. తన క్లాస్ మేట్స్ లారీ పేజి, సెర్జీ బ్రిన్‌తో కలిసి 1999లో గూగుల్ కంపెనీలో చేరిన మొదటి మహిళా ఇంజనీర్.
లారీ పేజి గూగుల్ వీడ్కోలు సభలో మాట్లాడుతూ 13 సంవత్సరాల క్రితం 20వ నెంబర్ ఉద్యోగిగా చేరిన మారిసా మేయర్ గూగుల్ వినియోగదారులకు అలసిపోకుండా తన సేవలను అందించిన ఛాంపియన్ అంటూ కొనియాడారు. గూగుల్ శోధన, జియో, మరియు స్థానిక ఉత్పత్తుల కోసం మారిసా మేయర్ ఎంతగానో వాటి అభివృద్ధి దోహదపడింది. గూగుల్ కంపెనీలో ఆమె టాలెంట్‌ని మిస్ అవుతున్నాం అని అన్నాడు.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న గూగుల్ ఫీచర్స్ సెర్చ్ ఇంజన్, హోం పేజిని ఒక రూపుకి తీసుకువచ్చింది మారిసా మేయర్ కావడం విశేషం. ఇటీవల కాలంలో మారిసా మేయర్ లోకల్, మ్యాప్స్, లోకేషన్ సర్వీసెస్, లోకల్ మరియు భౌగోళిక ఉత్పత్తులకు నిలయమైన ఇంటర్నెట్ గెయింట్ ఉత్పత్తులు జగత్ రెస్టారెంట్ రివ్యూలతో పాటు స్ట్రీట్ వివ్ తదితర కొత్త టెక్నాలజీల అభివృద్ది మారిసా మేయర్ నిర్వహాణలో జరిగాయన్నారు.

గూగుల్‌లో చేరక ముందు మారిసా మేయర్ జురిచ్‌, స్విట్జర్లాండ్‌లో ఉన్న UBS research lab (Ubilab) మరియు కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్ లో SRI International పని చేశారు. దీనితో పాటు తాను చదువుకున్న స్టాన్ ఫోర్ట్ యూనివర్సిటీలో కంప్యూటర్ ప్రొగ్రామింగ్‌ని కొన్నాళ్లు బోధించారు.

గతయేడాది బిజినెస్ రంగంలో ('40 under (age) 40')40 సంవత్సరాలకు లోబడి పైకి ఎదుగుతున్న స్టార్స్‌లలో ఫేస్‌బుక్ ఫౌండర్ మార్క్ జూకర్స్ బర్గ్, ట్విట్టర్ కో ఫౌండర్ జాక్ దోర్సే లతో పాటు అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. మారిసా మేయర్‌కి గ్లామరస్ మ్యాగజైన్ 'ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు' లాంటి అవార్డుతో పాటు, ఇటీవల జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో యంగ్ గ్లోబర్ లీడర్‌గా అనువదించబడింది. నాలుగు సంవత్సరాల పాటు వరుసగా ఫార్చూన్ పత్రిక ప్రకటించిన టాప్ 50 మోస్ట్ పవర్ పుల్ ఉమెన్ జాబితాలో స్దానం దక్కించుకున్నారు.